సదావర్తి సత్రం భూముల అమ్మకానికి గురువారం జరగాల్సిన బహిరంగ వేలం వాయిదా పడింది.
సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల అమ్మకానికి గురువారం జరగాల్సిన బహిరంగ వేలం వాయిదా పడింది. సుప్రీంకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈనెల 18న తిరిగి నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ముందుగా అనుకున్న ప్రకారం గురువారం జరగాల్సిన వేలంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నంతో గడువు ముగియగా.. నిర్ణీత గడువులోగా ఐదు బిడ్లు దాఖలయ్యాయి.
తాజాగా వేలంలో పాల్గొనడానికి దరఖాస్తు స్వీకరణకు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువును పొడిగించారు. అప్పటి వరకు అందిన దరఖాస్తులతో 18 ఉదయం 11 గంటలకు చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో బహిరంగ వేలం జరపాలని అధికారులు నిర్ణయించారు.