'రాజుగారికి రాచరికపు వాసనలు పోలేదు' | botsa satyanarayana slams ashok gajapathi raju | Sakshi
Sakshi News home page

'రాజుగారికి రాచరికపు వాసనలు పోలేదు'

Published Tue, Nov 4 2014 6:26 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

'రాజుగారికి రాచరికపు వాసనలు పోలేదు'

'రాజుగారికి రాచరికపు వాసనలు పోలేదు'

విజయనగరం: కేంద్ర మంత్రి అశోక్గజపతి రాజుపై పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజుగారికి రాచరికపు వాసనలు నేటికీ పోలేదని దుయ్యబట్టారు. తుపాను నష్టం జరిగిన 15 రోజుల తర్వాత జిల్లాకు వచ్చి తీరిగ్గా మొక్కలు నాటుకుంటున్నారని మండిపడ్డారు. తుపాను బాధితులకు భోరోసా ఇవ్వడంలో మంత్రి విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్ ల పేరుతో టీడీపీ నాయకులు దోపిడీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యులను డ్వాక్రా సంఘాల్లో చేర్చి ఇసుక దోపిడీలో భాగస్వాములవుతున్నారని అన్నారు. పచ్చచొక్కాలకే ప్రభుత్వ పథకాలు అందే రోజులు మొదలయ్యాయని బొత్స అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement