తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పలువురు నేతలు పరామర్శిస్తున్నారు.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సోమవారం బాలకృష్ణ పరామర్శించారు. అలాగే మాజీ మంత్రి , కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు కూడా పరామర్శించనవారిలో ఉన్నారు. పరామర్శ అనంతరం శంకర్రావు మాట్లాడుతూ చంద్రబాబు తనకు మిత్రుడని, అందుకే పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు.
రాజకీయాలకు సంబంధం లేదని ఆయన అన్నారు. టీడీపీ నేతలు కూడా అధ్యక్షుడిని పరామర్శించేందుకు వస్తున్నారు. కాగా చంద్రబాబు షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు బాబు త్వరగా కోలుకోవాలంటూ కార్యకర్తలు పూజలు నిర్వహించారు.