జూలైలో ఏపీ సెట్-2014 | APCET -2014 notification may relases in july | Sakshi
Sakshi News home page

జూలైలో ఏపీ సెట్-2014

Published Tue, May 13 2014 4:30 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

APCET -2014 notification may relases in july

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీసెట్-2014 ప్రకటన జూలైలో వెలువడే అవకాశముంది. ఉస్మానియా వర్సిటీలో ఏపీసెట్-2013లో అర్హత సాధించిన అభ్యర్థులకు వర్సిటీ ఉపకులపతి సత్యనారాయణ, సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. ఓయూ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏపీసెట్-2014 ప్రకటన విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏపీసెట్‌ను రెండు పర్యాయాలు విజయవంతంగా కొనసాగించిన ఓయూ మూడో సారి ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ పంపినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒకేసారి సెట్ నిర్వహించినా ఫలితాలను వేర్వేరుగా ప్రకటిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement