satya narayana
-
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.విజయ్ గెలుపు అసాధ్యంకానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు. -
బండారు కథ కంచికి!
పెందుర్తి (విశాఖ జిల్లా): బండారు సత్య నారాయణమూర్తి... 40 ఏళ్ల రాజకీయానుభవం. ఐదుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి.. కానీ ఏం లాభం. చంద్రబాబు ఛీ పొమ్మన్నారు. టికెట్ లేదనేశారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్లకు టికెట్ దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో బండారు భవిష్యత్తు డోలాయమానంలో పడింది. బీసీలపై చంద్రబాబు చూపించే కపట ప్రేమకు బండారు ఉదంతమే తాజా ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం అధికార పక్షంపై, మహిళా మంత్రి రోజాపై బండారు నోరు పారేసుకుని అభాసుపాలయ్యారు. పార్టీ కోసం చేతి చమురు వదిలించుకున్నారు. అయినా వాడుకుని వదిలేసే చంద్రబాబు చివరకు అదే చేశారు. తన అల్లుడైన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు, వియ్యంకుడైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుల సిఫార్సులు కూడా బండారును గట్టెక్కించలేక పోయాయి. దీంతో టికెట్ రేసు నుంచి తప్పుకుని పత్తాలేకుండా పోయారు. రెండు వారాలుగా కార్యకర్తలకు అందుబాటులో లేరు. ముఖ్యమైన ఏ సమావేశంలోనూ కనిపించడం లేదు. ఇటీవల టీడీపీ–జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జెండా, జయహో బీసీ సభలకు కూడా దూరంగా ఉండడంతో కేడర్‌కు ఏమీ పాలుపోవడంలేదు. ఒక్కసారిగా సీన్ రివర్స్ పెందుర్తి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోనేందుకు ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకోవడంతో గత కొన్నాళ్లుగా ‘టికెట్ మాదంటే మాది’ అంటూ జనసేన, టీడీపీలు ప్రచారం చేసుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ చరమాంకంలో ఉన్న టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి గంపెడాసలు పెట్టుకున్నారు. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో టికెట్ రేసులో పోటీ పడ్డారు. ‘తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే ఆఖరి కదా.. చంద్రబాబు కూడా అవకాశం ఇస్తారు’ అన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కేడర్‌తో సమావేశాలు నిర్వహించారు. బహిరంగ వేదికలపై అధికార పక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చారు. మంత్రి రోజాను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో టికెట్ బండారుదేనని టీడీపీ కేడర్ కూడా ధీమాగా ఉంది. అయితే పెందుర్తి టికెట్ కోసం పంచకర్ల రమేష్‌బాబు పట్టుపట్టడం, సీట్ల పంపకాల్లో కచ్చితంగా పెందుర్తిని జనసేనకే కేటాయిస్తారని బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పంచకర్ల కూడా నియోజకవర్గంలో జోరు పెంచడంతో అవమానభారంతో కేడర్‌కు బండారు మొహం చూపించట్లేదు. వరుస ఓటములతో అవమానం ఒకప్పుడు రాజకీయంగా వైభవం చూసిన బండారులో 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత మరింత జోష్ కనిపించింది. అయితే టీడీపీ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో లెక్కలేని అవినీతి.. కొడుకు అప్పలనాయుడు వ్యవహారశైలి కారణంగా సత్యనారాయణమూర్తి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చేతిలో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2022పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామం వెన్నెలపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన భార్య మాధవీలత సహా పంచాయతీలో పది వార్డుల్లోనూ బండారు అనుచరులు చిత్తుగా ఓడిపోయారు. దెబ్బ మీద దెబ్బ.. చందంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెన్నెలపాలెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అయితే ప్రజాతీర్పును గౌరవించని బండారు ఆ తరువాత పూర్తిగా అదుపు తప్పారు. వరుస ఓటముల అవమానభారంతో అధికార పార్టీపై నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా అని బయటకు ప్రచారం చేసుకుంటున్నా.. జనంలో పూర్తిగా గుర్తింపు కోల్పోయారన్న కారణంతోనే బండారును చంద్రబాబు పక్కన పెట్టారని టీడీపీ నాయకులే అంటున్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ 29న రిలీజ్
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు లైన్ క్లియర్
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో ఈ రెండు సినిమాలు విడుదల చేయవద్దు అంటూ సత్యనారాయణ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. విచారణ జరిపిన హైకోర్ట్.. ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, కావున ఈ రెండు సినిమాల విడుదలను ఆపటం కుదరదని తేల్చి చెప్పింది. రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రెండు సినిమాల్లో సన్నివేశాలు ఏవైనా అభ్యంతరకరంగా వాటిపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. తెలంగాణలో సినిమా విడుదల చేసిన ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తమ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని హైకోర్టుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సినిమా విడుదలకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ముందుగా ఈ నెల 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావటంతో 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మీస్ వీరగ్రంథం కూడా మార్చి 22నే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సీఎచ్ సత్యనారాయణ ప్రచారం
-
వ్యాపారి ఇంట్లో 25 తులాల బంగారం చోరీ
మధురానగర్(హైదరాబాద్‌సిటీ): ఓ వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం చోరీంది. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్‌లో సోమవారం అర్థరాత్రి జరిగింది. మధురానగర్‌కు చెందిన సత్యనారాయణ ఇంటిలో సోమవారం గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అతని ఇంటినుంచి 25 తులాల బంగారం, రెండు కిలోల వెండిని దొంగలు అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల దొంగాట
నాలుగో సింహానికి తలవంపులు వరుస ఘటనలతో దిగజారుతున్న ప్రతిష్ట తాజాగా ముగ్గురు పోలీసుల అరెస్టు అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు దారి దోపిడీ వ్యవహారమే కారణం విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ క్రమశిక్షణకు మారుపేరుగా భావించే రక్షక భటులు.. భక్షకులుగా దిగజారిపోతున్నారు. కనిపించని నాలుగో సింహంగా కాలరెగరేసుకు తిరగాల్సిన పోలీసులు.. సమాజం ఎదుట దోషులుగా తల దించుకుంటున్నారు. లోకాన్ని ఆడించే డబ్బుకు దాసోహమంటూ చేయి చాస్తున్నారు. మొత్తంగా పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. ఇటీవలి వరుస ఘటనలు జిల్లా పోలీసుల పరువును బజారున పడేశాయి. కుటుంబంలో ఎవరు తప్పు చేసినా యజమాని వైపు వేలెత్తి చూపడం సహజం. మరి పోలీసుల తప్పునకు ఎవరిని ప్రశ్నిద్దాం. కర్నూలు : వరకట్న వేధింపుల కేసులో నిందితులను అరెస్టు చేయకుండా ఉండేందుకు మహిళా పీఎస్ ఎస్ఐ మద్దయ్య రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కగా.. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎస్పీ సంతకం ఫోర్జరీతో రూ.22.50 లక్షలు వసూలు చేసిన ఏపీఎస్పీ రెండో పటాలం ఆర్ఎస్ఐ కృష్ణుడు కటకటాలపాలయ్యాడు. ఈ మరకలు చెరిగిపోక మునుపే ముగ్గురు పోలీసుల దోపిడీ వ్యవహారం ఆ శాఖను కుదిపేస్తోంది. ఎమ్మిగనూరులో బాంబే జువెలర్స్ యజమాని అలీం ఫిర్యాదు మేరకు బెంగళూరులోని అల్సూర్ పోలీసులు ఆదోనికి చెందిన వన్‌టౌన్ కానిస్టేబుల్ జయన్న, ఏఆర్ కానిస్టేబుళ్లు శేఖర్, సత్యనారాయణలను ఆదివారం అరెస్టు చేసిన ఘటన సాటి పోలీసులను తలెత్తుకోలేకుండా చేస్తోంది. సత్యనారాయణ పోలీసు శాఖలోని మోటార్ ట్రాన్స్‌పోర్టు సెక్షన్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతని తండ్రి ఏపీఎస్పీలో ఆర్ఎస్ఐగా పని చేసి పదవీ విరమణ పొందారు. 1994లో పోలీసు శాఖలో విధుల్లో చేరిన సత్యనారాయణ ప్రస్తుతం పత్తికొండ సీఐ వద్ద డ్రైవర్‌గా ఉన్నాడు. మట్కా వ్యసనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయన.. ఆర్థిక ఇక్కట్ల నుంచి బయటపడేందుకు నేరాల బాట పట్టి పోలీసు శాఖకే కలంకం తీసుకొచ్చాడు. ఇక అరెస్టయిన మరో ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ 1994లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి.. రెండేళ్ల క్రితం ఏఆర్‌కు డిప్యూటేషన్‌పై వచ్చాడు. వెల్దుర్తి మండలానికి చెందిన ఈయన ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటున్నాడు. కానిస్టేబుల్ జయన్న విషయానికొస్తే.. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఆయనను దారి తప్పించినట్లు తెలుస్తోంది. ఆదోని పట్టణాన్ని పట్టుకుని వేలాడుతున్న పోలీసుల విషయంలో ‘బాస్’ పట్టించుకోకపోవడం వల్లే ఈ తరహా ఘటనలకు కారణమవుతుందనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు కాన్వాయ్‌లో నిందితుల గుర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు పర్యటన సందర్భంగా శేఖర్‌తో పాటు సత్యనారాయణ బందోబస్తు విధులకు హాజరయ్యారు. బాంబే జ్యువెలర్స్ యజమాని అలీం వారిద్దరినీ గుర్తించి బెంగళూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. బెంగుళూరు పోలీసులు శనివారం రాత్రి ఎమ్మిగనూరుకు వచ్చి సత్యనారాయణతో పాటు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆదోని పోలీసు క్వార్టర్స్‌లో నివాసముంటున్న జయన్నను కూడా అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. ఈ ఘటన జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలోనూ దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆదోని పట్టణానికి చెందిన ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ పంచాయితీలు చేస్తూ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతూ ముగ్గురు కానిస్టేబుళ్లు శాఖాపరమైన చర్యలకు లోనయ్యారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలోనైనా పోలీసు బాసు మేల్కొనకపోతే ఆ శాఖ పరువు మరింత దిగజారక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విచారణకు ఎస్పీ ఆదేశం కర్ణాటకలో కర్నూలు పోలీసులు దారి దోపిడీకి పాల్పడిన ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణకు సూచించారు. నేరం రుజువైతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా!
అధికార పక్షానికి ప్రతిపక్ష నేత జగన్ చురకలు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలంటూ హితవు సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ సభ్యుడు సత్యనారాయణకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో జగన్ లేచి బయటకు వెళ్లారు. వెంటనే మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకొని.. ‘ముఖ్యమైన అంశం మీద చర్చ జరుగుతోంది. విపక్ష నేత సభలో లేరు. మళ్లీ వస్తారో లేదో తెలియదు. హడావుడి చేయించి జారుకున్నారు. చర్చించకుండా ఇంటికి జారుకోవడం విపక్ష నేతల లక్షణం కాదు. జగన్ చల్లగా ఇంటికి జారుకున్నారు’ వంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. సత్యనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగించారు. నాలుగైదు నిమిషాల తర్వాత జగన్ తిరిగి తన స్థానానికి వచ్చి కూర్చున్నారు. యనమల వ్యాఖ్యలను పార్టీ సభ్యులు ఆయనకు చెప్పారు. స్పందించిన జగన్.. ‘రెస్టురూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా? ఎంత దారుణమైన పరిస్థితి సభలో ఉంది. ఎంత అప్రజాస్వామికం. ముందుగా చర్చించకుండానే ముఖ్యమంత్రి రాజధానిపై సభలో ప్రకటన చేశారు. రెండున్నర గంటలు మాట్లాడారు. అధికార పక్ష సభ్యులు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి’ అంటూ చురకలు వేశారు. ఇరుకున పడిన యనమల నీళ్లు నములుతూ.. తన వ్యాఖ్యలకు స్పందించి విపక్ష నేత వెనక్కి వచ్చినందుకు ధన్యవాదాలంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. -
ఇది ఆమె జీవనచిత్రం
కొన్నేళ్ల కిందటి వరకు ఆమె సాధారణ గృహిణి. భర్త... కూతురితో అందంగా అల్లుకున్న పొదరిల్లు ఆమెది. ఓ రోజు... ఊహించని ప్రమాదం. బస్సు తాకిడికి కింద పడిపోయారామె. బస్సు చక్రం ఆమె చేతి మీద నుంచి వెళ్లిపోయింది. తాను కోల్పోయింది చేతినా... జీవితాన్నా? ఈ ప్రశ్నకు తనకు తానే సమాధానం చెప్పుకున్నారామె. ఇప్పుడామె... ఒక చేత్తోనే బొమ్మలు వేస్తున్నారు. చిన్న పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పిస్తున్నారు. గాంధీజీ ఆశయాలను బోధిస్తున్నారు. జీవితాన్ని జయించడం ఇలా... అంటున్నారు. తన జీవితాన్ని కొత్తగా చిత్రించుకున్నారు. గూడూరు లక్ష్మిది శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. జిల్లా కేంద్రం నెల్లూరులోని పొగతోటలో ఆమె నివాసం. లక్ష్మి తాత రావూరు జయరామిరెడ్డి సినీ నటుడు. విజయ వాహిని స్టూడియోలో పనిచేసేవారు. ఆమె పుట్టే నాటికి చెన్నై నగరంలో ఉన్న వారి కుటుంబం తండ్రికి లైబ్రేరియన్‌గా ఉద్యోగం రావడంతో నెల్లూరు జిల్లా వాకాడుకు మారింది. పెద్దయిన తర్వాత లక్ష్మణ్‌కుమార్‌తో వివాహమైంది. ఇంత వరకు ఎటువంటి ప్రత్యేకతలూ లేకుండానే చాలా సాధారణంగా గడిచిపోయింది ఆమె జీవితం. పెళ్లయిన ఏడేళ్ల వరకు వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోయింది. ఓ రోజు బంధువుల పెళ్లికి భర్తతోపాటు బైక్ మీద వెళ్తున్నారామె. ఇంతలో... వెనుక నుంచి బస్సు వచ్చి ఢీకొట్టింది. తేరుకుని చూస్తే ఎడమ చెయ్యి రెండుగా తెగిపోయి దూరంగా పడి ఉంది. ఆ చేతిని అతికించడం అసాధ్యమన్నారు డాక్టర్లు. ఆ పరిస్థితిలో భర్త, కుటుంబసభ్యులందరూ ఆమెకి ధైర్యం చెప్పారు. కానీ ఆమెని ఆవరించిన దిగులు మాత్రం వదల్లేదు. తాను కొలిచే దేవుడే పలికించినట్లు... ప్రమాదం గురించి తెలిసిన బంధువుల్లో ఒక్కొక్కరు ఒక్కోరోజు వచ్చి పలకరించి పోతున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు జీవితం పట్ల నిరాశ చెందవద్దని ధైర్యం చెప్పి పోతున్నారు. అలాంటప్పుడు కూతురు లాస్య అన్న మాటలే తనకు మార్గదర్శనం చేశాయంటారు లక్ష్మి. బంధువుల్లో ఒకామె... ‘‘లాస్యా... మీ అమ్మకి చేయి లేదు కదా. తనేమీ చేసుకోలేదు. నువ్వు సాయం చేస్తుండాలి’’ అన్నారు. వెంటనే లాస్య... ఉక్రోషంతో ‘‘మా అమ్మ ఒక్క చేత్తోనే అన్ని పనులూ చక్కగా చేస్తోంది. ఒకచెయ్యి లేకపోతేనేం మరో చెయ్యి ఉందిగా. ఎవ్వరూ మా అమ్మకు చెయ్యి లేదనవద్దు’’ అన్నది. ఆరేళ్ల లాస్యకు ఏం తెలిసి అన్నదో కానీ ఆ మాటలే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయంటారు లక్ష్మి. ‘‘బహుశా నేను పూజించే దేవుడే పాప చేత ఆ మాటలు పలికించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఏ రోజూ నాకు చెయ్యి లేదనుకోలేదు. ఉన్న చేత్తోనే ఏమేం చేయవచ్చో అన్నీ చేస్తున్నాను. అప్పటికే నాకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. కుట్లు, అల్లికలు బాగా చేసేదాన్ని. ప్రమాదం తర్వాత చిత్రలేఖనంలో మళ్లీ శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ పెయింటింగ్స్, తంజావూరు పెయింటింగ్స్, పాట్ పెయింటింగ్... అనేక రకాల చిత్రలేఖనాలు వేస్తున్నాను. నాలో ఉన్న కళకు మెరుగులు దిద్దుకోకుండా ఇంటికే పరిమితమవుతున్నానని ఆ దేవుడే ఇలా చేశాడేమో అనుకుంటున్నాను’’ అని స్థితప్రజ్ఞతతో అన్నారామె. గాంధీజీ స్ఫూర్తితో... లక్ష్మి వేసిన బొమ్మలలో గాంధీజీ ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఆమె ఆసక్తి ఉన్న చిన్న పిల్లలకు చిత్రలేఖనంలో ఉచితంగా శిక్షణనిస్తుంటారు. పిల్లలకు గాంధీజీ ఆశయాలను బోధిస్తుంటారు. గాంధీ ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్లో చురుగ్గా పాల్గొంటారు. అదే విషయాలను ప్రస్తావించినప్పుడు... ఆమె బాల్యంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. ‘‘నాకు మా తాత దగ్గర పెరగడం ఇష్టం. ఆయనతో సినిమా షూటింగులకు వెళ్లడం ఇష్టం. అలా తరచూ మద్రాసు (చెన్నై)కు వెళ్లేదాన్ని. ఒకసారి... అవి ‘యమగోల’ షూటింగ్ జరుగుతున్న రోజులు. తాతతోపాటు స్టూడియోకి వెళ్లాను. నటుడు కైకాల సత్యనారాయణగారు కనిపించారు. దగ్గరకు వెళ్లి పలకరించాను. అప్పుడాయన ‘‘పరిచయం లేకపోయినా సరే చూడగానే గుర్తు పట్టి వచ్చి పలకరించావు. నీలో మంచి విల్‌పవర్, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నువ్వేమైనా సాధించగలవు’’ అని మెచ్చుకున్నారు. అప్పుడే ఆయన గాంధీజీ గురించి చాలా చెప్పారు. అలా గాంధీజీ గురించి చదవడం అలవాటైంది. ఆ తర్వాత బొమ్మలు వేయడం కూడా. ఒకసారి పల్లెపాడు గ్రామం (నెల్లూరు జిల్లా)లో ఉన్న గాంధీజీ ఆశ్రమం నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను ఆశ్రమ నిర్వహణ బాధ్యత తీసుకోవడానికి సంతోషంగా అంగీకరించాను’’ అన్నారు. చేతిరాత బాగుంటే... గాంధీ ఆశ్రమంలోని పిల్లలకు చిత్రలేఖనం నేర్పించడానికి మరో కారణాన్ని చెప్తారు లక్ష్మి. గాంధీజీ తరచుగా ‘చేతిరాత బాగాలేకపోతే తల రాత బాగుండదనేవారు’ పిల్లల చేతిరాత బాగుపడాలంటే చిత్రలేఖనం మంచి మార్గం- అనుకున్నాననంటారు. రక్తదానం ఎన్నిసార్లు చేశారంటే ఆమె నుంచి ఇన్నిసార్లనే సమాధానం రాదు. ఎన్నిసార్లు చేశానో లెక్కపెట్టుకోలేదు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ‘ఉత్తమ సేవా ప్రతినిధి అవార్డు’ అందుకున్నారామె. గాంధీ ఆశ్రమ నిర్వహణలో భాగంగా చాలా సందర్భాల్లో ఆమె చేతి నుంచి డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. ఒకసారి లక్ష్మి అల్లుడు (లాస్య భర్త) లక్షన్నర రూపాయల వరకు సహాయం చేశారు. ‘‘ఆ సంఘటనతో నా కుటుంబం నాకే కాక, నా ఆశయానికి కూడా అండగా ఉందనిపించి చాలా సంతోషం కలిగింది’’ అన్నారామె. లక్ష్మి తన జీవితాన్ని పలువురికి స్ఫూర్తిదాయకంగా మలుచుకున్నారు. నెల్లూరు నగరంలో ఏటా ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర జరుగుతుంది. ఆ రథం మీద శంకుచక్రాలు, హనుమంతుడు, గోవిందనామాలతోపాటు, ఇస్కాన్ మందిరంలో పరదాల మీద చిత్రాలు కూడా లక్ష్మి వేసినవే. ఎవరి జీవితంలోనైనా ప్రమాదం జరిగితే అది వారి జీవితాన్ని అనూహ్యమైన మలుపులు తిప్పుతుంది. చాలా మంది ప్రమాదం తర్వాత ఆ దిగులుతో ఇంటి నాలుగ్గోడలకే పరిమితమవుతుంటారు. కానీ లక్ష్మి మాత్రం ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని చక్కటి మలుపులు తిప్పుకున్నారు. - సాక్షి, నెల్లూరుఫొటోలు : ఆవుల కమలాకర్ నటులు సత్యనారాయణగారు మనందరం ఆ జాతిపిత అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆ మాటలు నాలో చాలా ప్రభావం చూపించాయి. నాన్న లైబ్రేరియన్ కావడంతో పుస్తకాలు చదివే అవకాశం ఉండేది. గాంధీజీ పుస్తకాలే ఎక్కువగా చదివేదాన్ని. చిత్రలేఖనంలోనూ ఎక్కువ గాంధీజీ బొమ్మలే వేస్తున్నాను. బాపూజీ బొమ్మ వేయడం నాకిష్టం. - లక్ష్మి, విధిని జయించిన మహిళ -
జూలైలో ఏపీ సెట్-2014
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీసెట్-2014 ప్రకటన జూలైలో వెలువడే అవకాశముంది. ఉస్మానియా వర్సిటీలో ఏపీసెట్-2013లో అర్హత సాధించిన అభ్యర్థులకు వర్సిటీ ఉపకులపతి సత్యనారాయణ, సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. ఓయూ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏపీసెట్-2014 ప్రకటన విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏపీసెట్‌ను రెండు పర్యాయాలు విజయవంతంగా కొనసాగించిన ఓయూ మూడో సారి ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ పంపినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒకేసారి సెట్ నిర్వహించినా ఫలితాలను వేర్వేరుగా ప్రకటిస్తామన్నారు. -
కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షునిగా యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా పనిచేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి తొలివారంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించి మూడేళ్లపాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. హిందీ భాషాభివృద్ధి, హిందీ భాష బోధన నాణ్యత మెరుగుదలకు అవసరమైన చర్యలు, హిందీ ఉపాధ్యాయులకు శిక్షణ, హిందీ భాషపై పరిశోధనలతోపాటు పలు భారతీయ భాషలకు సంబంధించిన అనేక అధ్యయనాలను సంస్థ నిర్వహిస్తోంది. 1960లో తెలుగువారైన పద్మభూషణ్ డాక్టర్ మోటూరు సత్యనారాయణ ప్రారంభించిన ఈ సంస్థకు ఉపాధ్యక్షునిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి యార్లగడ్డ కావడం విశేషం. ఈ సందర్భంగా యార్లగడ్డ.. ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సత్య మనోడే
యల్లనూరు, న్యూస్‌లైన్/సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్‌గేట్స్ తీసుకున్న నిర్ణయంతో ‘అనంత’ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది. ఆ సంస్థ నూతన సీఈఓగా నాదెళ్ల సత్యనారాయణ చౌదరి అలియాస్ సత్య ఎంపికపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యల్లనూరు మండలం బుక్కాపురం ఆయన స్వస్థలం. ఆయన తండ్రి బీఎన్ యుగంధర్ రిటైర్టు ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ నాయుడు ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. సత్య స్కూలు విద్య హైదరాబాద్‌లో అభ్యసిస్తుండగా ఒకసారి మాత్రమే గ్రామానికి వచ్చినట్లు సమీప బంధువులు చెప్పారు. యుగంధర్ మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారు. ఏడాది క్రితం కూడా గ్రామానికి వచ్చారు. తాడిపత్రిలోని అరవింద్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాగా, సత్య అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించడంపై గ్రామ సర్పంచ్, వారి బంధువు శంకరయ్య హర్షం వ్యక్తం చేశారు. సత్య ఎంపిక పట్ల అనంతపురం జిల్లాకు భవిష్యత్‌లో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రూ.కోటిన్నర టోపీ
వారంతా నిరుపేదకూలీలు. కాయకష్టం చేసి బతికెటోళ్లు. నిరక్షరాస్యులైన వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. పేరున్న సంస్థల్లో బీమా చేయిస్తానని ముందుకొచ్చాడో వ్యక్తి. ఇలా ఐదువేల మంది పేదల నుంచి సుమారు రూ.కోటిన్నర వసూలు చేసి.. చివరకు బోర్డు తిప్పేశాడు. తాము మోసపోయామని గుర్తించిన పేదలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. హుస్నాబాద్, న్యూస్‌లైన్ : వరంగల్ జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్ రాజ్‌కమల్ ఏజెన్సీస్ పేరిట మూడేళ్ల క్రితం హుస్నాబాద్‌లో దుకాణం తెరిచాడు. తమ సంస్థలో పని చేసేందుకు ఏజెంట్లు కావాలని ప్రకటనలు జారీ చేశాడు. తమకు ఉపాధి దొరుకుతుందని నమ్మి 60 మంది ఏజెంట్లు ఇందులో చేరారు. నెలకు రూ.వంద నుంచి పొదుపు చేస్తామని, పొదుపు చేస్తున్న సమయంలో ఎవరైనా మరణిస్తే వేలరూపాయలు వస్తాయని, ఐదేళ్ల కాల పరిమితి తర్వాత రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఏజెంట్లు నమ్మారు. ఈ డబ్బు లు బజాజ్ ఎలియంజ్, ఎల్ఐసీ, టాటా, రిలయన్స్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెడతామని చెప్పడంతో వేలాదిమందిని సభ్యులుగా చేర్పించారు. రెండున్నరేళ్లపాటు ఇలా సభ్యుల నుంచి సేకరించిన సొమ్మును స్వాహా చేయడం మొదలుపెట్టారు. అనేకమందికి బీమాబాండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే డబ్బులు సొంతానికి వాడుకున్నారు. ప్రతీ నెల ఐదో తేదీ వరకు ఏజెంట్లు వచ్చి డబ్బులు తీసుకెళ్లేవారు. ఈ నెలలో రాకపోవడంతో పలువురు హుస్నాబాద్‌లోని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కార్యాలయం మూసి ఉండడంతో అనుమానం వచ్చి ఈప్రాంత ఏజెంట్ సత్యనారాయణ వద్దకు వెళ్లారు. సంస్థ వారు రావడం లేదని చెప్పడంతో మోసపోయామని గుర్తించిన వారు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సంస్థ తమను మోసం చేసిందంటూ ఏజెంట్ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నీ తప్పులే.. ప్రజల డబ్బులను ఆయా బీమా కంపెనీల్లో కట్టాల్సిన సంతోష్ తనే స్వాహాచేశాడు. పేరుకు మాత్రం ఆయా కంపెనీల్లో చెల్లిస్తున్నట్లు తన సంస్థ రశీదులు ఇచ్చాడు. సభ్యుల చిరునామాలను సైతం తప్పుగానే చూపించాడు. మండలంలోని రామవరం, చిగురుమామిడి గ్రామాలకు చెందిన పలువురి చిరునామాను హుస్నాబాద్‌గా చూపించాడు. వీరిలో కొంతమంది డబ్బులు మాత్రమే చెల్లించాడు. అదీ వెంటనే జమచేయకుండా ఆరు నెలల అనంతరం జమచేశాడు. ఇలా అనేకరకాలుగా ప్రజలను సంస్థ మోసం చేసింది. ఎవరీ సంతోష్.. వరంగల్ జిల్లాకు చెందిన సంతోష్ ఆ జిల్లాకేంద్రంలోని ఓ బీమా కంపెనీలో కొద్ది కాలం పని చేసినట్లు తెలిసింది. అనంతరం తానే స్వయంగా బీమా కంపెనీ పేరిట డబ్బులు దండుకునేందుకు దుకాణం తెరిచి ప్రజలను మోసం చేశాడు. పైగా సభ్యులు చెల్లించిన డబ్బులను ఓ వ్యక్తికి ఇచ్చానంటూ పోలీసులను నమ్మించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. కోటిరూపాయలకుపైగా వసూలు చేసిన సంతోష్ తాను మాత్రం రూ. అరవై లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు చెబుతున్నాడు. సంతోష్‌పై కేసు నమోదు ప్రజలను మోసం చేసి అకినపల్లి సంతోష్‌పై కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై శ్రీరాములు తెలిపారు. ర్యాకల సత్యనారాయణ అనే ఏజెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంతోష్ రూ. 1.12కోట్లు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని తెలిపారు. కూలీ చేసిన పైసలు కట్టాం.. మూడేళ్ల నుంచి నెలకు రెండు వందల దాకా కట్టిన. కూలీ పని చేసి తెచ్చిన పైసలు ఎందుకన్న అక్కరకు వత్తయని కట్టిన. మా వాడకు అందరూ కడితే నేను కూడా ఇచ్చిన. ఇట్ల చేత్తడనుకోలే. - చాంద్‌బీ, రామవరం పైసలత్తయని చెప్పిండు నెలకు వంద రూపాలసొప్పు న ఇరువై ఎనిమిది నెలలు క ట్టినం. నా భర్త దసరా పండుగప్పుడు సచ్చిపోయిండు. పదమూడువేలు అత్తయి అని చెప్పిండ్రు. ఖాతాతీయుమంటే తీసిన. కానీ పైసలింకా రాలేదు. - బొమ్మ యాదవ్వ, రామవరం ఐదేండ్లకే తొమ్మిదివేలు ఇత్తమన్నరు నెలకు వంద సొప్పున మూడువేల ఆరువందల దాకా కట్టిన. ఐదేండ్లకే తొమ్మిది వేలు ఇత్తమన్నరు. ఈ నెలల ఈడికచ్చిసూత్తే ఆఫీసు మూసి ఉంది. ఎంజెయ్యాల్నో అర్థమైతలేదు. దాసుకున్న పైసలు గిట్ల ఎత్తుకపోయిండ్రు. - జాతరబోయిన ఎల్లవ్వ -
అంతులేని వ్యధలు మిస్టరీ మరణాలు
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: కృష్ణానదిలో అంతుచిక్కని మరణాలు... మృగాళ్ల బారిన పడి తనువు చాలించిన అబలలు కొందరైతే, బతుకు భారమై ఆత్మహత్య లకు పాల్పడేవారు మరి కొందరు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో హత్యకు గురైన వారు కొందరైతే, ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించినవారు ఇంకొందరు. ఇలా ఏడాది పొడవునా ఎందరో అభాగ్యులు, అనాథలు కృష్ణానదిలో తనువు చాలించి, చివరకు ప్రకాశం బ్యారేజి వద్ద మృతదేహాలుగా తేలుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసులు గుర్తించిన మృతదేహాల సంఖ్య 78, వీటిలో 36 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మిగిలినవారిని బంధువులు గుర్తించారు. అంతుచిక్కని 36 మృతదేహాలను పోలీసులు నమోదు చేసుకున్నారే తప్ప వాటిమీద దర్యాప్తు చేయలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో మంతెన గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి చంపి కృష్ణా నదిలో పడవేసిన విషయం ఆరు నెలల తరువాత గాని వెలుగుచూడలేదు. బ్యారేజి వద్ద నిఘా పెంచాలి... ప్రకాశం బ్యారేజికి ఇరువైపులా పోలీసులు నిఘా పెంచి వాహనాల తనిఖీలు చేపట్టగలిగితే కొన్ని కేసులు చిక్కుముడి వీడగలదు. గుంటూరు జిల్లా పరిధి ప్రకాశం బ్యారేజి 36వ కానా వరకు ఉండగా, తాడేపల్లి అవుట్ పోస్టు వద్ద నుంచి 6వ కానా కనపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో గత సంవత్సరకాలంలో ఆత్మహత్యలకు పాల్పడబోయిన 15 మందిని పోలీసులు కాపాడగలిగారు. అలాగే అవుట్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేయడం వల్ల సంఘ విద్రోహశక్తులను అదుపులోకి తీసుకోగలిగారు. ప్రకాశం బ్యారేజిని అడ్డాగా చేసుకుని గంజాయి అమ్మకాలను కూడా నివారించగలిగారు. అవుట్‌పోస్టు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయగలిగితే... తాడేపల్లి పోలీసులు ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టు మాదిరిగానే విజయవాడ పోలీసులు అటువైపు బ్యారేజి వద్ద అవుట్ పోస్టుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బ్యారేజిపై ఆత్మహత్యలు, హత్యలను నిలువరించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఓ ప్రేమ జంట బ్యారేజి మీద మాట్లాడుకుంటుండగానే హఠాత్తుగా ప్రియురాలు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన వాహనచోదకులు 100కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిఘా అయితే పెంచారు కానీ ప్రియుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. చివరకు మృతదేహం ఎవరిదో ఈ నాటికీ గుర్తించలేకపోయారు. అదే అవుట్ పోస్టు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ప్రియుడిని ఆనాడే గుర్తించగలిగేవారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ప్రకాశం బ్యారేజి 34వ కానా వద్ద జీన్ ప్యాంటు, టీషర్టు ధరించిన సుమారు 20 సంవత్సరాల లోపు వయస్సు గల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా, అనేది పోలీసులకే అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సంయుక్తంగా ప్రకాశం బ్యారేజి మొత్తం కనబడే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నది వద్ద చాలా వరకు హత్యలను, ఆత్మహత్యలను నిలువరించే అవకాశం లేకపోలేదు. -
ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ
సాక్షి, హైదరాబాద్: భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది పరారయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు మంగళవారం సాయంత్రానికి ఎనిమిది మందిని పట్టుకోగా... మరో ముగ్గురు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీరికోసం వేట ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి 9.30-12.30 మధ్య జరిగిన ఈ ఘటన వివరాలివి... నాంపల్లిలోని ఛాపెల్ రోడ్ ఫాహుద్దీన్ ఖురేషీ (38)పై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాలు కలిగిన తదితర కేసులు నమోదై ఉన్నాయి. ఫలితంగా చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఇతడి మానసిక పరిస్థితి బాలేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖురేషీ రెండో భార్య అతడిని కలిసేందుకు రాగా ఆర్ఎంఓ ఓంప్రకాష్ అనుమతించలేదు. దీంతో ఖురేషీ దాదాపు రెండు గంటల పాటు ప్రిజనల్ వార్డులో హంగామా సృష్టించాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్షీట్లను తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీనివల్ల తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. ఈ హడావిడిలో అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి ఖురేషీ మరో పదిమంది ఖైదీలతో పారిపోయాడు. ప్రిజనల్ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మాజీ ఉద్యోగులు ప్రశ్నించగా కత్తితో బెదిరించాడు. దీంతో భయపడిన వారు 11మంది ఖైదీలు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రి అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామని పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఖురేషీ టవేరా కారు (ఏపీ09 బిసి 7909)లో రెండో భార్యతో ముంబై పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన వారూ వీరితో పాటే ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. ఖైదీలు పారిపోవడం వెనుక ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం, నిర్లక్ష్యం ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురికీ ఘనమైన నేరచరిత్ర ఉందనీ, వారు సామాన్యులపై దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.