
‘అశోక్‌బాబు సీఎం కిరణ్ అనుచరుడు’
తిరుపతి : సమైక్యం పేరుతో నాటకాలు ఆడుతున్న ఎన్‌జీవో నాయకుడు అశోక్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుచరుడని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా సదుంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రలో మాట్లాడారు. సమైక్యం పేరుతో ఆందోళనలు చేసి, ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
అసెంబ్లీలో చర్చ జరగకపోతే, ఎమ్మెల్యేల ఇంటి ముందు ఆందోళన చేయనున్నట్లు పేర్కొంటున్నారని అన్నారు. ఆయన కూడా జగన్‌మోహన్‌రెడ్డి లాంటి సమైక్యవాదిని విమర్శిస్తున్నారని అన్నారు. శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని, చేసిన తరువాతే చర్చ చేపట్టాలని కోరిన పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే జగన్ వచ్చారని తెలిపారు.