
కోడెల కుమారుడిపై కిడ్నాప్ కేసు
దౌర్జన్యం చేసి తన బిడ్డను ఎత్తుకెళ్లారని భార్య ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై విశాఖపట్నంలోని మూడోపట్టణ పోలీసులు కిడ్నాప్‌కేసు నమోదు చేశారు. బుధవారం అర్ధరాత్రి పదిమంది అనుచరులతో కలిసి తన భర్త శివరామకృష్ణ తన ఇంటిపై దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసి నాలుగేళ్ల బిడ్డ గౌతమ్‌ను తీసుకెళ్లి పోయినట్లు భార్య పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో శివరామకృష్ణపై గురువారం కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తూర్పు జోన్ ఏసీపీ మహేష్ మీడియాకు తెలిపారు.