నృత్యాలతో అలరించిన చిన్నారులు.. | Balotsav end in khammam district | Sakshi
Sakshi News home page

నృత్యాలతో అలరించిన చిన్నారులు..

Published Mon, Dec 9 2013 6:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

Balotsav end  in khammam district

ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: ‘ఆదివారం మీకోసం’ ఆధ్వర్యంలో ఖమ్మంనగరంలో బాలోత్సవ్ నిర్వహించడం ఆనందంగా ఉందని బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బీవీకే) చైర్మన్ తమ్మినేని వీరభద్రం అన్నారు. మూడురోజులుగా ఖమ్మంలోని మంచికంటి భవనం కొండబోలు వెంకయ్య మీటింగ్ హాల్‌లో జరుగుతున్న బాలోత్సవ్ ఆదివారం ముగిసింది. సాహితి స్రవంతి రాష్ట్ర బాధ్యులు  కే. ఆనందాచారి అధ్యక్షత జరిగిన ముగింపు సభకు తమ్మినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఆదివారం మీకోసం’ ఆధ్వర్యంలో  ఖమ్మంలో బాలోత్సవ్ నిర్వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని అన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివారం మీకోసం అధ్వర్యంలో ఇప్పటి వరకు 113 ఆదివారాలు వివిధ సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.
 
 ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, వైద్యులు బారవి, రాజేష్, మురళి, దమయంతి, సమత, శ్రీనివాస్, రమ, ఏవీఎం అధ్యక్ష,కార్యదర్శులు ఐ. జోసెఫ్, కె. హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు రోజుల బాలోత్సవ్ ఏర్పాట్లను బీవీడీ ప్రసాద్, చావా వీరభద్రం, టి.జనార్ధన్, స్వామి, సురేఖ, అరుణ, శ్రీదేవి, పింకి, హైమ, సత్తెనపల్లి శ్రీను, అబీద్‌అలీ, హబీబ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 25 గ్రూపుల విద్యార్థులు డాన్స్ చేసి ఉర్రూతలూగించారు. కథ చెబుతా ఊ..కొడతారా అనే కార్యక్రమానికి 17 పాఠశాలలు నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు 58 పాఠశాలలకు చెందిన 1200 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాలొన్నారు. వారిలో 97 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో విజేతలయ్యారు.  
 
 విజేతల వివరాలు
     ‘డ్రాయింగ్’ సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని జి.తరుణ్, ద్వితీయ బహుమతిని లహరి, తృతీయ బహుమతిని వైష్ణవ్, జూనియర్స్ విభాగంలో నాగ ప్రజ్ఞశ్రీ ప్రథమ, లోహిత్ ద్వితీయ, డి.మేఘనాధ్‌రెడ్డి తృతీయ బహుమతి, సీనియర్స్ విభాగంలో సీహెచ్.ఉమామహేష్ మొదటి, సూర్యవంశీ ద్వితీయ, బి.జీవన్‌జ్యోతి తృతీయ బహుమతి పొందారు.
 
     ‘భరతనాట్యం’లో సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి మానస, ద్వితీయ బహుమతి సాయిరాధిక, తృతీయ బహుమతి శ్రీహిత, జూనియర్స్ విభాగంలో స్వర్ణ ఆశ్రీత, చైత్రిక, విష్ణుశ్రీలు మొదటి మూడు స్థానాలు సాధించారు. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని ఏ.గాయత్రి, ద్వితీయ బహుమతి సాయిశ్రీ, మూడో బహుమతిని ప్రావీణ్య గెలుచుకున్నారు.
 
     ‘ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్’లో సబ్ జూనియర్స్ విభాగంలో కార్తీక్ ప్రథమ, ఆదిత్య రెండో బహుమతి, నవ్యశ్రీ మూడో బహుమతి  గెలుచుకున్నారు. జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి శ్రీచైతన్య, ద్వితీయ బహుమతి సోఫియా, తృతీయ బహుమతిని అపర్ణ, సీనియర్స్ విభాగంలో మహేష్, విజ్ఞత, గౌమతి మొదటి మూడు బహుమతులు గెలుచుకున్నారు.
 
     ‘వ్యాసరచన’ జూనియర్స్ విభాగంలో కె.సాహితి, ఎం.మహేష్, స్వర్ణ మొదటి మూడు బహుమతులు సాధించారు. సీనియర్స్ విభాగంలో ఏ.సురేష్, జె.నవ్య,కె.నాగూర్‌లు మూడు బహుమతులు సాధించారు.
 
     ‘ఫోక్ డ్యాన్స్’ సబ్ జూనియర్స్ (సోలో ) విభాగంలో అపర్ణ, నందు, పావనీ  మొదటి మూడు బహుమతులు సాధించారు.  
 
     ‘డిబేటింగ్’ జూనియర్స్ విభాగంలో పి.లక్ష్మీప్రసన్న, ఏవీఎస్ రామతులసి, పి.సిరి మొదటి మూడు బహుమతులు, సీనియర్స్ విభాగంలో ఇస్రత్ పర్వీన్, ఎస్‌కె.పర్వీన్, ఎస్.సంధ్యారాణి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
 
     ‘కథ చెబుతా ఊ కొడతారా’ సబ్ జూనియర్స్ విభాగంలో పావని ప్రియ, ఆశ్రీత, నవదీప్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించగా, జూనియర్స్ విభాగంలో రమణ, కుముదిని, చైతన్య ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులు సాధించార .
 
     ‘తెలుగులో మాట్లాడుదాం’లో జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కీర్తన, ద్వితీయ బహుమతి రామతులసి, తృతీయ బహుమతి శ్రీవర్ష, సీనియర్స్ విభాగంలో సాయిశరత్ ప్రథమ, రవితేజ ద్వితీయ, అభినవ్ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement