
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో మంగళవారం కన్నుల పండువగా సాగింది. మధ్యాహ్నం 3.55 గంటలకు అమ్మవారి ప్రతిరూపంగా పూజారి ఆశీనులుకాగా చదురుగుడి నుంచి ఊరేగింపు కదిలింది. 3 లాంతర్ల జంక్షన్ నుంచి కోట సెంటర్‌కు సిరిమాను మూడు సార్లు వచ్చి వెళ్లడంతో సాయంత్రం 5.35కు ఉత్సవం ముగిసింది. కాగా పూజారిని కిందకు దించే యత్నంలో సిరిమానును మోసే బండికి కట్టిన పక్కరాటలు కొద్దిగా విరిగాయి. అక్కడివారు కర్రలను ఊతంగా ఉంచి పూజారిని కిందకు దించారు.