ఏయూలో దూరవిద్యా పరీక్షలు వాయిదా | AU Distance Exams Postponed due to seemandhra movement | Sakshi
Sakshi News home page

ఏయూలో దూరవిద్యా పరీక్షలు వాయిదా

Published Thu, Sep 12 2013 10:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

AU Distance Exams Postponed due to seemandhra movement

ఈ నెల19 నుంచి ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో జరగవలసిన దూర విద్యా పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ యూనివర్శిటీ దూర విద్యా శాఖ సంచాలకులు నరసింహరావు గురువారం విశాఖపట్నంలో వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

 

ఆ పరీక్షల నిర్వహణ తేదిని త్వరలో వెల్లడిస్తామని నరసింహరావు తెలిపారు. అలాగే హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన దూర విద్యా  పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆశీర్వాదం గురువారం ఓ ప్రకటనలో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement