కొత్త విద్యుత్‌ టారిఫ్‌ ప్రకటించిన ఏపీఈఆర్‌సీ | APERC Announce New Tariff In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొత్త విద్యుత్‌ టారిఫ్‌ ప్రకటించిన ఏపీఈఆర్‌సీ

Published Mon, Feb 10 2020 2:58 PM | Last Updated on Mon, Feb 10 2020 2:58 PM

APERC Announce New Tariff In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) సోమవారం కొత్త విద్యుత్‌ టారిఫ్‌లను ప్రకటించింది. 500 యూనిట్లలోపు గృహవినియోగదారులకు టారిఫ్‌ రేట్లను పెంచలేదు. 500 యూనిట్లకు పైబడిన వారికి యూనిట్‌ ధరను రూ.9.05నుంచి 9.95కు పెంచింది. ప్రతి నెలకు ఆ నెలలోని విద్యుత్‌ వినియోగంపైనే ఈ వర్గీకరణ ఉండేందుకు ఏపీఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించేందుకుగాను రూ.8,353.58కోట్లను విద్యుత్‌ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 18శాతం ఎక్కువ సబ్సిడీ పెరిగింది. సబ్సిడీ పెంచడంతో అదనంగా 18లక్షల మంది వ్యవసాయదారులకు లబ్ది చేకూరనుంది. 500 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్‌ సరఫరా కోసం రూ.1707.07 కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్‌ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement