
అమరావతి: రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో సమాన స్థాయిలో టూరిజంను అభివృద్ధి చేస్తామని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో బాపు మ్యూజియం, ఏలూరు మ్యూజియాలను వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. ఆగస్టులో టూరిజం ఎండీతో కలిసి అన్ని జిల్లాల్లో పర్యటక పనులను పరిశీలిస్తామన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల రూపాయల పారితోషికాన్ని అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ అవార్డు కోసం కమిటీ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో పేరుగాంచిన జయశ్రీ రామానాథ్(బొంబాయి జయశ్రీ)ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment