ఏటీఎం కార్డు అపహరించిన ముగ్గురి అరెస్ట్ .
Published Wed, Sep 25 2013 2:56 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
కాజీపేట, న్యూస్‌లైన్ : రైల్వే ఉద్యోగిని బెది రించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి, రూ.40 వేలు డ్రాచేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరె స్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ ఎస్‌ఏ జబ్బార్ తెలిపా రు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైలు రామారావు, శ్రీధర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. మడికొండ గ్రామానికి చెందిన రైల్వేఉద్యోగి మోడెం మధుసూదన్ ఈనెల 2న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా డీజిల్ కాలనీ ప్రధాన రహదారిపై ముగ్గురు యువకులు అడ్డగించారు. రూ.100 అర్జంట్‌గా కావాలని ప్రాధేయపడ్డారు.
వారిని చూసి జాలిపడిన మధుసూదన్ జూబ్లీమార్కెట్‌లోని ఏటీఎం కేంద్రం వద్దకు యువకులను తీసుకెళ్లి డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆయనపై ఒక్కసారిగా దాడి చేసి, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యూరు. బాధితుడు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఫొటోలను తీసుకుని ప్రింట్‌లు వేయించి చూడగా డీజిల్ కాలనీకి చెందిన రామడుగు సందీప్, మానుపాటి రవి, నేరేళ్ల శ్రీకాంత్‌తో సరిపోయినట్లు చెప్పారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారి నుంచి రూ.36 వేల నగదు, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.
Advertisement
Advertisement