చిత్తూరు జిల్లా నగరి ప్రాంతంలో బెలూన్ల వ్యవహారం చిచ్చు రేపింది. ఈ గొడవల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో మునిసిపల్ చైర్పర్సన్ శాంతకుమారితో పాటు మరికొంతమందికి ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యకాండపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం మీద కూడా ఆగడాలకు పాల్పడిన చరిత్ర ఉంది. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో బెలూన్ల విషయంలో గొడవ పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు.
చిత్తూరులో చిచ్చురేపిన బెలూన్ల గొడవ!
Published Mon, Jan 5 2015 7:26 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement