ఈ సారి 85శాతం పోలింగ్
మహిళలు, ఎస్సీల ఓట్లే కీలకం
అవనిగడ్డ శాససభ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 1,96,305మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 98,649మంది మహిళలు, 97,633మంది పురుషులు ఉన్నారు. 23 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 1,66, 223మంది ఓటు వేశారు. 85శాతం పోలింగ్ నమోదైంది. వీరిలో 83,625మంది పురుషులు ఉండగా, 82,595మంది మహిళలు ఉన్నారు. ఒకరు ఇతరులు ఉన్నారు. ఐదు పోలింగ్ కేంద్రాలు పాదాలవారిపాలెం, చింతకోళ్ల, ఇరాలి, సంగమేశ్వరం, పాలకాయతిప్పలో 95శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా ఇస్మాయిల్‌బేగ్‌పేటలో 52 శాతం పోలింగ్ నమోదైంది. 44 కేంద్రాల్లో 90 నుంచి 95 శాతం ఓటింగ్ నమోదుకాగా 109 కేంద్రాల్లో 85 నుంచి 95శాతం నమోదైంది. కొడాలి, చిరువోలు, పెదకళ్లేపల్లి, రామచంద్రపురం, భావదేవరపల్లిలో పురుషులు, మహిళలూ సమానంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం 241 కేంద్రాల్లో 101 బూత్‌లలో మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 140బూత్‌లలో పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఘంటసాల మండలంలో మొత్తం 31,454మంది ఓటర్లకుగాను 26,999మంది ఓటు వేశారు. 85.83 శాతం పోలింగ్ నమోదైంది. చల్లపల్లి మండలంలో 38,953మంది ఓటర్లుండగా 32,123మంది ఓటు వేశారు. 82 శాతం పోలింగ్ నమోదైంది. అవనిగడ్డ మండలంలో మొత్తం 57,312మంది ఓటర్లకు 47,667మంది ఓటు వేశారు. 83.16 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో ఎస్సీ కాలనీల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది. వీరి ఓట్లు గెలుపోటముల్లో కీలకం కానున్నాయి. వీరితో పాటు నియోజకవర్గంలో మహిళలు, తరువాత మత్స్యకారుల ఓట్లు కీలకమవుతాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఫలితాల కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈనెల 16న విజయవాడలో ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అందరిచూపూ ప్రస్తుతం అటువైపు పడింది.
అవనిగడ్డ శాసనసభ ఫలితాలపై ఉత్కంఠట
Published Thu, May 15 2014 3:49 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement