అసెంబ్లీ ముట్టడి వాయిదా
Published Wed, Jan 22 2014 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఈనెల 23వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.అచ్చుతరావు, కె.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎస్.వి.అనిల్‌కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.తవుడు మంగళవారం సంయుక్తంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కె.పార్థసారథితో జాక్టో నేతలు మంగళవారం జరిగిన చర్యల్లో సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2,500 పండిత, 2500 పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు.
అదేవిధంగా 398 రూపాయిల వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయుల నోషనల్ ఇంక్రిమెంట్ల ఫైలు ముఖ్యమంత్రి పరిశీలన కోసం పంపడానికి ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుల హాఫ్ పే లీవ్‌ను నగదుగా మార్చుకునే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ 2, 3 రోజులలో ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని తెలిపారు. డీఈవోల పోస్టులను ఆ డివిజన్‌లో పనిచేస్తున్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకి మాత్రమే ఇవ్వాలని, ఎంఈవో పోస్టులను ఆ మండలంలోని సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌కు మాత్రమే బాధ్యతలు ఇవ్వడానికి విద్యామంత్రితో ఒప్పందం కుదిరినట్లు వారు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన చర్చల్లో పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారి, స్కూల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ వి.మోహన్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement