అశోక్‌గజపతిరాజు నాయకత్వంలో పార్టీ... | ashok gajapathi raju 64TH brithday Activists donate blood | Sakshi
Sakshi News home page

అశోక్‌గజపతిరాజు నాయకత్వంలో పార్టీ...

Published Thu, Jun 26 2014 2:04 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

అశోక్‌గజపతిరాజు నాయకత్వంలో పార్టీ... - Sakshi

అశోక్‌గజపతిరాజు నాయకత్వంలో పార్టీ...

 విజయనగరం ఫూల్‌బాగ్: పౌరవిమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింతగా ముందుకు వెళ్తుందని   ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు. అశోక్‌గజపతిరాజు 64వ జన్మదినం సందర్భంగా బుధవారం విజయనగరం పట్టణంలోని అశోక్‌బంగ్లాలో టీడీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 200 మంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు  కేడర్‌కు అశోక్‌గజపతిరాజు అన్నివిధాలా అండగా నిలిచారని గుర్తుచేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అశోక్‌ను అందరూ అభిమానిస్తారని, దానికి కారణం ఆయన వ్యక్తిత్వమేనన్నారు.
 
 టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అశోక్‌గజపతిరాజు ఎప్పుడూ ఒకేలా ఉంటారన్నారు.  మంత్రి పదవి రాగానే అధికారులను ఒరే అని పిలిచే కొంతమంది సంస్కృతి అశోక్‌గజపతిరాజుకు లేదని పరోక్షంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు. విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ అశోక్‌గజపతిరాజు లాంటి నిజాయితీ కలిగిన నాయకుని ఆధ్వర్యంలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు మన్యాల కృష్ణ, పీఎన్‌ఎం రాజు, సిటీకేబుల్ ఎండీ గణపతినీడి శ్రీనివాస్, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నర్సింగరావు, టీడీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement