arrangemants
-
భారత స్వాతంత్ర్య దినోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు..ఇంకా ఇతర అప్డేట్స్
-
జయహో బీసీ సభకు తరలి వచ్చిన ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు
-
TSRTC: దసరా పండగకు ప్రయాణికులకు తీపికబురు..
హైదరాబాద్: దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు గానూ..టీఎస్ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. దీని కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులలో టికెట్ ఛార్జీకి అదనంగా 50 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పండగకు మొత్తం.. 4035 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఎంజీబీఎస్ నుంచి 3,200 బస్సులు, జేబీఎస్ నుంచి 1200 బస్సులు తెలంగాణ, ఏపీకి నడవనున్నాయి. ఇవికాకుండా మరికొన్ని బస్సులు అదనంగా తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు. ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల,నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీంతో పండగకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల ఆదాయం చార్జీల రూపంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరుతుండగా.. వరంగల్, మహబూబాబాద్‌కు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి బయలు దేరనున్నాయి. అదే విధంగా ఖమ్మం, విజయవాడకు వెళ్లే బస్సులు.. ఎల్బీనగర్, హయత్‌నగర్ నుంచి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు వెళ్లే బస్సులు దిల్సుఖ్నగర్ నుంచి బయలుదేరతాయిని అధికారులు తెలిపారు. అదే విధంగా, వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరతాయని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. చదవండి: సరిలేరు మాకెవ్వరూ... అనవసర ఖర్చుల్లో ‘ గ్రేటర్’ -
తుంగభద్ర నది పుష్కరాలపై స్పష్టత ఏదీ?
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తుంగభద్ర నది పుష్కరాలు ఈ ఏడాది నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించే ఏకైక ప్రాంతం ఒక్క అలంపూర్ నియోజక వర్గం మాత్రమే. సమయం సమీపిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం నేటి దాక పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కొనసాగడంలేదు. ఒక్క దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు అడపా దడపా వస్తూ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను గుర్తించడంతోనే సమయం సరిపోతుంది. ఇది తప్పా ప్రభుత్వం మాత్రం పుష్కరాల విషయంలో నేటి దాక ఎలాంటి చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క రాష్ట్రంలో ఇప్పటికే పుష్కరాలపై పలు దఫాలు సమావేశాలు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతులను కలవడం, పుష్కరఘాట్లను గుర్తించడం వంటి పనులు చకచకా జరిగిపోతుండగా.. రాష్ట్రంలో మాత్రం నేటిదాక పుష్కరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా..? లేదా అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వానికి మంత్రాలయ పీఠాధిపతి లేఖ రాసినా స్పందన కనిపించలేదు. బాధ్యత ఒక్క శాఖదేనా.. పుష్కరాలంటే దేవాదాయశాఖ మాత్రమేనా అనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరింస్తుదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కోవిడ్–19 ఉన్నప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పుష్కరాలకు వస్తారని, కనీసం 50శాతమైన భక్తు లు వస్తారని బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఘాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, వాహనాల పార్కింగ్, నదీ తీరంలో పిండ ప్రదానాలకు షెడ్లు, రహదారుల విస్తరణ, విద్యుత్ అలంకరణ, తాగునీరు ఇలా ఎన్నో పనులు చేపట్టాల్సి వస్తుంది. జోగుళాంబ ఆలయం సమీపంలో ముందే ఇరుకైన స్థలం ఉండడం, దీనికి తోడు రహదారులకు ఇరువైపులా ఆక్రమణకు గురికావడం, ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే అనేక వ్యాపార దుకాణాలతో కబ్జాకు గురయ్యాయి. చిత్తశుద్ధి కరువు సీఎం కేసీఆర్ తన భక్తి ప్రపత్తులను కేవలం యాదాద్రి వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారని.. జోగుళాంబ ఆలయం, తుంగభద్ర నది పుష్కరాలపై చిత్తశుద్ధి కరువైందని స్థానికులు ఆరోపిస్తు న్నారు. జోగుళాంబ సేవాసమితి వారు ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరేందుకు బీజేపి, కాంగ్రెస్ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పుష్కరాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు సమాయత్తం కానున్నారు. సీఎం దృష్టి సారించాలి రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన అలంపూర్‌లో త్వరలో ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. సీఎం కేసీఆర్‌కు యాదాద్రి తప్పా జోగుళాంబ అమ్మవారు కనిపించడంలేదు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఈ పుష్కరాలు సరైన సమయం. ఈ విషయంలో సీఎం ఇప్పటికైన దృష్టి సారించాలి. – డీకే అరుణ, మాజీ మంత్రి, గద్వాల నాటి హామీలే నేరవేర్చలేదు 2016లో జరిగిన కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు వచ్చిన సీఎం అప్పట్లో అలంపూర్ అభివృద్ధిపై ఇచ్చిన హామీలే నేటికీ నెరవేర్చలేదు. ఇక తుంగభద్ర పుష్కరాలు కనీసం నిర్వహిస్తారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వంలో ప్రజలే కాక జోగుళాంబ అమ్మవారు కూడా ఇబ్బందులు పడాలేమో. – సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ పుష్కరాలు నిర్వహించాలి తుంగభద్ర నది పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఈ విషయంలో సీఎం చొరవ చూపాలి. అనేక సమావేశాలలో సీఎం నోట అలంపూర్ మాట వినిపించింది. ఇప్పుడు పుష్కరాలపై కూడా ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలి. – బీవీ.బాబు, జోగుళాంబ సేవాసమితి ఉపాధ్యక్షుడు ఏర్పాట్లపై త్వరలో సమావేశం తుంగభద్ర నది పుష్కరాల విషయమై ఈ రెండు రోజుల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందనే బావిస్తున్నాం. – ప్రేమ్‌కుమార్, ఈఓ, జోగుళాంబ ఆలయం -
2న గ్రామ సచివాలయాలు ప్రారంభం
సాక్షి, కర్నూలు(అర్బన్) : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ముందుగా ప్రకటించిన విధంగానే జిల్లాలో మొత్తం 881 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అయితే 2వ తేదీన అన్ని మౌలిక వసతులు, ప్రజలకు అందించాల్సిన విస్తృత సేవలతో ప్రతి మండలంలో మోడల్‌గా ఒక సచివాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోడల్‌గా ప్రారంభం కానున్న సచివాలయంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫర్నిచర్, మీ సేవా తదితర అన్ని వసతులను పూర్తి స్థాయిలో అమరుస్తున్నారు. జిల్లాలోని 53 మండలాల్లో ఒక్కో సచివాలయాన్ని మోడల్‌గా ప్రారంభించేసేందుకు ఇప్పటికే అధికారులు గుర్తించారు. డోన్ నియోజకవర్గ పరిధిలోని బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆలూరులో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్..అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు. అన్ని గ్రామ సచివాలయాలను ప్రారంభించేందుకు వీలుగా మెజారిటీ సచివాలయాలకు ఇప్పటికే పెయింటింగ్స్‌ను దాదాపు పూర్తి చేశారు. అలాగే ఫర్నిచర్, ఇతర వసతులను ఏర్పాటు చేసేందుకు సంబంధిత పంచాయతీ అధికారులు కృషి చేస్తున్నారు. వేగంగా వార్డు సచివాలయాల ఏర్పాట్లు కర్నూలు (టౌన్): కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 8 మున్సిపాలిటీల్లో 300 వార్డు సచివాలయాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2 నాటికి కర్నూలు కార్పొరేషన్లో కర్నూలు, పాణ్యం, కోడుమూరు అర్బన్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఒక్కొక్క సచివాలయం చొప్పున ప్రారంభించేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో పాటు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వార్డు సచివాలయాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న సీఆర్సీ (కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్)లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు 103 ప్రెవేట్ భనవాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు ఆయా భవనాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, బీరువాలు ఏర్పాటు చేస్తున్నారు. బాత్రూమ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్నూలులోని ఏర్పాటు చేయనున్న 132 వార్డు సచివాలయాల్లో మరమ్మతులకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. రివర్స్ టెండర్ విధానం అవలంబించడంతో ఆదాయం మిగిలింది. అన్ని వార్డు సచివాలయాల మరమ్మతులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ప్రతి పనిని అంచనా విలువ కన్నా 10 శాతం తక్కువకు టెండర్లను ఖరారు చేశారు. దీంతో ప్రభుత్వానికి అదాయం మిగిలింది. -
పొరపాట్లు లేకుండా ఓట్ల లెక్కింపు
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.ముత్యాలరాజు కౌంటింగ్ సూపర్వైజర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాయలంలో కౌంటింగ్ సూపరవైజర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్లు లెక్కించే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఆర్ఓల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్ తహసీల్దార్లు, కౌంటింగ్ సూపరవైజర్లు పాల్గొన్నారు. సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణద్వివేది ఓట్ల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం సీఈఓ విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఎటువంటి అల్లర్లు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జేసీ కె. వెట్రిసెల్వి, ఎన్నికల పరిశీలకులు, ఆర్ఓలు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు జస్‌కిరణ్‌సింగ్ సూక్ష్మపరిశీలకులకు సూచించారు. మంగళవారం కస్తూర్బాకళాక్షేత్రంలో సూక్ష్మపరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అందరూ చదవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మపరిశీలకులు అభ్యర్థులను, ఏజెంట్లను పలకరించడం, విష్ చేయకూడదన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. -
కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నం
నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా ఐదురోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. డీకేడబ్ల్యూలో ఆరు, ప్రియదర్శిని కళాశాలలో నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. లెక్కింపు కోసం పది నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 1,200 మంది ఉద్యోగులను నియమించారు. 19 నుంచి శిక్షణ ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 19, 20, 21 తేదీల్లో ఇస్తారు. ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. ఉద్యోగులు, సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు వినియోగించేందుకు అనుమతి లేదు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు పాస్‌లు ఇవ్వనున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. 23వ తేదీన ఉదయం పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 8.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్ వివరాలను సువిధాలో ఆప్‌లోడ్ చేసిన తర్వాతే ప్రకటిస్తారు. లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీ ప్యాట్ల స్లిప్‌లు లెక్కిస్తారు. ఈతంతు పూర్తికాగానే విజయం సాధించిన అభ్యర్థిని ప్రకటించి ఆర్ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఆర్ఓలకు శిక్షణ సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల స్లిప్‌ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆర్ఓలకు శుక్రవారం విజయవాడలో శిక్షణ నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్ఓలు హాజరయ్యారు. ప్రత్యేక ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలోకి బయటి వ్యక్తులు వెళ్లకుండా కర్రలతో బ్యారికేడ్లు కడుతున్నారు. పార్టీల ఏజెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు కేంద్రంలోకి తీసుకురావడానికి అనుమతి లేదు. వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు ఈవీఎంలపై పోసే అవకాశం ఉన్నందున వాటిని కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలి. అటూ ఇటూ తిరగడానికి వీల్లేదు. వారికి అవసరమైన తాగునీరు తదితర ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది. ప్రత్యేక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. ఉద్యోగులు, సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా నియమించనున్నారు. -
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
-
నిజామాబాద్‌లో.. పోలింగ్ ప్రతిష్టాత్మకం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం యుద్ధప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈవీఎంల చరిత్రలోనే తొలిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఈ స్థానం పోలింగ్ నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారింది. దీంతో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్‌కు కేవలం వారం రోజులే గడువుండటంతో ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ స్థానం పోలింగ్ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. అనేక ఊహాగానాలు, ఉత్కంఠకు తెరదించుతూ నిజామాబాద్ స్థానానికి ఈవీఎంల ద్వారానే షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేప థ్యంలో పోలింగ్ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ధునాతన ఎం–3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లు ఈసీఐఎల్, బెల్ కంపెనీలకు చెందిన ఇంజినీర్లు జిల్లా కు చేరుకున్నారు. సుమారు 600 మంది పైగా ఇంజినీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. కొందరు ఇంజనీర్లను జగిత్యాల జిల్లాకు పంపినట్లు తెలుస్తోంది. వీరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించారు. ప్రైవేటు హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లను కేటాయించారు. ప్రారంభమైన ఫస్ట్ లెవల్ చెకింగ్.. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీపీఏటీలతో పాటు 12 బ్యాలె ట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈవీఎంలు ప్రత్యేక కంటెనర్లలో బుధవారం జిల్లాకు వచ్చాయి. నగర శివారులోని విజయలక్ష్మి గార్డెన్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షం లో ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ చేపట్టారు. ర్యాండమ్ చెకింగ్ వంటి ప్రక్రి యలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలలో బ్యాలె ట్ పేపర్ అమర్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. వారం రోజులే గడువుండటంతో మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాకు కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్‌జైన్ బుధవారం జిల్లాకు చేరుకున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ బుద్ద ప్రకాష్, ఈసీఐ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ లు కూడా జిల్లాకు చేరుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా కూడా జిల్లాకు వచ్చారు. సాంకేతిక నిపుణుల సేవల వినియోగం.. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీ ప్యాట్, 12 బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగిస్తామన్నామని సుదీప్‌జైన్ పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల సమస్య వస్తే దానినే మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంటే 12 బీయుఎస్లో ఒక బ్యాలెట్ యూనిట్ సమస్య వస్తే దాని స్థానంలో అక్కడే మరో బ్యాలెట్ యూనిట్ అమర్చాలని, దీనికి అవసరమైన సాంకేతికత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంతో మంది నిష్ణాతులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణు లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నందున వారి సేవలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. అధికారులు అత్యంత నమ్మకంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రపంచంలోనే మొదటిసారి : నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం ఎన్నిక ఒక చరిత్రకు నాంది కానున్నదని కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్‌జైన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సం ఘం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్లో ఎన్ఎల్ఎమ్టీ నిష్ణాతులతో సమావేశమయ్యారు. సుదీప్‌జైన్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు ఎం–2 ఈవీఎంఎస్ ద్వా రా, నాలుగు బ్యాలెట్ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించామన్నారు.ఇక్కడ 185 మంది బరిలో ఉండటంతో ఎం–3 ఈవీఎంలతో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం–3 ద్వారా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఒక చరిత్రకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం వేదిక అవుతుందని చెప్పారు. వందల సంఖ్యలో సాంకేతిక నిపుణులు : ఈసీ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ ఎన్నికల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతులలో నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కన్సల్టెంట్ నిఖిల్ కుమార్ పేర్కొన్నారు. వందల సంఖ్యలో ఈసీఐఎల్, బెల్ నిపుణు లు ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ సాంకేతిక సహకారం అందించనున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకు అధికారులను సన్నద్ధం చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈవో బుద్ద ప్రకాష్, ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్ దాలియా, ప్రత్యేక అధికారి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, సీపీ కార్తికేయ, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, బెల్, ఈసీఐఎల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
సిరిమానుకు కుంకుమ పూజలు
విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేటకు చేరుకున్న సిరిమానుకు స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బుధవారం రాత్రి భీమసింగి నుంచి తరలించిన సిరిమానును పూజారి తాళ్లపూడి భాస్కర్‌రావు ఇంటికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పసుపు, కుంకుమలతో అభిషేక పూజలు చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు సిరిమాను చెట్టును చెక్కటంతోపాటు పూజలు కొననసాగుతుంటాయి. సిరిమాను చెట్టును రథం, పైడితల్లి అమ్మవారి రూపాల్లో చెక్కటం పూర్తయిన తర్వాత ఈ నెల 27న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.