distance exams
-
7 నుంచి బీఈడీ దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య బీఈడీ పరీక్షలు ఈ నెల 7 నుంచి జరగనున్నాయి.ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు. 7వ తేదీన ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, 8న సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్, 9 స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, 10న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, 11 ,12, 13 తేదీల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన మెథడ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. -
దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్
– ఎస్కే దూర విద్య పరీక్షలు ప్రారంభం – సెంటర్ రద్దు అయినా మారని నిర్వాహకుల తీరు – పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి వసూళ్లు – చీటిలు పెట్టి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు – పత్తాలేని పర్యవేక్షణ అధికారి? కర్నూలు సిటీ: శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. సోమవారం నుంచి ఎస్కే దూర విద్య డిగ్రీ పరీక్షలు నగరంలోని గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న ఓ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు. యూనివర్సిటీ అధికారి పరీక్ష కేందంలో ఉండి పర్యవేక్షించాల్సి ఉన్నా పరీక్ష మొదలు అయ్యే సమయంలో మాత్రమే ఉండి మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దూర విద్య కేంద్రాల నిర్వాహకులు.. కొందరు విద్యార్థులకు చీటిలు ఇవ్వగా, మరి కొందరు విద్యార్థులు పాత పుస్తకాలు చింపుకొని వెంట తెచ్చుకున్నట్లు సమాచారం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, పదోన్నతుల కోసం, గృహిణులు, నిరుద్యోగులు విద్యార్హత కోసమే అధిక శాతం దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని నిర్వాహకులు విద్యార్థుల నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేసినట్లు తెలిసింది. దూర విద్య కేంద్రాల ద్వారా చదువుతున్న వారి నుంచి యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించి, సకాలంలో మెటీరియల్ అందజేయాల్సి ఉంది. అయితే యూనివర్సిటీ అధికారులు రెండేళ్లుగా పుస్తకాలను సరఫరా చేయకపోవడంతో నిర్వాహకులకు కలిసి వస్తోంది. దీన్నో అవకాశంగా తీసుకొని పరీక్షలను చూచి రాయిస్తామని విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. చూచిరాతలు జరుగుతుండడంతో గతంలో సెంటర్‌గా ఉన్న కాలేజీని రద్దు చేశారు. అయినా నిర్వాహకుల తీరు మారకపోవడం గమనార్హం. చిట్టీలు పెట్టి పరీక్షలు! శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో ఏడాదికేడాది చూచిరాతల జోరు పెరుగుతున్నా నియంత్రించ లేకపోతున్నారు. సాధారణంగా దూర విద్య అంటే సెలవు రోజుల్లో క్లాస్‌లు నిర్వహించి, రికార్డులు, సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేయించాలి. పరీక్షలకు నాలుగు నెలల ముందుగానే కోర్సు మెటీరియల్ ఇవ్వాలి. రెండేళ్లుగా యూనివర్సిటీ అధికారులు ఆదాయంపై ఉన్న ధ్యాస విద్యార్థులకు ఇవ్వాల్సిన మెటీరియల్, క్లాస్‌లు, ల్యాబ్‌పై పెట్టక పోవడం కూడా మాస్ కాపీయింగ్‌కు కారణమనే విమర్శలున్నాయి. ఒకరు తరువాత.. ఇన్విజిలేటర్ సోమవారం ప్రశ్నపత్రం ఇచ్చాక విద్యార్థులు సమాధానాలు చిటీలను చూసి ఒకరు తరువాత ఒకరు రాశారు. పరీక్షల పర్యవేక్షణకు మాత్రం యూనివర్సిటీ నుంచి వచ్చే వారిని నిర్వాహకులు ముందుగానే తమకు అనుకూలమైన వారిని డ్యూటీలో వేయించుకున్నట్లు సమాచారం. అందుకు వచ్చిన అధికారి కాసేపు ఉండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన డిగ్రీ, పీజీ దూర విద్య పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్లు యూనివర్సిటీ అధికారుల విచారణలో తెలడంతో సెంటర్‌ను రద్దు చేశారు. అయితే గాయత్రి ఎస్టేట్‌లోని కాలేజీలో పరీక్షలను నిర్వహించేందుకు మరో వ్యక్తి సెంటర్‌కు అనుమతి ఇవ్వడంతో అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలేజీలోకి ఎవరూ రాకుండా గేట్లు వేసి, మూడు, నాల్గో ఫ్లోర్లో పరీక్షలు నిర్వహించారు. -
నేటి నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : దూరవిద్య పీజీ, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 103 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆన్లైన్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపనున్నట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జే.శ్రీరాములు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు ఆన్లైన్ ద్వారా ప్రశ్నపత్రాలను ఈ మెయిల్‌కు పంపుతామన్నారు. ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ద్వారా ప్రిన్సిపల్స్ ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష ముగిసిన వెంటనే జవాబుపత్రాలు రిజిస్టర్ పోస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో అలసత్వం వహించే పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకుంటామన్నారు. -
5 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం లేటరల్ ఎంట్రీ ద్వారా డిగ్రీ , ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ , ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 5 నుంచి పరీక్షలు జరుగుతాయని ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ పరీక్షలు ఈనెల 12న, పీజీ పరీక్షలు ఈనెల 11న ముగియనున్నట్లు తెలిపారు. -
జూన్ 5 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విధానం ద్వారా పీజీ, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జూన్ 5 నుంచి నిర్వహించనున్నట్లు దూరవిద్య విభాగం అధికార వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘ దూర మిథ్య’ అనే శీర్షికతో మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. 19 నెలలు గడుస్తున్నప్పటికీ దూరవిద్య పీజీ, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ప్రకటించలేదు. కథనం ప్రచురితమైన రోజే ఇదే అంశంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు. వర్సిటీ యాజమాన్యం మంగళవారం పరీక్షల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని వీసీ కె.రాజగోపాల్ ఆదేశాలు జారీ చేయడంతో షెడ్యూల్ ఖరారు చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం మొదటి సంవత్సరం విద్యార్థులు, లేటలర్ ఎంట్రీ విద్యార్థులకు జూన్ 5 నుంచి పరీక్షలు ఉంటాయి. 12న డిగ్రీ పరీక్షలు, 11న పీజీ పరీక్షలు ముగియనున్నాయి. -
చూసి రాసేసుకోవచ్చు!
దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఇష్టారాజ్యంగా పరీక్షల నిర్వహణ పర్యవేక్షకులు లేకుండానే ఎగ్జామ్స్ జవాబు పత్రాలు పంపడంలోనూ నిదానమే ఇదీ శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డిస్టెన్స్ పరీక్షల తీరు నర్సాపూర్: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ డిస్టెన్స్ వార్షిక పరీక్షల్లో చూసి రాతల హడావిడి ఎక్కువైంది. డిగ్రీ, పీజీ పరీక్షలు రాసే అభ్యర్థులు పుస్తకాలు దగ్గర పెట్టుకుని మరీ రాసేసుకుంటున్నారు. నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో కొనసాగుత్ను స్టడీ సెంటర్లో కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నట్లు సమాచారం. మాస్ కాపీయింగ్ కోసం స్కూల్ యాజమాన్యం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మందికి ‘అవసరం’ దూరవిద్యలో పరీక్షలు రాసేవారిలో ప్రమోషన్ల కోసం కొందరు ఉద్యోగస్తులు రాస్తుండగా.. మరికొందరు ఇతర వ్యాపకాలు ఉన్నవారు. దీంతో వీరంతా కాపీయింగ్‌పై ఆధారపడుతున్నారు. అభ్యర్థుల అవసరాలను నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. అదనంగా డబ్బులు వసూలు చేస్తూ చూసి రాతలకు అవకాశం ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. పరీక్ష కేంద్రం మార్పు నర్సాపూర్‌తో పాటు తూప్రాన్‌లోని స్టడీ సెంటర్‌కు చెందిన అభ్యర్థులకు నర్సాపూర్‌లోని వైష్ణవి డీఎడ్ కాలేజీలో పరీక్షలు నిర్వహించాల్సిందిగా యూనివర్సిటీ ఆదేశించింది. ఈ మేరకు హాల్‌టికెట్లు జారీ చేసింది. కాగా, యూనివర్శిటీ సూచించిన కాలేజీ భవనం కాకుంగా స్థానిక స్టడీ సెంటర్, తూప్రాన్‌కు చెందిన స్టడీ సెంటర్ నిర్వాహకులు కలిసి నర్సాపూర్‌కు దూరంగా ఉన్న ఓ కొత్త భవనంలో ఎగ్జామ్ సెంటర్ కొనసాగిస్తున్నారు. కనీసం పరీక్షలు నిర్వహిస్తున్న భవనం వద్ద సూచిక బోర్డు సైతం ఏర్పాటు చేయలేదు. సెంటర్ మార్పుపై ‘సాక్షి’ ప్రశ్నించగా.. వైష్ణవి డీఎడ్ కాలేజీలో గదులు సరిపోనందున కొత్త భవనంలోకి కేంద్రాన్ని మార్చామని పరీక్షల సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి చెప్పారు. మాస్ కాపీయింగ్ ఇలా.. పలువురు అభ్యర్థులు పుస్తకాలు పక్కన పెట్టుకుని పరీక్షలు రాస్తుండగా.. ఇంకొందరు చీటీలు తెచ్చుకున్నారు. మరికొందరైతే పక్కపక్కనే కూర్చొని రాసుకుంటున్నారు. పరీక్షలు జరుగుతున్నపుడు యూనివర్శిటీకి ఇన్విజిలేటర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్విజిలేటర్ ఆదివారం వచ్చారని, సోమవారం సిద్దిపేట వెళ్లారని సెంటర్ నిర్వాహకులు చెప్పారు. జవాబు పత్రాలు పంపడంలో జాప్యమే పరీక్ష కేంద్రం ఇన్చార్జిలు జవాబు పత్రాలను వెంటనే సంబంధిత సెంటర్‌కు పంపించడం లేదని తెలిసింది. ఆదివారం జరిగిన పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను సోమవారం మధ్యాహ్నం వరకు పంపకపోవడం ఇందుకు ఉదాహరణ. సోమవారం పరీక్షలు జరుగుతుండగా.. కొందరు యువకులు ఆదివారం పూర్తయిన పరీక్ష జవాబు పత్రాలను ప్యాక్ చేస్తున్నారు. అక్కడ కూడా అధికారులెవరూ లేరు. -
సెప్టెంబర్ 3 నుంచి కేయూ దూరవిద్య పరీక్షలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ కె.ఫణిప్రసాద్‌రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను స్వామి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఉన్న స్టడీ సెంటర్లో లేదా www.sdlceku.co.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. -
ఏయూలో దూరవిద్యా పరీక్షలు వాయిదా
ఈ నెల19 నుంచి ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో జరగవలసిన దూర విద్యా పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ యూనివర్శిటీ దూర విద్యా శాఖ సంచాలకులు నరసింహరావు గురువారం విశాఖపట్నంలో వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఆ పరీక్షల నిర్వహణ తేదిని త్వరలో వెల్లడిస్తామని నరసింహరావు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన దూర విద్యా పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆశీర్వాదం గురువారం ఓ ప్రకటనలో చెప్పారు.