సిరిమానుకు కుంకుమ పూజలు | Arrangements for Sirimanothsavam | Sakshi
Sakshi News home page

సిరిమానుకు కుంకుమ పూజలు

Published Thu, Oct 15 2015 3:32 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

Arrangements for Sirimanothsavam

విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేటకు చేరుకున్న సిరిమానుకు స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బుధవారం రాత్రి భీమసింగి నుంచి తరలించిన సిరిమానును పూజారి తాళ్లపూడి భాస్కర్‌రావు ఇంటికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పసుపు, కుంకుమలతో అభిషేక పూజలు చేశారు.

ఈ నెల 26వ తేదీ వరకు సిరిమాను చెట్టును చెక్కటంతోపాటు పూజలు కొననసాగుతుంటాయి. సిరిమాను చెట్టును రథం, పైడితల్లి అమ్మవారి రూపాల్లో చెక్కటం పూర్తయిన తర్వాత ఈ నెల 27న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement