బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత
కృష్ణా : బందరు పోర్టు భూ సేకరణపై బాధిత గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ కరగ్రాహారం, పోతేపల్లి, బొరబోతుపాలెం గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
పోర్టు నిర్మాణానికి చేపట్టిన అవగాహన సదస్సులను గ్రామస్తులు బహిష్కరించారు. భూ సేకరణ జోవోను రద్దు చేయాలంటూ అధికారులను బాధిత గ్రామాల ప్రజలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో మూడు గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు.