కాంగ్రెస్ సంస్కృతినే టీడీపీ కొనసాగిస్తుందా? | Congress culture TDP ontinue | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ సంస్కృతినే టీడీపీ కొనసాగిస్తుందా?

Published Thu, Jun 26 2014 1:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

కాంగ్రెస్ సంస్కృతినే టీడీపీ కొనసాగిస్తుందా? - Sakshi

కాంగ్రెస్ సంస్కృతినే టీడీపీ కొనసాగిస్తుందా?

 మరికొద్ది రోజుల్లో జెడ్పీ రంగస్థలం పైకి కొత్త పాత్రలు రానున్నాయి. పాత్రధారులు మారినా అవే పాత్రలు ప్రత్యక్షం కానున్నాయా ?   కాంగ్రెస్ సంస్కృతినే టీడీపీ కొనసాగిస్తుందా?  ఈ సారి కూడా జెడ్పీలో రెండు చాంబర్లు తప్పేటట్టు లేదా? షాడో పాలన పునరావృతం కానుందా?  అధికారం స్వాతీరాణిదే  కాగా, పాలనా పగ్గాలు వేరేవారి చేతుల్లోకి వెళ్లనున్నాయా...? కాంగ్రెస్ నేత చిన్నశ్రీనును  ఆదర్శంగా తీసుకుంటున్నారా...?అంటే జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే వినిపిస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :గత పదేళ్ల కాలంలో జిల్లా పరిషత్‌లో ఆధిపత్యం ఎవరిదంటే   చిన్న శ్రీనుదే అని ఠక్కున సమాధానం వస్తుంది. జెడ్పీ చైర్మన్‌లున్నప్పటికీ  అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడిగా చక్రం తిప్పారు.  షాడో నేతగా వ్యవహరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఒక చాంబర్‌లో ఉంటే చిన్నశ్రీను మరో  చాంబర్‌లో ఉండేవారు. అక్కడి నుంచే వ్యవహారాలన్నీ నడిపేవారు. చిన్నశ్రీనును రాజ్యాంగేతర శక్తిగా, షాడోనేతగా ఆరోపిస్తూ ఆయన వ్యవహారాన్ని   అన్నీ రాజకీయ పక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రతీ సమావేశంలో చిన్న శ్రీను వైఖరిని దుయ్యబట్టాయి.
 
 పస్తుత కేంద్రమంతి పూసపాటి అశోక్ గజపతిరాజైతే ఆయన్ని నీడనేతగా అభివర్ణిస్తూ ధ్వజమెత్తేవారు. మొత్తానికి కాంగ్రెస్ పతనంతో చిన్న శ్రీను ఆధిపత్యానికి బ్రేక్ పడింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. జెడ్పీ పగ్గాలు టీడీపీ నేతల చేతికందాయి. చైర్‌పర్సన్‌గా శోభా స్వాతిరాణిని లాంఛనంగా ప్రకటించారు. ఇక, అధికారికంగా ఎన్నుకోవడమే మిగిలి ఉంది. జెడ్పీలో జరిగే వ్యవహారాలపై అధికారులు ఇప్పటికే ఆమెను సంప్రదిస్తున్నారు. అయితే పలు వ్యవహా ర్లో  ఆమె తల్లి శోభా హైమావతి కూడా కీలకంగా వ్యవహరి స్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌జీఎఫ్ ప్రణాళిక రూపకల్పన విషయంలో ఆమెతో  జెడ్పీ అధికారులతో సుదీర్ఘంగా చర్చిం చినట్టు తెలిసింది. ఆమె  సూచనల మేరకే పనుల ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు వినికిడి.
 
 అచ్చం కాంగ్రెస్ హయంలో లాగే..
 జెడ్పీలో ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే కాం గ్రెస్ హయాం నాటి పరిస్థితుల్ని అచ్చంగా గుర్తుకు తెస్తున్నా యి. చైర్‌పర్సన్ కాబోతున్న స్వాతిరాణికి రాజకీయ అనుభ వం లేదనో, పేరుకే స్వాతిరాణి అని చూసుకునేదంతా ఆమె తల్లేనని భావిస్తున్నారో తెలియదు గాని  జెడ్పీలో రెండు చాం బర్‌లను ముస్తాబు చేస్తున్నారు. గత పాలకవర్గం హయాం లో చిన్న శ్రీను తరుచూ కూర్చొని, వ్యవహారాలను నడిపిన కార్యాలయాలన్ని కొత్త చైర్‌పర్సన్‌కు, అప్పట్లో జెడ్పీ చైర్మన్ చాంబర్‌గా ఉన్న కార్యాలయాన్ని కొత్త షాడో నేత  కోసమని సిద్ధం చేస్తున్నారు. ముస్తాబుతో పాటు వివిధ మరమ్మతులు చేసేందుకు సుమారు రూ. 5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇదంతా అధికారుల అత్యుత్సాహంతో జరుగుతుందా లేదంటే పీఠాన్ని అధిష్టిస్తున్న వారి ఆదేశాల మేరకు జరుగుతుందో తెలియదు గాని నాటి కాంగ్రెస్ సంస్కృతిని మాత్రం గుర్తుకు తెస్తోంది.  
 
 30న నోటిఫికేషన్ ?
 జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గం కొలువు తీరేందుకు ఈనెల 30న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చైర్‌పర్సన్ ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. దాని ఆధారంగా జూలై మొదటి వారంలో ఎన్నిక నిర్వహిస్తారు. చేతులేత్తే విధానం ద్వారా చైర్‌పర్సన్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు. ఇదే సందర్భంలో కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు.
 
 ఎన్నికకాకుండానే చైర్‌పర్సన్
 సీటులో కూర్చున్న  స్వాతిరాణి
 చైర్‌పర్సన్ కాబోతున్న శోభా స్వాతిరాణి   మూహూర్తం కోసం   బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్ కార్యాలయం లో ఉన్న తన చాంబర్‌లో అడుగుపెట్టారు. చైర్‌పర్సన్ సీటు లో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు జెడ్పీ అధికారులు స్వాగతం పలకడంతో పాటు అభినందనలు తెలియజేశారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement