రైల్లో కిలోన్నర బంగారం చోరీ! | bag containing 1.49 kg gold misplaced in duranto express | Sakshi
Sakshi News home page

రైల్లో కిలోన్నర బంగారం చోరీ!

Published Fri, Mar 6 2015 2:22 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

రైల్లో కిలోన్నర బంగారం చోరీ!

రైల్లో కిలోన్నర బంగారం చోరీ!

ఖరీదైన రైలు.. అందులోనూ ఖరీదైన బోగీ.. ఎలాంటి సమస్యా ఉండబోదని దాదాపు కిలోన్నర బంగారాన్ని బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్తున్నారు. దాన్ని కూడా దొంగలు కొట్టేశారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు దురంతో ఎక్స్ప్రెస్ ఫస్ట్క్లాస్ బోగీలో వస్తున్న ప్రయాణికురాలి నుంచి 1.49 కిలోల బంగారం ఉన్న బ్యాగును దొంగలు కొట్టేశారు.

50 ఏళ్ల వయసున్న నాగశేషు వేణు అనే మహిళ బంగారం ఉన్న బ్యాగును తన తలగడ కింద పెట్టుకుని నిద్రపోయారు. కానీ వరంగల్ స్టేషన్కు చేరుకునే సమయానికి మెలకువ వచ్చి చూసుకుని, బ్యాగు పోయిన విషయం తెలిసింది. దాంతో వెంటనే ఆమె టీటీఈకి చెప్పారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఫిర్యాదు నమోదు చేశారు. ఈ రైలు విశాఖ తర్వాత కేవలం విజయవాడలోనే ఆగుతుంది. బహుశా అక్కడే బ్యాగు ఎవరో కొట్టేసి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement