చిరకాలం నిలిచేలా ‘ఓయూ శతాబ్ది’ | Sakshi interview with OU VC Ramachandram | Sakshi
Sakshi News home page

చిరకాలం నిలిచేలా ‘ఓయూ శతాబ్ది’

Published Thu, Feb 23 2017 4:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

చిరకాలం నిలిచేలా ‘ఓయూ శతాబ్ది’ - Sakshi

చిరకాలం నిలిచేలా ‘ఓయూ శతాబ్ది’

‘సాక్షి’తో వర్సిటీ వీసీ ఎస్‌.రామచంద్రం
ఏడాది పాటు వినూత్నంగా ఉత్సవాలు
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం
సరికొత్త ప్రాజెక్టులకు అంకురార్పణ
కేంద్ర, రాష్ట్రాల సాయం రూ.712 కోట్లు


సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉస్మానియా ఒకటి. ఈ విద్యాలయం ప్రారంభమై వందేళ్లవుతున్న సందర్భంగా ఘనంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఏడాది పాటు నిర్వహించే ఈ వేడుకల ప్రారంభోత్సవం కోసం వర్సిటీ ప్రాంగణాన్ని ముస్తాబు చేయనున్నారు. సరికొత్త కార్యక్ర మాలు, వినూత్న ఆవిష్కరణలతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు వర్సిటీ సిద్ధమవు తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఎస్‌.రామచంద్రంను ‘సాక్షి’ఇంటర్వ్యూ చేసింది. రామచంద్రం వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఏడో నిజాం ఫత్వాతో మొదలు
ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1917 ఏప్రిల్‌ 26న జారీ చేసిన ఫత్వాతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పురుడు పోసుకుంది.  మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వారిని తీర్చిదిద్ది దేశానికి అందించింది.  ఉస్మానియాలో విద్య ను అభ్యసించి వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఘనంగా వేడుకలు
ఈ ఏడాది ఏప్రిల్‌ 26తో ఉస్మానియా వర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకుంటోంది. దీంతో చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించాం. ఏప్రిల్‌ 26న రాష్ట్రపతి ప్రణబ్‌ చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభమవు తాయి. దీనికి గవర్నర్, సీఎం సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాల నిర్వహణ ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. దాంతో ఆరునెలల ముందే కసరత్తు మొదలుపెట్టాం.

ఏడాది పాటు విన్నూత్నంగా..
వేడుకల తొలిరోజున ముఖ్య అథితుల ప్రసం గాలతో సాగుతుంది. 27, 28 తేదీల్లో ముఖ్యు ల ప్రసంగాలు, సెమినార్లు, బృంద చర్చలు వంటి పలు కార్యక్రమాలుంటాయి. ‘దేశాభి వృద్ధిలో ఓయూ పాత్ర’అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం.  ఫోటో ఎగ్జిబిషన్, అకడమిక్‌ అంశాలు, క్రీడలు, విజ్ఞానానికి సంబంధించిన అంశాలతో ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం.

కొత్త కొత్తగా..
శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో క్యాంపస్‌లో సరికొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాం.  ప్రణా ళికలను ప్రభుత్వానికి సమర్పించాం. సెంటర్‌ ఫర్‌ టెక్నికల్‌ స్టడీస్, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, బయో డైవ ర్సిటీ పార్క్, ఇంక్యుబేషన్‌ సెంటర్, కొత్త వసతిగృహాలు, పరిపాలన భవనం, కన్వెన్షన్‌ సెంటర్‌ లాంటి కొత్త ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తాం.

కేంద్ర, రాష్ట్రాల తోడ్పాటు
వర్సిటీ శతాబ్ది ఉత్సవాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటున్నాం. రూ.300 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని, రూ.412 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. 2 ప్రభుత్వాల నుంచి సానుకూలత వచ్చింది.  

అభివృద్ధికి చొరవ..
దేశంలో ఓయూను అగ్రస్థానంలో నిలబెట్టేం దుకు ప్రయత్నిస్తున్నాం. కొత్త రాష్ట్రంలో వర్సి టీల అభివృద్ధికి  చొరవ తీసుకుంటున్నాం.  

200 మందికి సన్మానం
మాజీ ప్రధాని పీవీ, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్, మాజీ ముఖ్యమంత్రులు ఎస్‌బీ చవాన్, ధరమ్‌సింగ్, సినీ దర్శకులు శ్యామ్‌ బెనగల్, అడోబ్‌ కంపెనీ సీఈవో శంతన్‌ నారాయణ లాంటి వారంతా ఉస్మానియాలోనే చదివారు. ఇంకా వేలాది మంది మంచి స్థానాల్లో ఉన్నారు. వీరిలో 200 మందిని ఎంపిక చేసి సన్మానించేం దుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement