సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారీ వర్షాలతో జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి ప్రసాద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో జరిగిన నష్టంపై శనివారం మంత్రి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ ల అధికారుల బృందాలు ప్రతి గ్రామాన్ని సందర్శించాలని నష్టం వివరాలను సేకరించాలన్నారు. పంటనష్ట పరిహారంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో రోడ్లు చాలా ధ్వంసమయ్యాయని, వాటి మరమ్మతులకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాలతో రోడ్లు ఏ మేరకు దెబ్బతిన్నాయో అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని ఆదర్శ రైతులతో కాకుండా రెవెన్యూ అధికారులతో అంచనా వేయించాలని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సూచించారు. రైతులకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి కోరారు. గతంలో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రత్నం, కూన శ్రీశైలంగౌడ్, కలెక్టర్ శ్రీధర్, జేసీలు చంపాలాల్, ఎంవీ రెడ్డి, డీఆర్వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నష్టం అంచనాకు గ్రామాలకు వెళ్లండి
Published Sun, Oct 27 2013 1:31 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement