Sirimanothsavam
-
అంబరాన్నంటే సిరిమాను సంబరం... 260 ఏళ్ల చరిత్ర
Sirimanotsavam 2024: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమాను సంబరానికి విజయనగరం సిద్ధమవుతోంది. ఊర్లకు ఊర్లే కదిలి వచ్చే ఈ జనజాతరతో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. దారులన్నీ జన సెలయేరులై విద్యలనగరివైపు సాగిపోతుంటాయి. కొలిచినవారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కెలెల్లా నెరవేర్చే పైడిమాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం మరి.. 260 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా రాష్ట్ర పండుగగా వాసికెక్కింది. ఏటా విజయనగరం వీధుల్లో కనులపండువగా జరిగే ఈ జనజాతరకు లక్షలాది మంది తరలివస్తారు. 260 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం నెల రోజుల పాటు జరుగుతుంది. మహిళలు ప్రతి రోజూ ఘటాలు నెత్తిన పెట్టుకుని అమ్మకు నివేదన చేస్తారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి మరుసటి సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ఈనెల 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.బొబ్బిలి యుద్ధం నేపథ్యంలో... విజయనగరం రాజు పూసపాటి విజయరామగజపతిరాజు సోదరే పైడితల్లి. బొబ్బిలి సంస్థానంతో యుద్ధానికి వెళ్లవద్దని, తన మనసు కీడు శంకిస్తోందని సోదరుడిని వారించిందట. అయినా యుద్ధం ఆగలేదు. 1757 జనవరి 23న జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతిలో తన అన్న వీరమరణం పొందాడని తెలుసుకున్న పైడితల్లి విజయనగరం పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకుంది. సేవకుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి ఆమె చెప్పిన ప్రకారం ఆ చెరువులో జాలర్లతో వెతికిస్తే విగ్రహం దొరికింది. అక్కడే గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయనగరం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడి అదే.రసవత్తరంగా సిరిమానోత్సవం... సిరిమానోత్సవం తిలకించడానికి ఈసారి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడవుంటుంది. దాని చివరిభాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వేరొక చివర రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు సాగుతుంది. ఈ సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృష్ట్యా 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.చదవండి: బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు నెల రోజుల పండగ సెపె్టంబర్ 20వ తేదీన పందిరి రాటతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత అట్టహాసంగా జరిగే తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం ఇందులో భాగమే. అలాగే ఈ నెల 22వ తేదీన తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాలకంబాల ఉత్సవం, 30న చండీయాగం, పూర్ణాహుతితో పైడితల్లి అమ్మవారి జాతర ముగుస్తుంది. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి, మూడులాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడిలో విశిష్ట కుంకుమార్చనలు, అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి. నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున ఘటాలను సమర్పిస్తుంటారు. అమ్మవారికి చీర, రవికె, సారె ఇచ్చి చల్లదనం చేస్తారు. పప్పు బియ్యం, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు. -
అంగరంగ వైభవంగా పైడితల్లమ్మ పండుగ
-
కనుల పండుగగా పైడితల్లి పండగ
-
పురవీధుల్లో ఘనంగా సిరిమాను ఊరేగింపు
-
విజయనగరం : భక్తిశ్రద్ధలతో పైడితల్లి తొలేళ్ల ఉత్సవం (ఫొటోలు)
-
విజయనగరంలో మొదలైన సిరిమానోత్సవ సందడి
-
వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర
-
కన్నులపండువగా శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం
-
పైడితల్లి సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు
-
సిరిమానోత్సవ ఏర్పాట్లపై మంత్రి బొత్స సమీక్ష
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఏర్పాట్లపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష జరిపారు. విజయనగర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సాంస్కృతిక, సాహిత్య,క్రీడా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించింది.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయం, వాలంటీర్ల ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. గోదావరి బోటు ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ..బోటు 300 అడుగుల లోతులో ఉండటం వలన వెలికితీత కష్టంగా మారిందని.. జరిగిన దురదృష్ట ఘటనను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై అనేక మంది ఇతర పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
అంబర మంటిన శంబరం
భక్తజనంతో శంబర గ్రామం పోటెత్తింది. పోలమాంబ దర్శనానికి వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవారితో గ్రామం కిటకిటలాడింది. ఉదయం నుంచి ఏ వీధిలో చూసినా జనమే కనిపించారు.తెల్లవారుఝామునుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం ప్రారంభమైన సిరిమానోత్సవం అంబరాన్ని తాకింది. సరిగ్గా మూడున్నర గంటలకు మొదలైన సిరిమానోత్సవం సాయంత్రం వరకు సాగింది. చల్లంగ చూడుతల్లీ...పోలమాంబ... పాహిమాం... పోలమాంబ అంటూ భక్తుల నినాదాలతో గ్రామం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులుఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం, మక్కువ(సాలూరు): శంబర పోలమాంబ సిరిమానోత్సవం భక్తజన సంద్రం నడుమ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి కూడా భక్తులు బస్సులు, ప్రత్యేక వాహనాల ద్వారా తరలివచ్చా రు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువఝామునుంచే క్యూలైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 3.25గంటలకు పూజారి జన్ని పేకాపు జగది అలియాస్ భాస్కరరావు సిరిమానును అధిరోహించారు. గతేడాది కంటే ఈ ఏడాది 20నిమిషాలు ఆలస్యంగా సిరిమానోత్సవం మొదలైంది. అంత కుముందు జన్నివారి ఇంటినుంచి ఘటాలను సిరి మాను ఉండే ప్రదేశానికి తీసుకువచ్చారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీరలు పరచి వాటిపై చిన్నారులను పడుకోబెట్టగా వారిపై అమ్మవారి ఘటాలు దాటుతూ వెళ్లడంతో భక్తులు పులకించిపోయారు. జన్నివారి ఇంటినుంచి ఘటాలను గిరడ వారింటికి, ఆ తరువాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకువెళ్లి పూజ లు జరిపించారు. ఆ వెనుక సిరిమాను ఆనవాయి తీ ప్రకారం గిరడ వారింటికి, ఆ తరువాత మునసబు, కరణం ఇళ్లకు వెళ్లి మొక్కులు అందుకున్నా రు. అక్కడి నుంచి పణుకువీధి, గొల్లవీధి, జన్నివీధుల మీదుగా సిరిమాను ఊరేగించి, సాయంత్రం 5.35 గంటలకు ప్రధాన రహదారి వద్దకు చేరుకుంది. పోటెత్తిన భక్తజనం ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, రాష్ట్రాల నుంచి కూ డా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉద యం 10గంటల తరువాత భక్తులు అధిక సంఖ్య లో తరలిరావడంతో గ్రామం కిటకిటలాడింది. గ్రామంలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. గతేడాది కంటే ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చినట్టు అధికారులు గుర్తించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అధికారులు సమన్వయంతో పనిచేసి క్యూలైన్ల ఏర్పాటు, బస్సుల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి చర్యలు పక్కాగా అమలు చేయడంతో భక్తులకు ఎలాటి ఇబ్బందులు కలగలేదు. పక్కాగా ఏర్పాట్లు క్యూలైన్లలో ఉండే భక్తులకు దేవాదాయశాఖ సిబ్బంది, సత్యసాయి సేవా సమితి కమిటీ, పోలీస్‌శాఖ వాటర్ ప్యాకెట్లు సరఫరా చేయడంతో ఉపశమనం కలిగింది. పార్వతీపురం సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్, ఐటీడీఏ పీఓ లక్ష్మీశ, ఓఎస్డీ రామమోహనరావు, ఏఎస్పీ సుమిత్గార్గ్ ఎప్పటికప్పుడు జాతరపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగు సూచనలు చేయడం మంచి ఫలితాలనిచ్చింది. ఈ ఏడాది పెద్ద పెద్ద పెండాల్స్తోపాటు పక్కాగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సమీపంలోనే తలనీలాలు సమర్పించే శిబిరం, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బంది పడలేదు. ప్రత్యేక దర్శనం క్యూలైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు, గంటకో మారు వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ప్రత్యేకదర్శనం క్యూలైన్ ద్వారా పంపించారు. పోలీసుల సేవలు భేష్ అమ్మవారి జాతరలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకూడదని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓఎస్డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్ పర్యవేక్షణలో 600 మంది పోలీసులను నియమించారు. రోప్ పార్టీ, స్పెషల్ పార్టీ, క్రైంపార్టీలు సక్రమంగా విధులు నిర్వర్తించాయి. దొంగతనాల వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రెండు డ్రోన్ కెమెరాలు, 25 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిరిమాను వద్ద రోప్‌పార్టీ భక్తులను నెట్టడంతో, సిరిమానును, పూజారిని తాకలేకపోయామని భక్తులు వాపోతున్నారు. సంతృప్తినిచ్చిన ఆర్టీసీ సేవలు భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది ఆర్టీసీ సంతృప్తికరమైన సేవలు అందించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏడు డిపోల నుంచి మంగళవారం 130 బస్సులను జాతర కోసం వేశారు. బొబ్బిలి, పార్వతీపురం నుంచి వచ్చిన ప్రైవేటు వాహనాలను చెముడు గ్రామం మీదుగా మళ్లించడం వల్ల కొంత ట్రాఫిక్‌ను నియంత్రించారు. సాలూరు నుంచి మామిడిపల్లి మీదుగా కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే విడిచిపెట్టి, ఇతర వాహనాలను కందులపథం మీదుగా పంపించడంతో ట్రాఫిక్ సమస్య తగ్గింది. గ్రామానికి కలెక్టర్ వరాలు కలెక్టర్ హరిజవహర్‌లాల్, సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్, ఐటీడీఏ పీఓ, ఓఎస్డీ రామమోహణరావు, ఏఎస్పీ సుమిత్గార్గ్, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.ఎస్.ఎన్.మూర్తి జాతరలో పర్యటించారు. అన్ని కంట్రోల్‌రూమ్‌లను పరిశీలించి, భక్తులకు అందిస్తున్న సేవలు, సదుపాయాలపై ఆరాతీశారు. కలెక్టర్ హరిజవహర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యపనులు ఎప్పటికప్పు డు సక్రమంగా జరిపిస్తున్నారని ప్రశంసించారు. అన్నిశాఖల అధికారులతో మాట్లాడి, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా చర్యలు చేపడుతున్న ట్లు తెలిపారు. అమ్మవారి గురించి డాక్యుమెంటరీ చేస్తున్నట్లు వెల్లడించారు. సిరిమాను తిరిగే వీధుల్లో రహదారి విస్తరణతోపాటు కాలువల ఏర్పాటు కు రూ. 35లక్షలు ఐటీడీఏ నుంచి అందిస్తామని ప్రకటించారు. ఎలక్షన్కోడ్ రాకముందే పనులు జరిపించాలని మాజీ సర్పంచ్ బడ్రాజు త్రినాథకు తెలిపారు. మామిడిపల్లి గ్రామం వద్ద మిగిలిన రెండు కిలోమీటర్ల రహదారి పనులకోసం 80లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వైద్యశిబిరాల ను డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.విజయలక్ష్మి పరిశీలించారు. ప్రముఖుల తాకిడి గ్రామానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ దంపతులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. పులివేషధారులు వారి ముందు కాసేపు ఆటలాడారు. పోలమాంబ అమ్మవారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. దేవాదాయశాఖాధికారులు అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపిం చారు. జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి కుటంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. అధికారుల సేవలు అద్భుతం సాలూరు రూరల్: శంబర పోలమాంబ జాతరలో అధికారులు ప్రశంసనీయమైన సేవలు అందించారు. ఉపవాసంతో వచ్చి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా డీఎమ్హెచ్ఓ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎమ్హెచ్ఒ రవికుమార్‌రెడ్డి సూచనల మేరకు 84 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. జాతరలో 5 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. సుమారు 550 మంది భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 600మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసినట్టు పార్వతీపురం ఏఎస్సీ సుమిత్ గార్గ్ తెలిపారు. శంబర నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో 5 ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
నేటి సిరిమానోత్సవానికి సర్వం సన్నద్ధం
మక్కువ(సాలూరు): ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఆరాధ్యదైవం శంబర పోలమాంబ తోలేళ్ల ఉత్సవం సోమవారం సంప్రదాయ బద్ధంగా జరిగింది. సోమవారం రాత్రి అమ్మవారి ఘటాలకు ఊరేగించిన అనంతరం ప్రధానవీధిలో అమ్మవారి ఘటాలను ఉంచి, కారుగేదె వాలకాలను నిర్వహించారు. మహిషాసుర వేషాధారణ, పోతురాజు వేషధారణ, మేళతాళాల నడుమ కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రైతులు ఉపవాసాలు ఉండి రాత్రి ఏరోత్సవం నిర్వహించారు. గ్రామపెద్దలంతా జన్నివారి ఇంటికి వెళ్లి జన్నివారిని పిలిచి ఏరోత్సవం నిర్వహించారు. జన్నివారి, గిరిడవారి ఇంటి నుంచి విత్తనాలను తీసుకొని వచ్చి అమ్మవారి ముందుంచి పూజ చేస్తారు. అమ్మవారికి అక్షింతలు చల్లి, రైతులు కాళ్లì మీద(పశువులేర్లుకు పూచిన పూజ) నిలబడి రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గిరడవారు తెచ్చిన విత్తనాలను అమ్మవారి వద్ద పూజలు చేసిఅనంతరం రైతులు తలోపిడికెడు తీసుకొని వెళ్లి పంటలు సాగుచేసిన సమయంలో వారి విత్తనాల్లో వీటిని కలుపుతారు. తోలేళ్లనాడు సాధారణ రద్దీ అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి భక్తుల తాకిడి సాధరణంగానే ఉంది. చదురుగుడి వెనుక, వనంగుడి వద్ద భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా దేవాదాయ శాఖాధికారులు ఉచితదర్శనం, రూ.10లు, రూ. 50ల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు ప్రధానాలయంలో ఉన్న శంబర పోలమాంబను, వనంగుడిలోని అమ్మవారిని దర్శించుకున్నారు. వనంగుడి వెనుకన ఉన్న వేపచెట్టుకు పూజలు చేశారు. కోళ్లు, చీరలు, తలనీలాలు సమర్పించారు. జాతరలో పోలీసులు పహారా జాతర సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున పహరా కాశారు. సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు గ్రామంలోని అన్ని వీధుల్లో పర్యటించారు. ప్రధానాలయం నుంచి, వనంగుడి వరకు అడుగడుగున మోహరించారు. ఓఎస్డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. అమ్మవారిని ఓఎస్డీ రామ్మోహన్ దర్శించుకున్నారు. అనంతరం సిరిమాను తిరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700మంది పోలీసులు, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, ఎస్టీఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించారు. సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ చదురుగుడి, వనంగుడి ఆలయాల వద్ద క్యూలైన్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సిరిమాను తిరిగే ప్రదేశాలను పరిశీలించారు. అయిదుచోట్ల వైద్యశిబిరాలు శంబర పీహెచ్సీ, వైఎస్ఆర్ విగ్రహం వద్ద, వనంగుడి, గ్రంథాలయం, క్యూలైన్లవద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. గోముఖి నది వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేయగా భక్తులు తలనీలాలను సమర్పించి, పక్కనే ఉన్న గోముఖినదిలో స్నానాలు చేసి, వస్త్రమార్పిడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి శంబర పోలమాంబ సిరిమాను సంబరాన్ని లక్షలాది మంది తిలకించేందుకు వీలుగా సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, ఓఎస్డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.ఎస్.ఎన్.మూర్తి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర, మూడు గంటల మధ్య సిరిమానోత్సవం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందుకు అవసరమైన 30అడుగుల సిరిమానును తయారుచేశారు. సిరిమానును పూజారి జన్ని పేకాపు జగదీ అలియాస్ భాస్కరరావు అధిరోహించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ తెలిపారు. సిరిమాను తిరిగే ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన అనంతరం పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు. క్యూలైన్ల వద్ద మంచినీరు, పాలు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించి, చెత్తను వెంటవెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డీపీవో సత్యనారాయణకు తెలిపారు. ప్రసాదాలు సిద్ధం జాతరకు వచ్చే భక్తులకోసం 40వేల పులిహోర పొట్లాలు, 25వేల లడ్డూలను తయారుచేసినట్లు ఈవో ప్రకాశరావు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ మూర్తి పర్యవేక్షణలో 100 మంది దేవాదాయశాఖ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వనంగుడి, రామాలయం, గ్రంథాలయం వద్ద ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జాతరకు వచ్చిన భక్తులకు సమాచారం అందించేందుకు చదురుగుడి క్యూలైన్లు, ప్రధానరహదారివద్ద కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశారు. డీపీవో సత్యనారాయణ, డీఎల్పీఓ రాజు పర్యవేక్షణలో పారిశుద్ధ్యపనులు చురుగ్గా సాగుతున్నాయి. 130 మంది పారిశుద్ధ్యకార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు, ఇద్దరు మేస్త్రీలు పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు జరిపిస్తున్నారు. సిరిమాను అధిరోహించడం పూర్వజన్మ సుకృతం సిరిమాను అధిరోహించడం పూర్వజన్మ సుకృతమని పూజారి జన్ని పేకాపు జగదీ తెలిపారు. ఈయన తండ్రి త్రినాథ రెండేళ్లక్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో, త్రినాథ తమ్ముడు రామారావు గతేడాది సిరిమానును అధిరోహించగా ఈ ఏడాది త్రినాథ కొడుకు జగదీ కొత్తగా సిరిమానును అధిరోహించనున్నారు. పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తులు సిరిమానోత్సవం తిలకించేందుకు ఒడిశా, చత్తిస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల భక్తులతోపాటు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకు పైబడి భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వారికోసం అయిదుచోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచితం, రూ. 50, రూ. 10ల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, గర్భిణులకు ప్రత్యేక దర్శనం క్యూలైన్ ఏర్పాటుచేశారు. జాతరను రెండు డ్రోన్ కెమెరాలు, 25 సీసీ కెమెరాలతో నిఘా చేపడుతున్నామని ఓఎస్డీ రామ్మోహన్ తెలిపారు. జాతరకు 130 బస్సులు జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఏడు డిపోల నుంచి 130 ఆర్టీసీ బస్సులు నడుపనున్నట్లు పార్వతీపురం డిపో మేనేజర్ డి.జాన్‌సుందరం తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే అదనపు సర్వీసులను నిర్వహిస్తామన్నారు. చేరుకోవడం ఇలా... ♦ మక్కువ నుంచి కవిరిపల్లి మీదుగా శంబరకు చేరుకోవాలంటే 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ♦ సాలూరు నుంచి మక్కువ మీదుగా శంబర చేరుకోవడానికి 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. ♦ పార్వతీపురం నుంచి తాళ్లబురిడి మీదుగా శంబర చేరుకునేందుకు 47 కిలోమీటర్లు ప్రయాణించాలి. ♦ పార్వతీపురం నుంచి చినబోగిలి మీదుగా శంబర చేరుకోవడానికి 34 కిలోమీటర్లు ప్రయాణించాలి. -
వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం
-
అక్కడ ఎందుకు ఆగింది?
అమ్మకరుణ అందరిపైనా ఉండాలి. అందరికీ ఆమె ఆశీస్సులు అందాలి. అందుకోసమే ఎంత దూరం నుంచైనా... ఎన్ని పనులున్నా... పక్కన పెట్టి సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు జనం తరలివస్తారు. కానీ కొందరిని లక్ష్యంగా చేసుకుని అమ్మ కటాక్షం అందకూడదని భావిస్తే?...! ఇప్పుడదే జరిగింది. డీసీసీబీ వద్ద యాదృచ్ఛికంగా సిరిమాను ఆగడంపై రాజకీయాలు తెరమీదికొచ్చాయి. విపక్ష నేతలు అక్కడున్నారనీ... అక్కడ ఆగడం సరికాదంటూ కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి ఎవరినో ఒకరిని బలిచేసేందుకు పావులు కదులుతున్నాయి. సాక్షిప్రతినిధి విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సిరిమానోత్సవం మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కాని రాజకీయవర్గాల్లో పెను దుమారాన్ని రేపింది. డీసీసీబీ వద్ద సిరిమాను కాసేపు నిలిచి ఉండటాన్ని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సిరి మానును వీక్షించేందుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు డీసీసీబీ వద్ద ఉండటమే కారణం. ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సిరిమాను ఆగకూడదని ముందుగానే హుకుం జారీ చేసినప్పటికీ అందుకు విరుద్ధంగా జరగడాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యులుగా చేసి బలిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. ముందునుంచీ కుట్రకు వ్యూహం ఏటా డీసీసీబీ కార్యాలయం వద్ద నుంచే సిరిమాను ఉత్సవాన్ని తిలకించడం బొత్స కుటుంబానికి అలవాటు. వారితో పాటు వారి అనుచరులు, ఆ పార్టీ ముఖ్యనేతలు అక్కడి నుంచే సిరిమానుకు మొక్కుతుంటారు. అయితే ఈ విషయంపై పాలకవర్గం ముందునుంచి కుట్ర పూరితంగానే వ్యవహరిస్తోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై జరిగిన అధికార సమీక్షల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. డీసీసీబీ వద్దకు వెళ్లే సరికి సిరిమాను కాసేపు ఆగిపోతోందని టీడీపీ నాయకులు సమీక్షలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలా ఎందుకు జరుగుతోందని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆరా తీయగా అక్కడ బొత్స కుటుంబీకులుంటారని వారు బదులిచ్చారు. ఈ ఉత్సవంలో మాత్రం అలా జరగటానికి వీల్లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సిరిమాను అక్కడ ఆగకూడదని కలెక్టర్ ఆదేశించారు. నిజానికి తమ వద్దకు వచ్చేసరికి సిరిమానును కాసేపు ఆగాలని బొత్స కుటుంబీకులు గాని, వైఎస్సార్సీపీ నాయకులు గాని ఏనాడూ అధికారులకు చెప్పలేదు. తమ సౌలభ్యం కోసం మాత్రమే అమ్మవారిని వీక్షించేందుకు డీసీసీబీ ప్రాంతాన్ని వారు ఎప్పటిమాదిరిగానే ఎంచుకున్నారు. యాదృచ్ఛికమో... లేక అమ్మవారి కృపో తెలియదు గాని వారి ముందుకు వచ్చేసరికి సిరిమానును మోసే ఇరుసుమాను కాసేపు మొరాయించింది. ముందుకు వెళ్లేందుకు మొండికేసింది. ఈ పరిస్థితులు కావాలనే కల్పించినట్లు అధికార పార్టీ భావిస్తోంది. తాము ఎంత ప్రయత్నించినా తాము అనుకున్నది చేయలేకపోవడంపై చిన్నబుచ్చుకున్న టీడీపీ పెద్దలు జరిగిన దానిపై పోస్టుమార్టం ప్రారంభించారు. ఈవోపై కేంద్ర మంత్రి ఆగ్రహం? పైడితల్లి అమ్మవారి ఆలయ ఈఓ భానురాజా అర్చకులతో కలిసి బుధవారం వెళ్లి కేంద్ర మంత్రి అశోక్‌కు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆ సమయంలో ఆయన ఈఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సిరిమాను డీసీసీబీ వద్ద ఎందుకు నిలిచిందన్న దానిపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని, బాధ్యులెవరనేది వెంటనే చెప్పాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. కాగా అమ్మవారిని దర్శించడం, సిరిమానుకు మొక్కడం అనేది ప్రజలం దరి హక్కు. భక్తితో అమ్మవారికి నమస్కరించడాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో టీడీపీ పెద్దలుండడం విమర్శలకు తావిస్తోంది. అమ్మవారి ఉత్సవం పేరు చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ సిరిమానుకు కనీసం ఆసరాగా ఉండే పక్కరాటలు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయలేకపోయారు. సిరిమాను తిలకించడానికి వచ్చిన భక్తులకు తాగునీటిని సైతం అందించలేకపోయారు. వీటిపై పోస్టుమార్టం చేయాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీ నాయకులపై సిరిమాను కరుణ ఎందుకు కురిపించిందనేదానిపై మాట్లాడటం అధికార పార్టీ వైఖరికి అద్దం పడుతోందని సామాన్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. -
అంబరాన్నంటిన ‘సిరి’ సంబరం
-
అంబరాన్నంటిన ‘సిరి’ సంబరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో మంగళవారం కన్నుల పండువగా సాగింది. మధ్యాహ్నం 3.55 గంటలకు అమ్మవారి ప్రతిరూపంగా పూజారి ఆశీనులుకాగా చదురుగుడి నుంచి ఊరేగింపు కదిలింది. 3 లాంతర్ల జంక్షన్ నుంచి కోట సెంటర్‌కు సిరిమాను మూడు సార్లు వచ్చి వెళ్లడంతో సాయంత్రం 5.35కు ఉత్సవం ముగిసింది. కాగా పూజారిని కిందకు దించే యత్నంలో సిరిమానును మోసే బండికి కట్టిన పక్కరాటలు కొద్దిగా విరిగాయి. అక్కడివారు కర్రలను ఊతంగా ఉంచి పూజారిని కిందకు దించారు. -
సిరిమాను సంబరానికి సిద్ధం
► అరసవల్లిలో నేడు అసిరితల్లి సిరిమానోత్సవం శ్రీకాకుళం: అరసవల్లి అంటే అందరికీ సూర్యనారాయణ స్వామే. ఆ స్వామి ఉత్సవాల తర్వాత ఆ స్థాయిలో అసిరితల్లి ఉత్సవాలు జిల్లాలో జరుగుతున్నాయి. పన్నెండేళ్లకోమారు నిర్వహించే ఈ ఉత్సవానికి ఇప్పుడు గ్రామమంతా సిద్ధమైంది. మంగళవారం గ్రామంలో అసిరితల్లి సిరిమానోత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామ దేవతకు నిర్వహించే ఈ ఉత్సవానికి ఊరు ఊరంతా వేచి చూస్తోంది. నెల రోజులుగా అరసవల్లిలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. గ్రామ దేవత అసిరితల్లికి ఉత్సవాలే ఇందుకు కారణం. పుష్కర కాలానికి ఓ సారి నిర్వహించే ఈ ఉత్సవాలను ఈ మారు చాలా ఘనంగా చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఉత్సవంలో అరసవల్లితోపాటు ఖాజీపేట, ఆదిత్యనగర్, తెలుగు ముసలయ్యకాలనీ, కొయ్యాన కన్నయ్య కాలనీ, కామేశ్వరినగర్కాలనీ, సాదువారి కాలనీ, లక్ష్మీనగర్‌కాలనీ ప్రజలంతా పాల్గొంటారు. గత నెల 19న మొదలైన ఈ ఉత్సవాలు మంగళవారం జరిగే అనుపు ఉత్సవాలతో ముగియనున్నాయి. అనుపు పండగ రోజు ఉదయం కోటపోయడం, మాను కట్టుడం సిరి మాను ఉత్సవం చేస్తారు. ఈ సిరిమాను ఉత్సవంలో సిరిమాను తయారు చేసే కుటుంబానికి చెందిన వ్యక్తి, అమ్మవారి ఆలయ దమ్మల పూజారి సిరిమానుపై ఎక్కుతారు. మొదట దుర్గమ్మ మట్టి వద్ద బయలు దేరిన సమయం లో సిరిమాను తయారు చేసే రాయల కుటుం బానికి చెందిన మల్లేశ్వరరావు ఎక్కి నీలమ్మ గుడి వరకు వస్తారు. అక్కడ దమ్మల పూజారైన పిరియా అప్పారావు సిరిమాను ఎక్కుతారు. తిరిగి ఈ సిరిమాను అసిరి తల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లే వరకు ఉంటారు. వందల ఏళ్లుగా ఈ వేడుక ఇక్కడ జరుగుతోంది. పోలీస్ శాఖ నిబంధనలు పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సిరిమాను ఉత్సవం పూర్తయ్యే వరకు వాహనా ల రాకపోకలు నిలివేస్తున్నామని సీఐ అప్పల నాయుడు తెలిపారు. 80అడుగుల రోడ్డు వర కు శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలు, గారవైపు నుంచి వచ్చే వాహనాలు అమ్మవారి ఆల యం వరకు ఆగిపోతాయన్నారు. అలాగే బుధవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 100మంది పోలీసు సిబ్బందిని షిఫ్టు డ్యూటీల్లో ఏర్పాటు చేశామన్నారు. -
ముగిసిన సిరిమానోత్సవం
-
ముగిసిన సిరిమానోత్సవం
మక్కువ (విజయనగరం జిల్లా) : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ ఉత్సవం సోమవారం ప్రారంభమైన సంగతి తెల్సిందే. పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం ముగిసింది. సిరిమాను పూజారి జన్నిపేకాకు రామారావు మధ్యాహ్నం 3.27 గంటలకు అధిరోహించారు. ఈ ఏడాది ఈ ఉత్సవాలను తిలకించడానికి సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చారని నిర్వాహకుల అంచనా. గతేడాది సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. -
సిరిమానుకు కుంకుమ పూజలు
విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేటకు చేరుకున్న సిరిమానుకు స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బుధవారం రాత్రి భీమసింగి నుంచి తరలించిన సిరిమానును పూజారి తాళ్లపూడి భాస్కర్‌రావు ఇంటికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పసుపు, కుంకుమలతో అభిషేక పూజలు చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు సిరిమాను చెట్టును చెక్కటంతోపాటు పూజలు కొననసాగుతుంటాయి. సిరిమాను చెట్టును రథం, పైడితల్లి అమ్మవారి రూపాల్లో చెక్కటం పూర్తయిన తర్వాత ఈ నెల 27న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.