హైదరాబాద్: టీడీ పీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఏపీఎన్జీవోలు సోమవారం సమావేశమైయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ఉద్యోగులు, యువత తీవ్రంగా నష్ట పోతారని విన్నవించినట్లు తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో కొత్తేమి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన ముందు నుంచి చెబుతున్న మాట ఇదేనని ఏపీ ఎన్జీవోలు తెలిపారు. సమైక్యాంధ్రా కోసం తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.
.ఏపీఎన్జీవోలు మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సీమాంధ్రాలో ఉన్న ప్రజా ప్రతినిధులు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు సమర్పించాలని వారు హెచ్చరించారు. మంత్రులు రాజీనామాలను సమర్పించాలని, లేకుంటే రాష్ట్రంలో పాలన స్తంభింపజేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు రాజీనామా లేఖలను పమర్పించాలని ఏపీఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు.