సాక్షి, హైదరాబాద్: సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.బాలయోగి నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్.జగన్నాథం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్-1 చైర్మన్‌గా ప్రస్తుతం బాలయోగి విధులు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలయోగి 1985లో మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు. 2001లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. కర్నూలు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. అలాగే సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమేష్‌ను మొదటి అదనపు ప్రత్యేక కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.