నేటి నుంచి దూరవిద్య పరీక్షలు | distance exams start today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దూరవిద్య పరీక్షలు

Published Sun, Jun 4 2017 11:52 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

distance exams start today

ఎస్కేయూ : దూరవిద్య పీజీ, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 103 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపనున్నట్లు ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జే.శ్రీరాములు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నపత్రాలను ఈ మెయిల్‌కు పంపుతామన్నారు. ఎన్‌క్రిప్టెడ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా ప్రిన్సిపల్స్‌ ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.  పరీక్ష ముగిసిన వెంటనే జవాబుపత్రాలు రిజిస్టర్‌ పోస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో అలసత్వం వహించే పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement