Bandar port
-
బందరు తీరంలో..త్వరలో లంగరు
-
శరవేగంగా బందరు పోర్టు పనులు
చిలకలపూడి(మచిలీపట్నం) : బందరు పోర్టు నిర్మాణ పనులు నిరంతరాయంగా శరవేగంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండల పరిధిలో జరుగుతున్న పోర్టు పనులను గురువారం ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొందరు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ దేవుడు సీఎం జగన్ రూపంలో పంపి పోర్టు నిర్మాణ పనులు జరిగేలా చేస్తున్నారని చెప్పారు. ఏడు నెలలుగా నిరంతరాయంగా పనులు జరుగుతున్నాయని, పోర్టుకు వచ్చేందుకు పక్కా రహదారి నిర్మాణం జరుగుతోందని ఇందుకోసం 90 శాతం భూమిని కూడా సేకరించినట్టు చెప్పారు. మిగిలిన భూమి మరో నెల రోజుల్లో సేకరించనున్నట్టు తెలిపారు. మెఘా ఇంజనీరింగ్ సంస్థ 25 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగుతోందన్నారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు పూర్తి చేసి జనవరి నుంచి డ్రెడ్జింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పోర్టు నిర్మాణాన్ని ఆరు నెలలు ముందుగానే పూర్తి చేసేలా మొక్కవోని దీక్షతో పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. నిర్మాణం ఆగకుండా, బిల్లులు పెండింగ్ లేకుండా సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ఉన్నారని వివరించారు. గతంలో పచ్చ పార్టీ పోర్టు పనుల ప్రారంభ నాటకం గతంలో చంద్రబాబు ప్రజలను మోసగించేలా పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఎమ్మెల్యే నాని గుర్తుచేశారు. నిర్లజ్జగా బరితెగించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏమీ చేయకుండా చివరిలో రైతు భూమిలో శంకుస్థాపన చేసి రూ.8.5 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. 22 గ్రామాల్లో 33 వేల ఎకరాలు బలవంతపు భూసేకరణ చేసేందుకు ప్రయత్నించారని, అనుమతులు, నిధుల్లేకుండా శంకుస్థాపన రాళ్లు వేసి ప్రజలను మోసగించారని గుర్తుచేశారు. మూలపేట పోర్టుతో శ్రీకాకుళం జిల్లాకు మహర్దశ టెక్కలి: రాష్ట్రంలోని తీరప్రాంతంలో రూ.16వేల కోట్లతో మూడు పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్టు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం మూలపేట తీరంలో నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులను గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం తీర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం ఉన్న 5 పోర్టులతో పాటు అదనంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తయితే సుమారు 75 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 320 మిలియన్ టన్నుల మేరకు ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి మూలపేట పోర్టు నుంచి షిప్ ట్రయల్ రన్ చేయనున్నట్టు చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 2025 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు తిరిగేలా చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో మూలపేట ప్రాంతం విశాఖతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయన్నారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. 14 ఏళ్ల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. -
శరవేగంగా బందరు పోర్టు నిర్మాణం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నం వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. పోర్టునిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పనులు పరుగెడుతున్నాయి. పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేశారు. ఇందులో భాగంగా మే 22వ తేదీన పనులను ప్రారంభించారు. గతంలో చంద్రబాబు నాయుడు పోర్టు పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టారు. అలా కాకుండా ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని ఏకంగా పనులనే ప్రారంభించారు. దీంతో పనులు చేసేందుకు ఎలాంటి ఆటంకం లేకపోవడంతో పోర్టు పనులు జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతున్నాయి. మెయిల్ సంస్థ పనులు నిర్వహిస్తోంది. పనులు పూర్తి చేసేందుకు 30 నెలల కాల వ్యవధిని నిర్ణయించారు. పోర్టునిర్మాణానికి సంబంధించి సరిహద్దులు గుర్తించి మార్కింగ్ చేశారు. బీచ్ రోడ్డు నుంచి బ్రేక్ వాటర్ వరకు తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టారు. శాశ్వత రోడ్డు నిర్మాణానికి సంబంధించి సర్వే పనులు పూర్తి అయ్యాయి. లేబర్ క్యాంపులు, ఆఫీసులు, అకడమిక్ బ్లాక్‌లు, వెయింగ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. నేలను పటిష్టం చేసేందుకు.. పోర్టు నిర్మాణపు పనులు జరిగే ప్రాంతంలో ల్యాబ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బెర్తు నిర్మాణం కోసం నేల గట్టిదనాన్ని పరిశీలించి, నేలను పటిష్టం చేస్తున్నారు. అక్కడ పెద్ద స్థాయిలో బొగ్గు, ఇనుము నిల్వ చేస్తారు. కాబట్టి ఆ బరువును తట్టుకొనే విధంగా నేలను గట్టి పరుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.350 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు పనులను నేరుగా సమీక్షిస్తున్నారు. దీంతో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు, స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని, అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కలిసి క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించి పనుల వేగం పెరిగేలా చర్యలు తీసుకొంటున్నారు. పనులు తీరు ఇలా... ► సౌత్ బ్రేక్ వాటర్‌కు సంబంధించి 2,075 మీటర్ల పనులు జరగాల్సిండగా ఇప్పటి వరకు 765 మీటర్ల పనులు చేశారు. అంటే 3.60 లక్షల టన్నుల కొండరాళ్లను పరిచారు. ► నార్త్ బ్రేక్ వాటర్‌కు సంబంధించి 250మీటర్ల మేర పనులు జరగాల్సిండగా ఇప్పటికే ఆమేర పనులు పూర్తయ్యాయి. ఇక్కడ 54,254 మెట్రిక్ టన్నుల రాళ్లను పరిచారు. ► సముద్రం ఒడ్డున డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించి, 1.82లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు చేశారు. ►బెర్తులు, ఫెర్టిలైజర్ యార్డు, అడ్మిన్ బిల్డింగ్, కోల్‌యార్డు, గోడౌన్ నిర్మాణం జరిగే ప్రాంతంలో 5మీటర్ల మేర ఎత్తును లేపాల్సి ఉండగా, ఇప్పటికే 1.62లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఫిల్లింగ్ చేశారు. ఈ నిర్మాణాలు జరిగే ప్రాంతంలో భూమి కుంగిపోకుండా 21 లక్షల మీటర్ల మేర పీవీడీ (ఫ్రీ ప్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రెయిన్స్) రన్నింగ్ లైన్స్ పనులు పూర్తయ్యాయి. ► ప్రహారికి సంబంధించి ఇప్పటికే 219 ఫైల్స్ పూర్తి చేశారు. కస్టమ్స్ బిల్డింగ్‌కు సంబంధించిన పనులు సాగుతున్నాయి. ► పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతాన్ని చదును చేసే ప్రక్రియ పూర్తి అయ్యింది. అప్రోచ్ చానల్, రోడ్డు, రైలు కనెక్టివిటీ పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం ఇలా.. మొదటి దశలో కార్గో రవాణా కెపాసిటీ : 35.12 మిలియన్ టన్నులు ప్రాజెక్టు విలువ : రూ. 5,153.73కోట్లు బెర్తుల సంఖ్య : 4(3–జనరల్కార్గో, 1–కోల్) డ్రెడ్జింగ్ : –16.40 ఎంసీడీ షిప్‌లు : 80,000 డీడబ్ల్యూటీ భూసేకరణ : 1922 హెక్టార్లు పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం : 1688.82 హెక్టార్లు రోడ్డు కనెక్టివిటీ కోసం : 234.15 హెక్టార్లు పనుల వేగం పెంచాం.. పోర్టు నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం చేశాం. పనులకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతులు వచ్చాయి. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పనులు సాగే విధంగా, పోర్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్షిస్తున్నాం. భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. అక్కడ సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ పనులతోపాటు, ప్రహారి, కస్టమ్స్ బిల్డింగ్, బెర్తులు, కోల్‌యార్డు, జరిగే ప్రాంతాల్లో రిక్రమేషన్, పీవీడీ పనులు సాగుతున్నాయి. – రాజాబాబు, కలెక్టర్, కృష్ణా జిల్లా -
బందరు పోర్టుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మచిలీపట్నం (బందరు) పోర్టుకు ఎదురైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. తాజాగా గురువారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు వ్యవహారంలో నవయుగ పోర్టు లిమిటెడ్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు కావడమే ఇందుకు కారణం. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ‘నవయుగ’ సంస్థ దాఖలు చేసిన మూడు అనుబంధ పిటిషన్లనూ హైకోర్టు గురువారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ఆదేశాలివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌నూ కొట్టేసింది. అలాగే, తమతో ఒప్పందం రద్దుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలన్న అనుబంధ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. అంతేకాక.. ఒప్పందం రద్దుచేసుకుంటూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–66, ప్రాజెక్టును పీపీపీ నుంచి ఈపీసీ విధానంలోకి మారుస్తూ జారీచేసిన జీఓ–9 అమలును నిలుపుదల చేయాలంటూ దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ పోర్టు నిర్మాణం విషయంలో యథాతథస్థితి ఉత్తర్వులతో సహా నవయుగ కోరిన విధంగా ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని హైకోర్టు తేల్చిచెప్పింది. టెండర్ ఖరారు, లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ, లోయస్ట్ బిడ్డర్ ఒప్పందం కుదుర్చుకోవడం వంటి విషయాల్లో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టంచేసింది. పోర్టు నిర్మాణంపై ముందుకెళ్లే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనలనూ తోసిపుచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2,360 ఎకరాల భూమిని అప్పగించేందుకు సిద్ధమైనా కూడా నవయుగ తిరిగి కొత్త షరతులను విధిస్తూ వచ్చిందని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను డిసెంబర్ మొదటి వారంలో తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పుపై నవయుగ అప్పీల్ నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం రద్దు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థిస్తూ గత నెల 25న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ‘నవయుగ’ అప్పీల్ చేసింది. దీంతోపాటు పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు చేయడంతో పాటు సింగిల్ జడ్జి తీర్పు అమలును, ఒప్పందం రద్దు ఉత్తర్వుల జీఓ అమలును నిలిపేయాలని కోరుతూ మూడు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ఈ నెల 20న మధ్యంతర ఉత్తర్వుల జారీపై తన నిర్ణయాన్ని రిజర్వ్‌చేసింది. తాజాగా గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. అప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ‘ఒప్పందం రద్దును సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత లోయస్ట్ బిడ్డర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులెవ్వరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న నవయుగ అభ్యర్థనను మన్నించలేకున్నాం. ఇక పోర్టు కొత్త మోడల్ ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని 830 ఎకరాలకు కుదించారు. అలాగే, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.700 కోట్లకు తగ్గించారు. అందువల్ల జీఓ–9 అమలు నిలుపుదల సాధ్యంకాదు. జీఓ–66 సంగతికొస్తే, సింగిల్ జడ్జి ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నవయుగ పిటిషన్‌ను కొట్టేశారు. అందువల్ల దాని అమలును నిలుపుదల చేయలేం’.. అని ధర్మాసనం తేల్చిచెప్పింది. మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలని ఎక్కడాలేదు... ‘2008లో ఒప్పందం కుదిరినప్పటికీ, ఎప్పటికప్పుడు అవసరమైన భూమిని అప్పగిస్తూ వచ్చినప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మొత్తం భూమిని ఒకేసారి ఇవ్వాలన్న నిబంధనలు ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఒప్పందంలోని బా«ధ్యతలను నిర్వర్తించడంలో రాయితీదారు (నవయుగ) విఫలమైతే ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకోవచ్చునని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. ఇక పోర్టు అభివృద్ధి కోసం 2,360 ఎకరాలతోపాటు మరో 519 ఎకరాల అసైన్డ్ భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించింది. 5,324 ఎకరాలను ఒకేసారి ఇవ్వాలని పట్టుబట్టింది. వీటన్నింటి దృష్ట్యా మొత్తం భూమిని ఒక్కసారే ఇవ్వలేదు కాబట్టి ప్రాజెక్టును చేపట్టలేదన్న నవయుగ వాదనను ఆమోదించలేకున్నాం. పరస్పర విరుద్ధంగా ‘నవయుగ’ లేఖలు ‘నిజానికి.. 2019 ఏప్రిల్‌లో పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖల్లో ప్రాథమిక పనులను మొదలుపెట్టినట్లు నవయుగ చెప్పింది. అయినప్పటికీ నవయుగ ముందుకెళ్లలేదు. అంతేకాక.. నవయుగ రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలను బట్టి నవయుగ బాధ్యతలను నిర్వర్తించలేదు. పైపెచ్చు కొత్త షరతులు విధిస్తూ వచ్చింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్న నవయుగ వాదనను తోసిపుచ్చుతున్నాం. సింగిల్ జడ్జి తీర్పులో వ్యక్తంచేసిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. వీటన్నింటి దృష్ట్యా నవయుగ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
సంపన్న తీర హారం!
బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి మళ్లీ మీ జిల్లాకు (కృష్ణా) వస్తా. దశాబ్దాల కలలు త్వరలోనే సాకారం కానున్నాయి. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. – ఇటీవల నేతన్న నేస్తం నిధుల విడుదల సందర్భంగా పెడన సభలో సీఎం జగన్ నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కోస్తా తీరం శాశ్వత ఆదాయ మార్గంగా రూపుదిద్దుకుంటోంది. బందరు పోర్టు పూర్తైతే రూ.పది వేల కోట్లకుపైగా పెట్టుబడులతోపాటు 15 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాథమిక అంచనా. ఏటా కనీసం 18–20 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.300 కోట్లకు మించి ఆదాయం సమకూరనుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఒకవైపు ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు పోర్టులు, హార్బర్లు, జెట్టీల నిర్మాణాలను వేగంగా చేపడుతోంది. 974 కి.మీ. పొడవైన కోస్తా తీరంలో సగటున ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో ఐదు శాతంగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. విస్తార అవకాశాలు... అపార అవకాశాలతో కోస్తా తీరం ప్రగతికి చిరునామాగా నిలువనుంది. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ మెరుగుపడుతోంది. కోస్తా కారిడార్, జాతీయ రహదారులు, చెన్నై– కోల్‌కతా మూడో రైలు మార్గం, నూతన విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉన్న పోర్టులతో పాటు కొత్తవీ రాబోతున్నాయి. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, పేరెన్నికగన్న పులికాట్, కొల్లేరు సరస్సులు, హంసలదీవి, సూర్యలంక, మైపాడు బీచ్‌లు.. ప్రముఖ ఆలయాలతో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగశాల, గుల్లలమోద (నాగాయలంక)లో అందుబాటులోకి రానున్న మిస్సైల్ లాంచింగ్ సెంటర్, విశాఖలో నేవీ కేంద్రం... ఇలా కోస్తా తీరాన ప్రతిదీ ప్రత్యేకమే. పారిశ్రామిక కెరటాలు.. ఇప్పటికే ఉన్న పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు. కాకినాడ గేట్‌వే పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ జూలై 20న శంకుస్థాపన చేయగా త్వరలోనే భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో రూ.1,204 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుండగా తాజాగా రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం హార్బర్ల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ పనులను ప్రారంభించనుంది. పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హర్బర్లు ఏర్పాటవుతుండటంతో 35 భారీ యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా రూ.34,532 కోట్ల పెట్టుబడులతోపాటు 72 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ తూర్పు గోదావరి జిల్లాలోనే రూ.78 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను కొనసాగిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు రవాణా మార్గం.. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతం తూర్పు ఆసియా దేశాలకు ముఖద్వారం లాంటిది. ఇక్కడి పోర్టులు తెలంగాణ, కర్నాటక, ఛతీస్ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సరకు రవాణాకు ఎంతో అనుకూలం. నాగ్‌పూర్‌కు సరుకు రవాణా చేయాలంటే ముంబై కంటే బందరు పోర్టు దగ్గరి దారి అవుతుంది. నాగ్‌పూర్‌కు చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ బందరు నుంచి నాగ్‌పూర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతం అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పోర్టులు, హార్బర్లను అనుసంధానించేలా ఏపీ మారిటైమ్ బోర్డు పలు ప్రతిపాదనలను రూపొందించింది. పోర్టులను రైల్వేలు, జాతీయ రహదారులతో అనుసంధానించడం, తీరప్రాంతంలో జీవనోపాధులను మెరుగుపరచడం ద్వారా కోస్టల్ కమ్యూనిటి అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు పంపింది. ఆక్వాలోనూ కింగే.. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలతో అన్నపూర్ణగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల్లోనూ మేటిగా గుర్తింపు పొందుతోంది. సీఎం జగన్ ఆక్వా రంగాన్ని ఆదుకుంటూ సాగుదారులపై విద్యుత్తు భారాన్ని తగ్గించారు. పదెకరాల లోపున్న ఆక్వా రైతులు యూనిట్ విద్యుత్తుకు రూ.1.50 మాత్రమే చెల్లించేలా ఊరట కల్పించారు. అదే టీడీపీ హయాంలో ఏకంగా రూ.3.80 చొప్పున వసూలు చేయడం గమనార్హం. చార్జీల భారాన్ని తగ్గించడం ద్వారా మూడేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు రూ.2,400 కోట్లు మేర సబ్సిడీ కల్పించింది. అంతేకాకుండా సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అ«థారిటీ–20202ని తీసుకొచ్చారు. 5.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఈ చట్టాలు భరోసా కల్పిస్తున్నాయి. చేపల వేటపై ఆధారపడి 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉండగా ఈ రంగం ద్వారా దాదాపు 16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆక్వా హబ్‌ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా మరో 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా. రూ.10,640 కోట్లతో దశలవారీగా 19 బెర్తులకు విస్తరించడంతో 25 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. 3,773 ఎకరాలను సేకరించి భారీ పారిశ్రామికవాడ నెలకొల్పనున్నారు. పలు కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ► నిర్మాణంలోని ఫిషింగ్ హార్బర్లు: జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ► పనులు ప్రారంభంకానున్న హార్బర్లు: బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం ► నిర్మాణం కానున్న పోర్టులు: మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు. ► ఉన్న పోర్టులు: విశాఖపట్నం, గంగవరం, కాకినాడ (3), కృష్ణపట్నం సీమకూ సముద్ర తీరం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమకూ సముద్రతీరం దక్కింది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన జిల్లా పరిధిలోకి తీర ప్రాంతాలైన కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు, సూళ్లూరుపేట మండలాలు చేరాయి. పులికాట్ సరస్సు కూడా కలిసొచ్చింది. బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ద్వారా నిధులు అందనున్నాయి. బందరు పోర్టు బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు అవుతుంది. – వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ -
బందరు చేప భలే భలే..
సాక్షి, మచిలీపట్నం: బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతున్నారు. అలాగే దేశంలోని విశాఖ, కాకినాడ, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలకు చెందిన ఏజెంట్లు ఎగరేసుకుపోతుంటారు. రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలతో పోల్చుకుంటే మచిలీపట్నంలో కాలుష్యం చాలా తక్కువ. ఇక్కడ నుంచి గత కొన్నేళ్లుగా సముద్ర ఉత్పత్తులు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 111 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. జిల్లాలో ఏకైక ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండిలో ఏర్పాటైంది. ఈ హార్బర్‌కు యూరోపియన్ దేశాల గుర్తింపు కూడా ఉంది. వందల రకాల మచిలీలు.. మచిలీపట్నం తీరంలో ఎక్కువగా తెల్ల చందువా (సిల్వర్ అండ్ వైట్ పాంప్రెట్), నల్ల చందువా (బ్లాక్ పాంప్రెట్), కోణాం, ముక్కు కోణాం (స్వర్డ్ ఫిష్), నెమలి కోణాం (సెయిల్ ఫిష్), వంజరం (సీర్ ఫిష్), నాలుకలు (సోల్), నామాల తూర (స్కిప్ జాక్ టూనా), పసుపురెక్క తూర (ఎల్లో ఫిన్), పెద్దకన్ను తూర (బిగ్ ఐ), కానా కంతలు (మాకేరల్స్), పావడాయి (రిబ్బన్), గొరక (క్రోకర్స్), సొర చేప, కండువ, మూడు చుక్కల పీత (త్రీస్పాట్ స్విమ్మింగ్ క్రాబ్)లతోపాటు టైగర్, వైట్ నారన్, పింక్, పువాలన్ (కలందన్), కరికేడి, శంఖు, డీప్ సీ ఫ్రాన్స్, కుక్కరొయ్యలు, సారగొరక, గులిగింత, జల్లలు, కుక్కసావడాయి, మెత్తా్తళ్లు, తెంగుడు రొయ్యపొట్టు ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో ప్రధానంగా టూనా, కోణాంలతోపాటు వంజరం, చందువా, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అయితే అత్యధిక ధర తెల్ల చందువా (కిలో రూ.2 వేల వరకు), కోణం (కిలో రూ.700) పలుకుతున్నాయి. వేటకు వెళ్లిన వారు రోజూ అనేక రకాల చేపలను గిలకలదిండి హార్బర్‌కు తెస్తున్నారు. అక్కడ వ్యాపారులు వేలంపాట ద్వారా చేపలను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు నేరుగా విశాఖ, కాకినాడ, చెన్నై తీసుకెళ్లి అక్కడే విక్రయిస్తున్నారు. సీజన్‌ను బట్టి వీటికి మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మచిలీపట్నంలో చేపల చెరువుల్లో ప్రత్యేకంగా పెంచే చేపల్లో పండుగప్ప, శీలవతి, తుల్లులు, నేమ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. టూనా చేపలకు డిమాండ్ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రసాయన పరిశ్రమలు లేవు. పెద్ద ఓడల రాకపోకలూ తక్కువే. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో దొరికే వాటిలో రసాయన ధాతువులు ఎక్కువగా ఉంటున్నాయని.. మచిలీపట్నంలో నామమాత్రంగా కూడా ఉండడం లేదని యూరోప్, జపాన్ దేశస్తులు గుర్తించడం విశేషం. మచిలీపట్నం తీరంలో దొరికే టూనా చేపల కోసం జపాన్ దేశస్తుల నుంచి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) నుంచి తీసుకునే క్యాచింగ్ సర్టిఫికెట్లో మచిలీపట్నం సీకోస్ట్ అని ఉంటే చాలు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని చెబుతున్నారు. బందరు చేపల కోసం విశాఖ, కాకినాడ, చెన్నై, కోచి, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, సికింద్రాబాద్ వ్యాపారులు ఇక్కడ కొందరు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. రోజూ మత్స్యకారుల నుంచి కొనుగోలు చేసిన చేపలను ఏజెంట్లు ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
బందరు పోర్టుకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయి. నవయుగ పోర్టు లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఒప్పందం రద్దును ప్రశ్నిస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టేసింది. ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన బాధ్యతలను నిర్వర్తించడంలో నవయుగ విఫలమైందని తేల్చిచెప్పింది. ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయడం సబబేనని పేర్కొంది. మొత్తం 5,342 ఎకరాల భూమిని ఒకేసారి అప్పగిస్తేనే ప్రాజెక్టు పనులు చేపడతామని నవయుగ చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఆ కంపెనీ పెట్టిన కొత్త ఏకపక్ష నిబంధన అని ఆక్షేపించింది. ఒప్పందంలో ఎక్కడా భూమిని ఒకేసారి ప్రారంభంలోనే ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. సముద్రానికి పక్కన ఉన్న 2,601 ఎకరాల భూమిని ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను నవయుగ తిరస్కరించిందని పేర్కొంది. తమకు ఒకేసారి 5,342 ఎకరాలను ఇవ్వాలని పట్టుబట్టిందని తెలిపింది. మొత్తం 5,342 ఎకరాల భూమిని అప్పగిస్తే తప్ప, నిధుల లభ్యతను సాధించేందుకు.. పోర్టు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆ కంపెనీ చెప్పిందంది. తద్వారా పోర్టు అభివృద్ధి కోసం కుదుర్చుకున్న ఒప్పందంలోని బాధ్యతలను నిర్వర్తించడానికి నవయుగ నిరాకరించినట్లైందని స్పష్టం చేసింది. 2018 మార్చి కల్లా నిధుల లభ్యతను సాధించడంలోనూ ఆ కంపెనీ విఫలమైందని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేస్తూ జీవో 66 జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు గురువారం తీర్పు వెలువరించారు. ఇదీ నేపథ్యం.. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి పదకొండున్నరేళ్ల క్రితం నవయుగ పోర్టు లిమిటెడ్ నాటి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాథమికంగా ప్రభుత్వం 412 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ తర్వాత 2,601 ఎకరాల భూమిని అప్పగిస్తామని ప్రతిపాదించినా నవయుగ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. పోర్టు శంకుస్థాపన శిలాఫలకం తప్ప.. ఏ రకమైన పనులు చేపట్టలేదు. సవరణ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించడం తప్ప ఇన్నేళ్లలో ఆ కంపెనీ చేసిందీ ఏమీ లేదు. ప్రతి విషయంలో మినహాయింపులు కోరడం తప్ప ఏమీ చేయలేదు. ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోకపోవడం, నిర్దేశిత కాల వ్యవధిలోపు పనులు ప్రారంభించకపోవడంతో నవయుగతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2019లో జీవో 66 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నవయుగ పోర్టు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు జీవో అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. టెండర్ల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, అయితే టెండర్లను ఖరారు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
2500 ఎకరాల్లో బందరు పోర్టు
సాక్షి, మచిలీపట్నం: బందరు పోర్టు అభివృద్ధి కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉందని, పోర్టుకు అతి సమీపంలో ఉన్న 472 ఎకరాల భారత్ సాల్ట్ ల్యాండ్‌ను కూడా పోర్టు సమగ్రాభివృద్ధిలో భాగంగా సేకరించాలని నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్, సంబంధిత ఉన్నతాధికారులతో కూడిన బృందం రాష్ట్రమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)తో కలిసి పోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో పర్యటించింది. తొలుత తపసిపూడి, మంగినపూడి ప్రాంతాలతోపాటు గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పోర్టు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యపై సమీక్షించారు. ఇప్పటికే సిద్ధం చేసిన పోర్టు నిర్మాణ డిజైన్స్‌ను పరిశీలించిన మంత్రి పేర్ని నాని అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి భూమికి భూమి పద్ధతిలో ఈ సాల్ట్ ల్యాండ్స్‌ను సేకరించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దాని ద్వారా పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ కోసం ముందుకొచ్చే బ్యాంకర్లతో చర్చలు జరిపి ఆర్థిక వనరుల సేకరణపై కసరత్తు మొదలు పెట్టాలని సూచించారు. ఎంత వ్యయం అవుతుంది..ఏ ఏ ఆర్థిక సంస్థలు మేరకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొస్తున్నాయో అంచనాకు వచ్చిన తర్వాత తొలి దశ పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేయాలని నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా పోర్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన కసరత్తును పూర్తి చేయాలని మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. సమీక్షలో మారిటైం బోర్డు సీఎండీ రామకృష్ణారెడ్డి, ఏపీ అర్బన్ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సీఇఒ ప్రకా‹Ùకౌర్, ముడా వీసీ పి.విల్సన్‌బాబు, ఆర్డీఒ ఎస్ఎస్కే ఖాజావలి, మత్స్యశాఖ ఏడీ రమణబాబు తదితరులు పాల్గొన్నారు. -
బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం (బందరు) పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచింది. ఈ పోర్టు నిర్మించడానికి 2010 జూన్ 7న నవయుగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, పోర్టు నిర్మాణం దిశగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థ ఇప్పటికే మరో ఓడరేవును నిర్వహిస్తుండడంతో ఆ ప్రాజెక్టు లాభదాయకతను దృష్టిలో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే బందరు పోర్టు నిర్మాణం విషయంలో జాప్యం చేస్తోందని అధికారులు అంటున్నారు. బందరు పోర్టు నిర్మాణం పేరిట ఇప్పటికే నవయుగ సంస్థ తీసుకున్న 471.28 ఎకరాల భూమికి పైసా కూడా లీజు చెల్లించలేదు. దీంతో నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రద్దు చేయడంతో పాటు ఇప్పటికే ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన నష్ట పరిహారాన్ని మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వసూలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రగతి ప్రదాత.. సంక్షేమ విధాత
సాక్షి, మచిలీపట్నం: రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాపై మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయనతో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసి, తనదైన మార్క్ చూపిన ఘనత ఆయనకే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అప్పటికే తొమ్మిదేళ్ల బాబు పాలనతో విసిగిపోయిన జిల్లా ప్రజలు చరిత్రలో కనివిని ఎరుగని విజయాన్ని వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్ జిల్లాకు పెద్ద పీట వేశారు. కోనేరు రంగారావుకి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. విప్‌గా సామినేని ఉదయభానుకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అదే ప్రభంజనాన్ని కొనసాగిచింది. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మహానేత ఆశయాలను పునికి పుచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 16 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాల్లో విజయఢంకా మోగించి తిరుగులేని శక్తిగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. వైఎస్సార్ హయాంలోనే పట్టణాభివృద్ధి.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.వందల కోట్ల వ్యయంతో పట్టణాలను అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనింపజేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించడమే కాకుండా, పట్టణాల్లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అభివృద్ధి బాట ఇది.. – బందరు నియోజకవర్గంలో పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన బందరు పోర్టు నిర్మాణానికి నాంది పలికింది వైఎస్సారే. ఇందులో భాగంగా రూరల్ మండలంలో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. రూ.130 కోట్లతో బందరు పట్టణంలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేశారు. – ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో కృష్ణా యూనివర్సిటీని స్థాపించారు. ప్రస్తుతం అక్కడ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అంతేగాక భవన నిర్మాణానికి రూ.10 కోట్ల మేర నిధులు మంజూరు చేశారు. రోల్డ్‌గోల్డ్ పరిశ్రమకు జీవం పోసేందుకు బందరు మండలంలో పోతేపల్లిలో జ్యూవెలరీ పార్క్ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. – పెడన పట్టణంలో ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వాలన్న తలంపుతో 4 వైఎస్సార్ కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో 400 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా గూడు లేక అవస్థలు పడుతున్న పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. – కైకలూరు నియోజకవర్గంలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కైకలూరు పట్టణంలో రూ.3 కోట్లతో కలిదిండి పాలిటెక్నిక్ కళాశాల నిర్మించారు. మండవల్లి జూనియర్ కళాశాల ఏర్పాటు, కైకలూరు పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లు నిధులు కేటాయించారు. యానాదుల కాలనీలో ఇళ్లు కట్టుకునేందుకు భూమి కేటాయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పునరావాసం నిమిత్తం రూ.350 కోట్లు కేటాయించి ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కింది. రూ.12 కోట్లతో పెద్దింట్లమ్మవారధి నిర్మించారు. ప్రస్తుతం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. – నూజివీడులో రూ.600 కోట్లతో నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య చేరువయ్యేలా చేశారు. రూ.66 కోట్లతో కృష్ణా జలాల పథకం. 4 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీని చేసి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మామిడి సాగుకు పేరుగాంచిన నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం అభివృద్ధి రూ.7 కోట్లు కేటా యించారు. అంతేగాక రూ.6 కోట్లతో బాలికల రెసిడెన్షియల్ భవనం నిర్మాణానికి కృషి చేశారు. – జగ్గయ్యపేట నియోజవర్గంలో సైతం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రూ.37 కోట్లతో వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. వత్సవాయి మండలం రూ.400 కోట్లతో పోలంపల్లి డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అ పనులు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. – అవనిగడ్డ నియోజకవర్గంలో డెల్టా ఆధునికీకరణకు రూ.4,576కోట్ల ని«ధులు మంజూరు చేశారు. 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద «ఆధునికీకరణ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లాలో రూ. 2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. రూ.138 కోట్లతో జరిగిన పులిగడ్డ–విజయవాడ కరకట్ట డబుల్‌లైన్ పనులకు ఆయన నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగింది. రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం–మందపాకల పంటకాలువ పనులు చేశారు. ఆయన హయాంలో నియోజవర్గంలో రూ.590 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లాపై మమకారం.. దివంగత మహానేత వైఎస్సార్‌కు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో రాజీవ్ పల్లెబాట, జగ్గయ్యపేట పట్టణంలో రాజీవ్ నగర బాట, బైపాస్‌రోడ్డు ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో పర్యటించారు. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకైక నేతగా, నిత్యం ప్రజల సంక్షేమమం కోసం పరితపించిన నేతగా, జిల్లా ప్రజల మదిలో ఆ మహానేత ఎప్పటికీ చిరస్మరణీయుడు. -
భూ సమీకరణ కోసం ఎన్ని కుయుక్తులో.!
మచిలీపట్నం : బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం చేపట్టిన భూసమీకరణలో పాలకులు రైతులను ఏమార్చే పనిలో పడ్డారు. వ్యూహాత్మకంగా భూసమీకరణకు తెరవెనుక రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల భూసమీకరణ అంశం, పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం జరిగింది. టీడీపీ నాయకులు మచిలీపట్నం అభివృద్ధి కోసం రైతుల నుంచి భూములు సమీకరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలతో భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసే పనిని ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే భూసమీకరణకు పాలకులు తెగబడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా టీడీపీ సానుభూతిపరులతో భూసమీకరణకు భూములు ఇస్తున్నట్లు ప్రచారం చేసి అనంతరం రైతుల నుంచి భూములు గుంజుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకులు ఉన్నారు. పోర్టు నిర్మాణం జరిగే ఆరు గ్రామాలతోపాటు పారిశ్రామిక కారిడార్ కోసం భూములు సమీకరించాల్సిన మిగిలిన గ్రామాల్లోనూ అధికారులు సర్వే నిర్వహించేందుకు వెళుతున్నారు. రైతుల నుంచి ప్రతిఘటన వస్తుండడంతో వెనుదిరుగుతున్నారు. పల్లెతుమ్మలపాలెంలో ఇటీవల సర్వే నిర్వహించేందుకు ఎంఏడీఏ సిబ్బంది వెళ్లగా కరకట్ట భూమి పక్కనే ఉన్న సర్వే భూమిని సర్వే చేసుకోవాలని గ్రామస్తులు చెప్పడంతో ఆ భూముల వరకు సర్వే నిర్వహించారు. కోన–2 పరిధిలోని తుమ్మలచెరువు, చిన్నాపురం గ్రామాల పరిధిలో ఎంఏడీఏ అధికారులు సర్వేకు వెళ్లగా తుమ్మలచెరువు రైతులు సర్వే నిర్వహించవద్దని సర్వే నిర్వహిస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించి వెనక్కి పంపేశారు. లీజు ఎంత ఇస్తారు బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సాగునీరు సక్రమంగా విడుదలైతే ఏడాదికి రెండు పంటలు పండే భూములను సైతం మెట్టభూములుగా భూసమీకరణ నోటిఫికేషన్లో చూపారు. ఈ 33,177 ఎకరాలు మెట్ట భూములుగా చూపడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం మాగాణి భూములకు ఎకరానికి ఏడాదికి రూ.50వేలు, మెట్ట భూములకు రూ.30వేలు చొప్పున పదేళ్లపాటు లీజు చెల్లించాల్సి ఉంది. ఎవరైనా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, తమ భూములు మాగాణి భూములుగా పరిగణిస్తారా, లేదా అనే అంశంపై అధికారులను ప్రశ్నిస్తే ఈ అంశం మా పరిధిలో లేదని చెబుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో అసైన్డ్భూములు సాగు చేసుకునే రైతులకు ఏడాదికి రూ.20 వేలు లీజు చెల్లించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నా, మాగాణి భూములుగా పరిగణించే అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. భూమి ఇచ్చిన రైతులు రెండు పంటలకు నీటి తీరువా చెల్లించారా, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించి మెట్ట, మాగాణి భూముల్లో ఏ కేటగిరీలోకి వస్తాయో నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులను టీడీపీ నాయకులు వివరణ ఇవ్వాలని కోరారు. 1934 రెవెన్యూ రికార్డుల ప్రకారం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారని, ప్రస్తుతం వేరే రైతులు అనుభవదారులుగా ఉన్నారని వారి పేరున ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేస్తేనే రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. ఏ అంశంపైనా స్పష్టం చేయకుండా రైతుల నుంచి భూములు సమీకరించటం సాధ్యం కాదని అంటున్నారు. పాలకులు మాత్రం భూసమీకరణ చేసి తీరాల్సిందేనని రూ.100 కోట్లను భూములు ఇచ్చిన రైతులకు లీజుగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రకటనలు చేస్తూ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
అత్తవారింటి నుంచి పుట్టింటి వరకు..
-
అత్తవారింటి నుంచి పుట్టింటి వరకు..
మచిలీపట్నం: కృష్ణా జిల్లా బందరుపోర్టు బాధితులు తమ కష్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. గురువారం బందరు మండలం బుద్దాలవారి పాలెంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. మహిళలు, రైతులు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించారు. భూములు ఇచ్చేందుకు తమకు ఇష్టం లేకున్నా చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని, తమకు అండగా నిలవాలని కోరారు. వైఎస్ జగన్‌తో ఎవరు ఏం చెప్పారంటే.. కాళికారావు, బుద్దాలపాలెం రైతు మాది మూడు పంటలు పండే పొలం. వరి, శనగ, మినుము పండుతాయి. కానీ రైతులకు వరి తప్ప మరోటి వేయడం తెలియదు. భూసేకరణ నోటిఫికేషన్ తర్వాత ఏడాది గడిచింది, ఇప్పుడు భూ సమీకరణ అంటున్నారు. రైతు మెడపైన కత్తిపెట్టి, నరికేస్తా.. భూములిచ్చెయ్యమని అంటున్నారు. రెండేళ్ల నుంచి నీళ్లు వదలడం లేదు, బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం మానేశారు. భూముల రిజిస్ట్రేషన్లు ఆపేశారు. కల్యాణమ్మ, కరగ్రాహారం మా అత్తవారింటి నుంచి పుట్టింటి వరకు భూములు తీసుకుని పోర్టు కట్టేస్తున్నారు మేం సెంటు భూమి కూడా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు నాన్నగారు పసుపు కుంకుమ కింద నాకు పొలం ఇచ్చారు. అదీ కూడా పోర్టు కోసం తీసుకుంటున్నారు పోర్టు కోసం మేం భూములు ఇవ్వడం లేదని పంటలకు నీళ్లు ఇవ్వడం ఆపేశారు బ్యాంకుల దగ్గరకు వెళ్తే లోన్లు ఇవ్వడం లేదు మా అబ్బాయి కాలేజీ ఫీజు కోసం బ్యాంకుకు వెళ్తే లోన్ ఇవ్వలేదు మాకు అండగా నిలబడిన వైఎస్ఆర్ సీపీ నాయకుడు పేర్ని నానికి గాజులు వేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ నాయకులకు మహిళలంటే అంత చులకనా? గాయత్రి మా ఊరిలో 700 ఎకరాలు పోర్డుకు కోసం తీసుకుంటున్నారు ఇందులో శ్మశానం, అంగన్వాడీ కేంద్రం భవనం, చెరువులు, పంట కాల్వలు, పంట భూములు ఉన్నాయి. మే సెంటు భూమి కూడా ఇవ్వం రైతులు ఇవ్వకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు మా గ్రామాలకు రారు, ప్రజల ఇబ్బందులు తెలుసుకోరు నాగేశ్వరరావు, రైతు మావి మూడు పంటలు పండే పొలాలు. దొంగతనంగా పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది నాకు పదెకరాల పొలం ఉంది. పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉన్నారు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు మా భూములను చంద్రబాబు బలవంతంగా లాక్కోవడం ధర్మమేనా? నీళ్లు ఇవ్వకపోడంతో రెండు పంటలు పండలేదు -
మంచి ధర వస్తే.. ఎవరైనా నీలా ఏడుస్తారా?
రైతుల భూములకు నిజంగా కోటి రూపాయల ధర వస్తే సంతోషించాలి గానీ.. ఎవరైనా నీలా ఏడుస్తారా చంద్రబాబూ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బందరుపోర్టు బాధితులతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా బుద్దాలవారిపాలెం వెళ్లిన ఆయన.. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పోర్టుకు వ్యతిరేకం అని ఎవరూ చెప్పడం లేదు. 2012లో పోర్టు కోసం 5200 ఎకరాలు సేకరిస్తామని జీవో జారీచేశారు. అదే కాస్తోకూస్తో ఎక్కువ, అన్ని ఎందుకని అప్పట్లో చంద్రబాబు మాట్లాడారు రైతులు ఆ మేరకు ఇస్తామని చెబుతున్నా, ఇప్పుడు ఇదే చంద్రబాబు 30వేల ఎకరాలకు ఎగనామం పెడుతున్నారు 5200 ఎకరాలు కాస్తా 30వేల ఎకరాలు చేశారు. ఇప్పుడు అదికూడా తీసేసి 1.05 లక్షల ఎకరాలు కావాలట, దాన్ని ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటారట రైతులంటే చంద్రబాబుకు ఎంత చులకనో దీన్నిబట్టే తెలుస్తోంది. రైతుల భూములు బలవంతంగా లాక్కోవాలని, వాళ్ల కడుపుల మీద కాళ్లతో తంతున్నారు చివరకు రైతులకు పంటలు పండించుకోడానికి కాల్వ నీళ్లు కూడా రెండేళ్ల నుంచి ఇవ్వడం లేదు బ్యాంకుల నుంచి పంట రుణాలు కూడా ఇవ్వడం మానేశారు. పొరపాటున ఏదైనా అవసరం ఉండి భూములు అమ్ముకుందామనుకుంటే.. అది కూడా వీలు లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆపేశారు రైతులను ఇంత దారుణంగా ఇక్కడ వేధిస్తున్నారు 5వేల ఎకరాలతో పోవాల్సింది ఇప్పుడు ఏకంగా లక్షా ఐదువేల ఎకరాలు తీసుకుపోతున్నారు.. ఇది ధర్మమేనా? పోనీ దానికి ఏమిస్తున్నారని చూస్తే.. చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదు మన భూములు లాక్కుంటారట, అందులో మనకు పావలా భాగం ఇస్తారట భూమి మనది, ఎకరానికి వెయ్యి, 1200 గజాల స్థలం ఇస్తామని చెబుతున్నారు అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావని ప్రశ్నిస్తున్నా ఎవరైనా భూములు కొనుక్కోవాలంటే ఇంత ఇస్తాం, భూమి అమ్ముతారా అని అడుగుతారు భూములు మీకు ఇష్టం లేకపోయినా లాక్కుంటారట.. అందులోంచి వెయ్యి గజాలు భిక్ష వేసినట్లు వేస్తారట దానికోసం మీరు కేరింతలు కొట్టాలట.. రెండు పంటలు పండే వరిభూమి అయితే ఏడాదికి 30 వేల చొప్పున పదేళ్లు ఇస్తారట. అంటే మూడు లక్షలు ఇదే రకమైన మోసం రాజధానిలో చేశాడు. ఇప్పటికి రెండున్నరేళ్లయింది. అక్కడ ఒక ఇటుక కట్టలేదు ఏం చూసినా తాత్కాలికం అంటారు. చదరపు అడుగుకు 1500 రూపాయలు కడితే ఫ్లాట్ లోకి వెళ్లచ్చు అదే చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు 6000 రూపాయలు పెడుతూ, లంచాలు తీసుకుంటున్నారు. ఒక్కటే చెబుతున్నా.. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు ఈ ప్రభుత్వానికి మూడేళ్లు అయిపోయింది, మిగిలింది రెండేళ్లే దేవుడు దయదలిస్తే వచ్చే సంవత్సరమే ఎన్నికలు రావచ్చు రాకపోయినా.. ఇక ఆయన పాలన మిగిలింది రెండేళ్లే అందరం కలిసికట్టుగా రెండేళ్లు మన భూములు కాపాడుకుందాం, తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమే 5000 ఎకరాల కన్నా ఒక్కటంటే ఒక్క ఎకరా కూడా తీసుకునే పరిస్థితి ఉండదు అంతే తీసుకున్నా.. అందులో బ్రహ్మాండమైన పోర్టు కట్టవచ్చు 240 మిలియన్ టన్నులకు పోర్టు సామర్థ్యాన్ని తీసుకెళ్లచ్చు రైతులంతా సంతోషంగా ఆ భూములు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా నిజంగా అలా ఇవ్వాలంటే.. ఎకరా 30 లక్షలో 50 లక్షలో ఇస్తే ఏం సొమ్ము పోతుంది? అలా ఇచ్చే ధైర్యం, దమ్ము ఉంటేనే పాలన సాగించాలి రైతులందరికీ ఒక్కసారి పోర్టు కట్టిన తర్వాత రైతుల దగ్గర నుంచి తీసుకోవాలంటే భూమి ఎకరా కోటి రూపాయలు చెబుతారని, అప్పుడు తీసుకోవడం సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు నిజంగా రైతుల భూములు అంత ధర పలికితే సంతోషపడాలి గానీ, నీలా ఎవరైనా ఏడుస్తారా? చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో పారేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి రైతులందరూ సంతోషంగా ఉన్నారని, భూములు ఇవ్వడానికి తన వద్దకు పరిగెడుతున్నారని ఆయన ఊదరగొడుతూ అబద్ధాలు చెబుతున్నారు ఇంతకుముందు చదువుల కోసం ఏ పేదవాడూ అప్పుల పాలు కాకూడదని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు చంద్రబాబు ఇంతకుముందు తనకు బీసీల మీద పెద్ద ప్రేమ అనేవారు, ఇస్త్రీ పెట్టెలు కొని ఇచ్చి సరిపెట్టేసేవారు పేదలు పెద్ద చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని వైఎస్ చెప్పేవారు కాలేజి యాజమాన్యాలతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు యాజమాన్యాలు ఫీజులను 70వేలు, లక్షకు పెంచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఇంతకుముందు ఇచ్చినట్లు పూర్తిగా ప్రభుత్వం ఫీజు ఇస్తే పర్వాలేదు. కానీ, చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఇచ్చేది 30వేలు మాత్రమేనట మిగిలిన మొత్తం అంతా ఆ పేదవాడు అప్పులు చేసి, ఇంట్లో భూములు అమ్ముకుని చదువుకోవాల్సి వస్తోంది చదువుల కోసం భూములు తాకట్టు పెట్టుకుందామనుకుంటే లోన్లు కూడా రాని పరిస్థితిలో ప్రభుత్వం నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వం పోవాలి.. నాన్నగారి పాలన రావాలని చెబుతున్నా ఏ పేదవాడు అప్పులపాలు కాకుండా చదువుకునే పరిస్థితి వస్తుంది రైతులందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి పేరుపేరునా ప్రతి అక్క, చెల్లెలికి, ప్రతి అవ్వ, తాతకు, ప్రతి సోదరుడు,సోదరికి పేరుపేరునా కృతజ్ఞతలు -
రైతులకు భిక్ష వేస్తారా ?
-
ప్రతిష్టాత్మకంగా పోర్టు నిర్మాణం
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం(చిలకలపూడి) : మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం ఎంఏడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల వద్దకు పూర్తి సమాచారంతో వెళ్లి వారికి అవగాహన కల్పించి ప్రాంత అభివృద్ధికి సహకరించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బందరు అభివృద్ధి అందరి బాధ్యత అని ఇందుకు సహకరిస్తే ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పోర్టు నిర్మాణం ఎంతో కీలకమన్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, సీఆర్డీఏ ల్యాండ్ ఫూలింగ్ ఎస్టేట్ డైరెక్టర్ మోహనరావు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, ఎస్పీ విజయకుమార్‌పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికిS రుణాలు ఇవ్వటం లేదు : కర్రి నాగవెంకటదుర్గాఅశ్వని, మా భూమిని భూసమీకరణలో పొందుపరచటం వలన బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వటం లేదు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. -
రైతులకు భిక్ష వేస్తారా ?
ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వడ్డే మండిపాటు భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం–2 ఇవ్వండి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూ దందా రైతుల తరుఫున పోరాటం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి మచిలీపట్నం : ‘భూసమీకరణలో రైతు నుంచి ఎకరం భూమి తీసుకుని 25 సెంట్ల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది... రైతులకు భిక్ష వేస్తారా? అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. బందరు పోర్టు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆశీర్వాద్ భవన్లో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరుతో 33,601 ఎకరాలు తీసుకునేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. నిర్మాణానికి 760 ఎకరాలు చాలని, గతంలోనే 450 ఎకరాలకు పైగా భూమిని పోర్టు నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చేసిందని, అయితే ఇంత వరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. పోర్టును ప్రైవేటు సంస్థకు కాకుండా విశాఖపట్నం పోర్టు అథారిటీకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వ భూదందాను అడ్డుకునేందుకు ప్రజలంతా అక్టోబరు 4వ తేదీలోగా ఎంఏడీఏ అధికారులకు ఫారం–2ను అందజేయాలని సూచించారు. రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా రైతులు ప్రభుత్వంపై పోరాటం చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. భూములు తీసుకునేందుకు ప్రభుత్వం కులాన్ని, మతాన్ని, పార్టీని, నాయకులను ప్రయోగిస్తుందని, అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టి మంత్రులు బతిమలాడుతారని, రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భూసమీకరణకు అభ్యంతరం తెలిపే ఫారం–2 ఇవ్వకుంటే భూసమీకరణకు అంగీకరించినట్లేనన్నారు. హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ భూములు కాపాడుకునేందుకు రైతులకు పోరాటమే శరణ్యమన్నారు. స్పష్టమైన హామీ ఇస్తేనే.. భూములు తీసుకోవాలంటే రైతులకు ఎంత మేర నష్టపరిహారం ఇస్తారు, భూములు కోల్పోయిన రైతులకు ఎక్కడ భూములు ఇస్తారు, పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ (ఎంఎల్) కార్యదర్శి మోదుమూడి రామారావు, ఏపీ రైతు కూలీ సంఘం ప్రతినిధి యద్దనపూడి సోనీ, ఉండవల్లికి చెందిన లక్ష్మీనరసమ్మ, పెనుమాకకు చెందిన రైతు సాంబయ్య, కోన గ్రామానికి చెందిన పెదబాబు ప్రసంగించారు. భూపరిరక్షణ పోరాట కమిటీ కన్వీనరు కొడాలి శర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు మారుమూడి విక్టర్‌ప్రసాద్ పాల్గొన్నారు. భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. -
'భూములిచ్చిన రైతులు బాధపడుతున్నారు'
-
'భూములిచ్చిన రైతులు బాధపడుతున్నారు'
కృష్ణా జిల్లా : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే బందరు పోర్టు పనులు ముందుకు సాగాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ...మచిలీపట్నంలో పేద రైతులు ఎక్కువ మంది ఉన్నారన్నారు. ప్రభుత్వ భూములున్నచోటే పోర్టు నిర్మించాలని చంద్రబాబు సర్కార్‌కు ఆయన సూచించారు. ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి భవిష్యత్‌లో పెద్ద కుంభకోణానికి నాంది కాబోతుందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఇప్పుడు బాధపడుతున్నారని వడ్డే చెప్పారు. -
బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత.
-
బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత
-
బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత
కృష్ణా : బందరు పోర్టు భూ సేకరణపై బాధిత గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ కరగ్రాహారం, పోతేపల్లి, బొరబోతుపాలెం గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పోర్టు నిర్మాణానికి చేపట్టిన అవగాహన సదస్సులను గ్రామస్తులు బహిష్కరించారు. భూ సేకరణ జోవోను రద్దు చేయాలంటూ అధికారులను బాధిత గ్రామాల ప్రజలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో మూడు గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. -
సంతకం పెడితే భూమి పోయినట్లే!
మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ కోసం భూసమీకరణకు రంగం సిద్ధమైంది. బందరు మండలంలో 33,601 ఎకరాల భూమిని సమీకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం డీప్‌వాటర్ పోర్ట్ మరియు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కొరకు భూసమీకరణ పధకం భాగస్వామ్య దరఖాస్తు, ప్రమాణ పత్రం ఫారం–3 ని జేసీ గంధం చంద్రుడు సోమవారం తన చాంబర్లో విడుదల చేశారు. అలాగే భూసమీకరణపై అభ్యంతరాలు, అభిప్రాయాన్ని వ్యక్తీకరించటం కోసం ఫారం–2ను విడుదల చేశారు. వీటిని డెప్యూటీ కలెక్టర్లు, వీఆర్వోలకు సోమవారం సాయంత్రానికి అందజేశారు. మంగళవారం బందరు మండంలోని 27 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామంలో డెప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్, వీఆర్వోలు అంగీకారపత్రాలు, అభ్యంతర పత్రాలు స్వీకరించనున్నారు. భూసమీకరణకు సంబంధించి అంగీకారపత్రాన్ని 16 పేజీల్లో ముద్రించగా, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఇచ్చిన దరఖాస్తును రెండు పేజీల్లో ముద్రించారు. అంగీకరపత్రానికి రశీదు, విచారణ నోటీసు అనే పేరుతో ప్రత్యేక కాలమ్‌ను ఇవ్వగా, అభ్యంతర పత్రానికి ఎలాంటి రశీదును కల్పించలేదు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. అంగీకారం పత్రం ఇచ్చిన మరుసటి రోజే భూమి స్వాధీనం బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముద్రించిన ఫారం–3లో రైతులు వివరాలు నమోదు చేసి సంతకం పెడితే మరుసటి రోజే సంబంధిత భూమిని సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఫారం–3లో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ భూసమీకరణ పధకంలో వ్యక్తి లేదా వ్యక్తుల భాగస్వామ్యం నిమిత్తం భూమిని సమీకరించిన అనంతరం అభివృద్ధి చేసి దానిలో నిష్పత్తి ప్రకారం కొంత భూమిని పరిహారం నిమిత్తం ఇవ్వటం, ఇతర రాయితీలు ఇచ్చేందుకు అభ్యర్ధన అంటూ ముద్రించారు. రైతుల పేరు, వయసు, తండ్రి పేరు, నివాసం తదితర వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. భూసమీకరణకు భూమిని ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వివరాలను ఫారం–3లో ముద్రించారు. భూమిని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నానని తన పేరున ఉన్న భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధారాలను పరిశీలన, రికార్డు కోసం విచారణ సమయంలో ఒరిజినల్ పత్రాలను చూపుతామని అంగీకరపత్రంలో పేర్కొన్నారు. మంత్రి, ఎంపీ సమాలోచనలు భూసమీకరణ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్అండ్బీ అతిథిVýృహంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. పార్టీ సమీక్షా సమావేశం పేరుతో ఆర్అండ్బీ అతిథిVýృహంలో పలు దఫాలుగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవటం, ఒకరిద్దరు టీడీపీ నాయకులను ఆర్డీవో కార్యాలయానికి పంపే ప్రక్రియ కొనసాగింది. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగానే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా, లేదా గ్రామాల్లోకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాలపై ఆరా తీస్తే పనిలో కొందరు టీడీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు. టీడీపీ నాయకులు ఎంతగా ప్రలోభపెట్టినా తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు ఖరాకండిగా చెబుతున్నారు. -
సంతకం పెడితే భూమి పోయినట్లే!
మచిలీపట్నం: బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ కోసం భూసమీకరణకు రంగం సిద్ధమైంది. బందరు మండలంలో 33,601 ఎకరాల భూమిని సమీకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం డీప్‌వాటర్ పోర్ట్ మరియు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కొరకు భూసమీకరణ పథకం భాగస్వామ్య దరఖాస్తు, ప్రమాణ పత్రం ఫారం–3 ని జేసీ గంధం చంద్రుడు సోమవారం తన చాంబర్లో విడుదల చేశారు. అలాగే భూసమీకరణపై అభ్యంతరాలు, అభిప్రాయాన్ని వ్యక్తీకరించటం కోసం ఫారం–2ను విడుదల చేశారు. వీటిని డెప్యూటీ కలెక్టర్లు, వీఆర్వోలకు సోమవారం సాయంత్రానికి అందజేశారు. మంగళవారం బందరు మండంలోని 27 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామంలో డెప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్, వీఆర్వోలు అంగీకారపత్రాలు, అభ్యంతర పత్రాలు స్వీకరించనున్నారు. భూసమీకరణకు సంబంధించి అంగీకారపత్రాన్ని 16 పేజీల్లో ముద్రించగా, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఇచ్చిన దరఖాస్తును రెండు పేజీల్లో ముద్రించారు. అంగీకరపత్రానికి రశీదు, విచారణ నోటీసు అనే పేరుతో ప్రత్యేక కాలమ్‌ను ఇవ్వగా, అభ్యంతర పత్రానికి ఎలాంటి రశీదును కల్పించలేదు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. అంగీకారం పత్రం ఇచ్చిన మరుసటి రోజే భూమి స్వాధీనం బందరు పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముద్రించిన ఫారం–3లో రైతులు వివరాలు నమోదు చేసి సంతకం పెడితే మరుసటి రోజే సంబంధిత భూమిని సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఫారం–3లో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ భూసమీకరణ పధకంలో వ్యక్తి లేదా వ్యక్తుల భాగస్వామ్యం నిమిత్తం భూమిని సమీకరించిన అనంతరం అభివృద్ధి చేసి దానిలో నిష్పత్తి ప్రకారం కొంత భూమిని పరిహారం నిమిత్తం ఇవ్వటం, ఇతర రాయితీలు ఇచ్చేందుకు అభ్యర్ధన అంటూ ముద్రించారు. రైతుల పేరు, వయసు, తండ్రి పేరు, నివాసం తదితర వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. భూసమీకరణకు భూమిని ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వివరాలను ఫారం–3లో ముద్రించారు. భూమిని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నానని తన పేరున ఉన్న భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధారాలను పరిశీలన, రికార్డు కోసం విచారణ సమయంలో ఒరిజినల్ పత్రాలను చూపుతామని అంగీకరపత్రంలో పేర్కొన్నారు. మంత్రి, ఎంపీ సమాలోచనలు భూసమీకరణ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్అండ్బీ అతిథిగృహంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. పార్టీ సమీక్షా సమావేశం పేరుతో ఆర్అండ్బీ అతిథిగృహంలో పలు దఫాలుగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవటం, ఒకరిద్దరు టీడీపీ నాయకులను ఆర్డీవో కార్యాలయానికి పంపే ప్రక్రియ కొనసాగింది. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగానే రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా, లేదా గ్రామాల్లోకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాలపై ఆరా తీస్తే పనిలో కొందరు టీడీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు. టీడీపీ నాయకులు ఎంతగా ప్రలోభపెట్టినా తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు ఖరాకండిగా చెబుతున్నారు. -
మళ్లీ రాజుకుంటున్న బందరు పోర్టు వివాదం
-
పోర్టు భూసేకరణ గడువు పెంపు
- వారం రోజుల్లో భూసమీకరణ నోటిఫికేషన్ - 20 వేల ఎకరాల భూసమీకరణకు రంగం సిద్ధం - భూసేకరణ గడువు పెంపులో ఉద్దేశమేమిటో మచిలీపట్నం(కృష్ణా జిల్లా) బందరు పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూసేకరణ నోటిఫికేషన్ గడువును 12 నెలలపాటు పెంచుతూ కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఆగస్టు 29వ తేదీన 14,427 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని గడువు ఆగస్టు 29వ తేదీతో ముగియనుండటంతో పునరుద్ధరిస్తూ మరో నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధి కోసం మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282 ఎకరాలను కేటాయించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం 12,144 ఎకరాలను భూసేకరణ నోటిఫికేషన్లో చేర్చారు. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌నే మళ్లీ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. వారం రోజుల్లో భూసమీకరణ నోటిఫికేషన్ గత ఏడాది ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయడంతో రైతులు తమ భూములను ఇచ్చేది లేదని ఆర్డీవో కార్యాలయంలో 4,800కు పైగా అభ్యంతరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్‌ను పక్కనపెట్టి భూసమీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను ఏర్పాటు చేశారు. ఎంఏడీఏ పరిపాలనా సౌలభ్యం కోసం వైస్‌చైర్మన్‌ను, 16 మంది డెప్యూటీ కలెక్టర్లను నియమించారు. వీరిలో ఏడుగురు డెప్యూటీ కలెక్టర్లు విధుల్లో చేరారు. ఎంఏడీఏ ద్వారా భూసమీకరణ చేస్తామని పాలకులు ప్రకటించారు. పుష్కరాలకు ముందే భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అవుతుందని అధికారులు చెప్పారు. వివిధ కారణాలతో భూసమీకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా జాప్యం చేశారు. సోమవారం మీకోసంలో జేసీ గంధం చంద్రుడు వారం రోజుల వ్యవధిలో భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భూసేకరణ నోటిఫికేషన్ మరో ఏడాది పాటు గడువును పెంచి భూసమీకరణ ద్వారా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం గమనార్హం. భూసమీకరణ ద్వారా ప్రైవేటు ల్యాండ్ 14వేల ఎకరాలు, అసైన్డ్భూమి 8వేల ఎకరాలు సమీకరిస్తారని విశ్వసనీయ సమాచారం. రైతులు అంగీకారపత్రం ఇవ్వకుండా సెంటుభూమి కూడా సమీకరించడానికి అవకాశం లేదని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. భూసమీకరణ ద్వారా భూమిని సేకరిస్తే ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత పోర్టు నిర్మాణం జరిగే మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282 ఎకరాలను సేకరిస్తారని గతంలో ప్రకటించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని మార్చి 22వేల ఎకరాల వరకు భూసమీకరణ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2004లోనే పోర్టు నిర్మాణానికి 6,300ల ఎకరాలకు పైగా భూమిని ఇచ్చేందుకు మేటాస్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 5,324 ఎకరాలను పోర్టు నిర్మాణం కోసం సేకరించేందుకు జీవో నెంబరు 11ను జారీ చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం భూసమీకరణకు ముందడుగు వేయటం వివాదాస్పదమవుతోంది. గత ఏడాది జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను, భూసమీకరణ అంశాన్ని ఒకేసారి తెరపైకి తేవడం రైతుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. -
ఎసరు
మచిలీపట్నం : పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో 36వేల ఎకరాలను మచిలీపట్నంలో సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూసమీకరణ కోసం నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేస్తుండడంతో ఎవరి భూములు పోతాయనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. రైతులు అంగీకరిస్తేనే భూ సమీకరణ అయినాl, భూసేకరణ అయినా ముందడుగు వేస్తుందని, రైతుల నిర్ణయంపైనే అన్నీ ఆధారపడి ఉంటాయనే వాదన వినిపిస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ... భూ సమీకరణలో తొలివిడతగా పోర్టు నిర్మాణం జరిగే చిలకలపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 4,636 ఎకరాలకు సమీకరణ నోటిఫికేషన్ జారీ చేసేందుకు మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రాత్రి వరకు కసరత్తు జరుగుతూనే ఉంది. ఎనిమిది మంది రెవెన్యూ సిబ్బంది గతంలో ఈ ఆరు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్ కోసం జారీ చేసిన భూములను భూసమీకరణలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నారు. జేసీ గంధం చంద్రుడు సోమవారమే భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పినా భూముల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాకపోవడంతో మంగళవారం నోటిఫికేషన్ జారీ అవుతుందని రెవెన్యూ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. భూసమీకరణ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మచిలీపట్నం ఆర్డీవో పి సాయిబాబు విజయవాడ తీసుకువెళ్లడంతో ఏ క్షణంలోనైనా భూసమీకరణ నోటిఫికేషన్ విడుదల అవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 9(1) ద్వారా భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తొలివిడత సమీకరించే ఆరు గ్రామాల్లో 2,282 ఎకరాల పట్టాభూమి, 413 ఎకరాల అసైన్డ్భూమి, 1941 ఎకరాల ప్రభుత్వభూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూసేకరణ గడువు ముగిసే సమయంలో : గత ఏడాది ఆగస్టు 31వ తేదీన పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో 30 వేల ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మరో నెల రోజుల వ్యవధిలో ఈ నోటిఫికేషన్ గడువు పూర్తవుతుంది. ఇంతకాలం పోర్టుకు అవసరమైన భూమిని సేకరించకుండా ప్రభుత్వం మిన్నకుండిపోయింది. భూసేకరణ నోటిఫికేషన్ గడువు ముగిసే సమయంలో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ)ను తెరపైకి తెచ్చి అభివృద్ధి పేరుతో భూసమీకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూసమీకరణ ప్రక్రియకు కనీసం ఏడాది సమయం పడుతుంది. భూసేకరణ, భూసమీకరణ చట్టాల్లోని అసలు అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా ఒకసారి భూసేకరణ, మరోసారి భూసమీకరణ అంటూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీతో రైతుల్లో అయోమయం నెలకొంది. రైతులు అంగీకార పత్రాలు ఇస్తేనే .... పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో 36 వేల ఎకరాలకు పైగా మచిలీపట్నంలో సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసినా 80 శాతం మందికి పైగా రైతులు తమ భూములను ఇస్తామని అంగీకారపత్రాలు ఇస్తేనే భూ సమీకరణకు ప్రభుత్వం ముందడుగు వేసేందుకు అవకాశం ఉంటుందని, రైతులు అంగీకరించకుంటే ఈ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులే అంటున్నారు. గతంలో మచిలీపట్నం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిన ప్రభుత్వం అనంతరం ఈ జీవోను ఉపసంహరించుకుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించారా : పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం భూములను సేకరించేందుకు గత ఏడాది భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రైతులకు పంట రుణాలు నిలిచిపోయాయి. భూమిని విక్రయించకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సాగునీరు సకాలంలో విడుదల చేయకుండా ఇబ్బందుల పాలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు రూ.15 లక్షలు, రూ. 20 లక్షలకు తమ భూములను మంత్రుల అనుచరులకు విక్రయించినట్లు అంగీకార ‡పత్రాలు రాసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం ఈ విధంగా కొన్న భూములను పోర్టు నిర్మాణానికి ఇస్తామని రైతులు ప్రకటనలు చేసే అవకాశం ఉందనే వాదన ఉంది. అయితే భూసేకరణ లేదా సమీకరణ చట్టం ప్రకారం ఈ అంగీకార పత్రాలు చెల్లవని, వాస్తవంగా సాగులో ఉన్న రైతులే తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంది. -
బందరు పోర్టు భూసమీకరణ జీవోను ఉపసంహరించుకోవాలి
బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏకపక్షంగా జారీచేసిన భూ సమీకరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. పోర్టుపేరుతో సుమారు లక్ష ఎకరాల భూమిని బలవంతంగా తీసుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను అక్కడి రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం 1800 ఎకరాల భూమి సరిపోతుందని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష ఎకరాలు తీసుకోడానికి ప్రయత్నించడం ప్రజలను మోసగించడమేనన్నారు. నిత్యం పారదర్శకత జపం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత భూమిని భూసమీకరణ ద్వారా తీసుకోనున్నదీ ఆ జీవోలో పేర్కొనలేదని, భూసమీకరణ వలన నష్టపోయే మత్స్యకారులు, ఇతర వృత్తిదారులకు ఎంత నష్టపరిహారం చెల్లించనున్నదో ఆ జీవోలో ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ పరిశ్రమ వస్తుంది, దానికి ఎంత భూమి అవసరమో ప్రకటించని ప్రభుత్వం ముందస్తుగా రైతుల నుంచి భూమిని లాక్కునే ప్రయత్నం భూమితో భూమితో వ్యాపారం చేయడానికేనని స్పష్టమవుతోందన్నారు. -
మంత్రి కొల్లును బుక్ చేసిన మంత్రి పల్లె
-
రెండువేల ఎకరాల్లోనే బందరు పోర్టు నిర్మించాలి
గతంలో ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట ప్రకారమే పోర్టు నిర్మించాలి విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకే 1.05లక్షల ఎకరాలు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి విజయవాడ (గాంధీనగర్) : ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు చెప్పిన విధంగా బందరు పోర్టును రెండు వేల ఎకరాల్లో నిర్మించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతికి అంతులేకుండా పోతోందని, అబద్ధాలతో చంద్రబాబు రోజులు గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా పోర్టు నిర్మాణానికి భూములు తీసుకోవడానికి వీల్లేదు, 2వేల నుంచి 4వేల ఎకరాలు సరిపోతుందని చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆయన నాలుక నాలుగు రకాలుగా మడత పెట్టగలడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి బందరు పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాలు పూలింగ్ విధానంలో రైతుల నుంచి లాక్కునేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. కేబినెట్లో నిర్ణయాలు ఒక రకంగా, బయటకు వచ్చి మీడియా ఎదుట మరో రకంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాజధాని పేరుతో 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కున్న చంద్రబాబు, జిల్లాల్లోని అసైన్డ్, పోరంబోకు, దేవాలయాలకు చెందిన లక్షల ఎకరాలు కైంకర్యం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. పోర్టు పేరుతో భూములు లాక్కుని సింగపూర్, జపాన్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రం ఎందుకు అడ్డుకోవడం లేదు.. చంద్రబాబు చైనా పర్యటనలో అక్కడి కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. ఇతర దేశాలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుని భారత్ భూభాగంలోని పోర్టులు, భూములు అప్పగిస్తుంటే మోదీ ప్రభుత్వం కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. ఒప్పందాలను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉందన్నారు. మంత్రులు డూడూ బసవన్నలు మంత్రులు డూడూ బసవన్నల్లా తలూపుతున్నారు. గొర్రెల్లా తల ఒంచుకుని వెళ్తున్నారు. రాష్ట్ర మంత్రులకు ఏమాత్రం విలువలేదని గౌతంరెడ్డి అన్నారు. మంత్రులతో నిమిత్తం లేకుండా చంద్రబాబే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పురాతన కోర్టులో పనిచేయడం అదృష్టం జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు మచిలీపట్నం : న్యాయవ్యవస్థలో ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో పనిచేయడం తన అదృష్టమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిచయ కార్యక్రమం మచిలీపట్నం బార్ అసోసియేషన్ హాలులో మంగళవారం జరిగింది. బార్ అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాసరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని న్యాయవాదులకు పరిచయం చేశారు. అసోసియేషన్ తరఫున జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
చంద్రబాబు సొంత పోర్టు 1900 ఎకరాలే
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదర్శమైన సింగపూర్‌లోనూ ఆయనకు 1,900 ఎకరాల్లోనే 84 బెర్తుల పోర్టు నడుస్తోందని వడ్డే శోభనాద్రీశ్వర రావు తెలిపారు. బందరు పోర్టుకు 4,800 ఎకరాల భూమి అక్కర్లేదని.. ప్రస్తుతం కేవలం 1,800 ఎకరాల్లో మాత్రమే గంగవరం పోర్టు నడుస్తోందని ఆయన అన్నారు. బందరుపోర్టు బాధితుల పక్షాన అఖిలపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూములతో వ్యాపారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబూ... రైతుల ఉసురుపోసుకోవద్దని హితవు పలికారు. అభివృద్ధి పేరుతో అరాచకాలు తగవని చెప్పారు. బందర్‌పోర్టు బాధితుల పక్షాన అన్ని పార్టీలు కలసి ఉద్యమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. అవసరానికి మించి ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణను అడ్డుకోవాలని ఆయన కోరారు. రైతులపై పోలీసులను ఉసిగొల్పుతున్న దుర్మార్గ ప్రభుత్వమని ధర్మాన మండిపడ్డారు. చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రైతులంటే పడదు..ఆయనది మాట నిలబెట్టుకునే నైజం కాదని కాంగ్రెస్ శాసనమండలి సభానేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉందంటూప్రపంచం అంతా తిరుగుతున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ఎవరి భూములను హరిస్తాడో తెలియకుండా ఉంది..ఆఖరికి శ్మశానలకుకూడా స్థలం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ కాళ్లు పట్టుకుని.. పవన్ కల్యాణ్ గడ్డం పట్టుకున్నా.. ఎన్నికల్లో బాబుకు ప్రతిపక్షం కన్నా కేవలం ఒక్కశాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని మరవొద్దని హెచ్చరించారు. -
ప్రజలను నిర్వాసితులను చేస్తే సహించం
- రైతులు, ప్రజల పొట్టగొట్టే ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమం - బందరులో జరిగే ఉద్యమాలకు అండగా ఉంటాం - పది వామపక్ష పార్టీల సమావేశ నిర్ణయం సాక్షి, విజయవాడ: బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమి సమీకరించేలా సోమవారం నోటిఫికేషన్ జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తీరప్రాంతంలోని మత్స్యకారులు, రైతులు, ప్రజల జీవనాన్ని దెబ్బతీసే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. భూమిని కాపాడుకునేందుకు బందరు ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు జరిపే ఉద్యమాలకు బాసటగా నిలవాలని నిర్ణయించారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు గుర్ర విజయ్‌కుమార్ అధ్యక్షతన పది కమ్యూనిస్టు పార్టీల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. సమావేశ నిర్ణయాలను పది వామపక్షపార్టీల నేతలు పత్రికలకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఈ నెల 17న విశాఖలో నిర్వహించనున్న జాతీయ సెమినార్‌పై ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా నిరసించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. విశాఖలో అరెస్టు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్శింగరావు, నగర కార్యదర్శి బి.గంగారావులతో పాటు 26మంది నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని, పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రచార వాహనాన్ని వెంటనే విడిచిపెట్టాలని కోరారు. సమావేశంలోపి.మధు, వై.వెంకటేశ్వర్లు(సీపీఎం), కె.రామకృష్ణ, ముప్పాళ్లనాగేశ్వరరావు, జెల్లివిల్సన్(సీపీఐ), పి.ప్రసాద్, యు.వెంకటేశ్వర్లు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), హరినాథ్, సత్యనారాయణ(సీపీఐఎంఎల్-లిబరేషన్), పి.రామారావు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), పి.సుందరామరాజు, అజీం పాషా, సుభాష్ చంద్రారెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), కిషోర్(సీపీఐఎంఎల్) హాజరయ్యారు. -
'బందరు పోర్టులో చంద్రబాబుకు పరోక్ష వాటాలు'
విజయవాడ: బందరు పోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరోక్ష వాటాలున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు. పోర్టు భూముల అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వాటాలున్నందుకే లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని ఆయన సిద్ధమవుతున్నారని విమర్శించారు. గతంలో రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు సీఎం చంద్రబాబు భూములను అప్పజెప్పారని మండిపడ్డారు. ప్రస్తుతం బందరు పోర్టుతో చైనా కంపెనీలకు భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల సీఎం తన చైనా పర్యటనలో ఆ దేశ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులకు అండగా వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత గౌతంరెడ్డి అన్నారు. మొత్తం భూమిలో 22వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతా భూమి పారిశ్రామిక కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
'చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టుకుంది'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మచిలీపట్నం పోర్టుకు 2వేల ఎకరాలు సరిపోతుందన్న ఆయన ఇప్పుడు ఏకంగా లక్ష ఎకరాలు ఏ విధంగా సేకరిస్తారని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఎక్కడ భూములు కనిపించినా సరే, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు భూ దోపిడీపై ఆదివారం 10 వామపక్ష పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. సదావర్తి సత్రం భూముల కొనుగోళ్లలో టీడీపీ పెద్దల హస్తం ఉందని అన్నారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికే పల్స్ సర్వే నిర్వహిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. మరోవైపు ఈ-పాస్‌బుక్ విధానాన్ని కూడా రామకృష్ణ తప్పుబట్టారు. కాగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 22వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతా భూమి పారిశ్రామకి కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
'టెట్రాప్యాక్ల ద్వారా మద్యం విక్రయించం'
విజయవాడ : బందరు పోర్టు నిర్మాణానికి మరో 10 రోజుల్లో భూ సమీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని మచిలీపట్నం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ బీసీ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బుధవారం విజయవాడలో కొల్లు రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పటికే మచిలీపట్నం పోర్టు అథారటీ, మున్సిపల్ పరిపాలన, న్యాయ విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకుందని ఆయన వివరించారు. పోర్టు, పరిశ్రమల నిర్మాణానికి కూడా భూమిని వేర్వేరుగా కేటాయిస్తామన్నారు. రైతులతో చర్చించి అమరావతి తరహాలోనే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. త్వరలోనే ఆధరణ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆధరణ పథకం అధ్యాయన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన విశదీకరించారు. చేతి వృత్తుల వారికి శిక్షణ ఇచ్చే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. అయితే రాష్ట్రంలో టెట్రా ప్యాక్‌ల ద్వారా మద్యాన్ని విక్రయించే ఆలోచన మాత్రం లేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. -
బడ్జెట్లో మనకు దక్కేదెంత!?
నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు గన్నవరం, బందరు పోర్టులకు నిధుల కొరత కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి పెడతారా? పర్యాటక రంగానికి సపోర్టు ఎంత.. గత బడ్జెట్లో పెట్టిన అంశాలు కార్యరూపం దాల్చని వైనం విజయవాడ: కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేడు అసెంబ్లీకి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తారనే అంశంపై జిల్లాలో వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. గత ఏడాది బడ్జెట్లో మన జిల్లాకు ఆశించినంతగా నిధులు కేటాయించలేదు. ఈసారి బడ్జెట్లోనైనా అవకాశాలు దక్కుతాయని ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజధాని ప్రాంతానికి న్యాయం జరగలేదు. రాష్ట్ర బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లోని ప్రాజెక్టులు వాటికి కావాల్సిన నిధులను పరిశీలిస్తే.. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు.. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచాలంటే 698 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. దీనిలో 438 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 180 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మిగిలిన వారు ముందుకు రాలేదు. రెండో విడత 260 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేయాలంటే సుమారు రూ.360 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు బడ్జెట్లో కేటాయించాలని కోరుతున్నారు. మచిలీపట్నం పోర్టు విస్తరణకు.. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి గాను 5,324 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించాల్సి ఉంటుంది. దీనికి గాను సుమారు రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఎప్పటికప్పుడు భూముల్ని సేకరిస్తామని హడావుడి చేయడమే తప్ప తగినంత నిధులు కేటాయించలేదు. ఆ నిధులకు కొత్త బడ్జెట్లో స్థానం దక్కుతుందేమో చూడాలి. మచిలీపట్నం పోర్టుతో పాటు క్రోకరీ, రిఫైరనరీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. వీటికి కావాల్సిన నిధులు కేటాయించాల్సి ఉంది. భవానీ ద్వీపం విస్తరణకు.. ఎన్నికలకు ముందు భవానీ ద్వీప విస్తరణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన సీఎం ఆ తరువాత మాటమార్చారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భవానీద్వీపంలో వాటర్‌గేమ్స్‌ను చాంపియన్ యాచ్ క్లబ్‌కు అప్పగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గత బడ్జెట్లోనే భవానీద్వీపాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కావాల్సిన నిధులు గత ఏడాది కాలంలో ఖర్చు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పర్యాటక రంగానికి నిధులిస్తారా.. రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారే తప్ప వాస్తవంగా నిధులు కేటాయించడం లేదు. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన దేవాలయాలను కలుపుతూ టెంపుల్ సర్కిల్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించవచ్చు. కొండపల్లి, ఉండవల్లి కొండల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. గత బడ్జెట్లో హామీలు ఇచ్చి.. గత ఏడాది మార్చి 12న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బందరులో మెరైన్ అకాడమి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. హస్తకళల అభివృద్ధి కోసం జిల్లాలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం చేశారు.విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చాలని గత బడ్జెట్లో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో విజయవాడ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసింది. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు గత బడ్జెట్లో రూ.111 కోట్లు కేటాయించినా అరకొరగానే పనులు జరిగాయి. ఆ పనుల తాలుకా బిల్లులు ఇవ్వకపోవడంలో కొత్తగా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇక పులిచింతల, పట్టిసీమ పనులు సాగుతూనే ఉన్నాయి. ఆగిరిపల్లిలో ఆయుర్వేద యూనివర్శిటీ ఏర్పాటుచేస్తామన్న ప్రతిపాదన ముందుకు సాగలేదు. కృష్ణాజిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఊసే నేతలు ఎత్తడం లేదు. -
పోర్టుజాడ.. నీలినీడ
బందరు పోర్టు నిర్మాణానికి పట్టిన గ్రహణం వీడడం లేదు. 2008లో పైలాన్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తొలుత స్థల సేకరణ, ఆ తర్వాత పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 30 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వారు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో నాగాయలంక మండలంలోని గుల్లలమోద వద్ద క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో పోర్టు నిర్మాణానికి లంగరు పడినట్లయింది. ఇది మచిలీపట్నంలో పోర్టు నిర్మించే ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో భద్రతాపరమైన ఆంక్షలు విధిస్తారేమోనన్న నీలినీడలు కమ్ముకున్నాయి. -
గన్నవరానికి చంద్ర గ్రహణం!
విజయవాడ: గన్నవరం విమానాశ్రయం విస్తరణ పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం పన్నినట్లు సమాచారం. దశల వారీగా భూమిని కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏలూరు కాల్వను జాతీయ రహదారి ఎడమవైపునకు మళ్లించడం, ఎయిర్‌పోర్టు కుడివైపున మరో రన్‌వే నిర్మించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ భావిస్తోంది. ఏలూరు కాలువ మళ్లించాక, కార్గో సర్వీసులు నడిపేందుకు ప్రస్తుతం ఉన్న రన్‌వేకు కుడివైపున రెండో రన్‌వే నిర్మించనున్నారు. రెండు రన్‌వేల మధ్య కనీసం 1700 మీటర్ల దూరం ఉండాలి. అంటే ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో ఉన్న రన్‌వేకు సుమారు 1.75 కి.మి. అంటే 25 మీటర్లకు తక్కువగా సుమారు రెండు కిలోమీటర్ల మేర కార్గో విమానాలు దిగేందుకు రెండో రన్‌వే నిర్మించాల్సి ఉంది. రెండో రన్‌వే దగ్గర్లో కార్గో పాయింట్‌ను ఎయిర్‌పోర్టు, రోడ్డు, రైల్ రవాణా, మచిలీపట్నం, పోర్టుకు అనుసంధానంగా నిర్మించనున్నారు. ఇందుకు మరో మూడు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనున్నారు. ఖాళీకానున్న గ్రామాలు ఎయిర్‌పోర్టుకు కుడి వైపున ఉన్న అజ్జంపూడి, బుద్ధవరం, బూతిమిల్లిపాడు, వెన్నూతల గ్రామాల్లో ఇళ్లు, భూమలు గల్లంతవుతాయి. రెండో రన్ వేకు దాదాపు రెండు వేల ఎకరాలు, టాక్సీవే, సెక్యూరిటీ జోన్, కార్గోపాయింట్ గోడౌన్ల నిర్మాణాలకు మరో వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏలూరు కాల్వ మళ్లించాక మూడో దశలో రెండో రన్‌వే భూమిపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. బందర్ పోర్టు వద్ద టౌన్షిప్ మాదిరిగా, ఎయిర్ పోర్టుతో గ్రామాల్లో ఇళ్లు కోల్పోయే వారికి టౌన్షిప్ అబివృద్ధి చేసి ఇచ్చేలా ప్రభుత్వం కొత్త ప్లాన్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. రెండో రన్‌వే కోసమే ఏలూరు కాల్వ మళ్లింపు మొదట ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదన రాలేదు. ముందుగా బుద్ధవరం నుంచి ఆత్కూరు వరకు కాల్వను మార్చటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. పడవలు నడవడానికి వీలుగా ఏలూరు కాల్వ వెడల్పు పెంచుతున్నామని, అందుకే కాల్వను పక్కకు మళ్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రెండో రన్‌వే ఏర్పాటు, కార్గో పాయింట్ కోసమే కాల్వను ఎడమవైపునకు మళ్లిస్తున్నారు. కాల్వ మళ్లింపు వల్ల గన్నవరం స్వరూపమే మారిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విడిపోనున్న పలు గ్రామాలు అధికారులు సర్వే చేసిన ప్రకారం ఏలూరు కాల్వ మళ్లిస్తే గన్నవరం నుంచి వెంకటనరసింహాపురం, మర్లపాలెం విడిపోతాయి. పెదఅవుటపల్లి రెండు ముక్కలవుతుంది. ప్రత్యామ్నాయంగా జక్కులనెక్కలం నుంచి సావరగూడెం వెనుక వైపు నుంచి ముస్తాబాద రైల్వే ట్రాక్ పక్కనుంచి చినఅవుటపల్లి, పెదఅవుటపల్లి మీదుగా ఏలూరు కాల్వను కలపాలని మరో డిజైన్‌ను సూచిస్తున్నారు. రైల్వే ట్రాక్ పక్కనే విలువ లేని భూములు పోతాయని, ఇళ్ల తొలగింపు అవసరం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చామని, మళ్లీ కాల్వ మళ్లించి రెండోసారి తమ భూములు లాక్కోవడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతామని కేసరపల్లి గ్రామస్తులు అంటున్నారు. ఏలూరు కాల్వ వస్తే బతుకులు తల్లకిందులు పొలం అమ్ముకుని రూ. 70లక్షలతో మంచి భవ నం కట్టుకుని, ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఏలూరు కాల్వ మళ్లిస్తే మా ఇల్లు కోల్పోతాం. ఇళ్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయం చూపకుంటే ప్రజల బతుకులు తల్లకిందులవుతాయి. - కంభంపాటి శేషగిరిరావు, మర్లపాలెం కాల్వ మళ్లింపుపై పునరాలోచన చేయండి కాల్వ మళ్లింపుతో రూ. 80లక్షల విలువ చేసే ఇల్లు ధ్వంసమవుతుంది. మాఇల్లూ వాకిలీ ఏమైపోతాయోనని ఆందోళనగా ఉంది. కోట్ల విలువైన భూములు పోతాయని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. - కొల్లి సుభాషిణి, మర్లపాలెం. -
బలవంతం చెల్లదు
-
బలవంతం చెల్లదు
రైతులకు ఇష్టం లేకుండా భూమి సేకరించే హక్కు ప్రభుత్వానికి లేదు: జగన్ సాక్షి, విజయవాడ బ్యూరో: పోర్టు పేరు చెప్పి 30 వేల ఎకరాలను బలవంతంగా రైతుల నుంచి తీసుకోవాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇష్టం లేకుండా ఒక్క ఎకరం కూడా వారి నుంచి తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. భూములు ఇవ్వనన్న వారిని పూర్తిగా వదిలేయాలని అన్నారు. ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని, మూడేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమేనని బందరు పోర్టు బాధిత భూసేకరణ రైతులకు భరోసా ఇచ్చారు. కోర్టుల్లో కేసులు వేసి భూమిని ఆపుకుంటే.. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని, అప్పుడు ఒక్క ఎకరా కూడా అన్యాయంగా పోయే పరిస్థితి ఎవరికీ రానీయకుండా అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పోర్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన బందరు మండలంలోని పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల్లో బుధవారం పర్యటించిన ఆయన రైతులు, మహిళలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తొలుత పెదకరగ్రహారంలో రైతుల గోడు విన్నారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వమే వెనక్కిపోయింది... ‘పెదకరగ్రహారం గ్రామంలో తీసుకునే భూములకు ఎంత పరిహారం ఇస్తామన్నది చెప్పలేదు. అయినా పోర్టు వస్తే ఎంతో కొంత మంచి జరుగుతుందని చెప్పి గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం అంతటితో ఆగకుండా సంవత్సరానికి రెండు, మూడు పంటలు పండే భూములు, రొయ్యల చెరువుల భూములు తదితర 30 వేల ఎకరాలను తీసుకుంటానంటోంది. ఇది నిజంగా అన్యాయం. ఇళ్లు, ఊళ్లు, భూములు, మండలం మొత్తం ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారని అక్కాచెల్లెమ్మలు వాపోతున్నారు. మా కడుపు కొడతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం భయపడొద్దు. ఎవరూ మనకిష్టం లేకుండా మన భూములు తీసుకోలేరు. ఆగస్టు 31న ఆర్టినెన్స్‌కు చివరి రోజు, దానికన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఈ భూముల మీద అధికారం మాదే అని వారనుకోవచ్చు. కానీ అది జరగదు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలు తట్టుకోలేక ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకుంది. ఆర్డినెన్సే లేనప్పుడు చంద్రబాబుకు భూములు లాక్కునే అధికారం ఎక్కడిది? ఆయన చట్టానికంటే ఎక్కువా? అని అడుగుతున్నా. పోర్టు మాత్రమే కట్టండి. పోర్టు పేరు చెప్పి మా జీవితాలతో చెలగాటాలాడొద్దంటున్నారు. పోర్టు వరకూ మూడు వేలో, నాలుగు వేల ఎకరాలో తీసుకోండి. దానికి రైతులు వేరేచోట భూములు కొనుక్కునేందుకు ఎకరానికి రూ.30 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. అసైన్డ్ భూములు, ఎంజాయ్మెంట్ భూములకూ పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. పోర్టుకు అంగీకారం తెలుపుతున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్లు తీసుకుంటామంటే ఒప్పుకోమని చెబుతున్నారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చట్టంలో మార్పులు తీసుకువస్తాం... ‘అసైన్డ్ భూములంటే వాళ్లత్తగారి సొత్తు అన్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చన్నట్లుగా తయారైంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే, ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే వచ్చి అడగాలి. పరిశ్రమ పెడతానంటున్నాడు, మీ భూములు ఇస్తారా అని అడగాలి. ఎవరైనా భూములు ఇవ్వమూ అంటే దానికి ఫుల్స్టాప్ పెట్టాలి. కానీ ముఖ్యమంత్రి కన్ను ఊరి మీద పడితే భయమేసేలా ఈ ప్రభుత్వం తయారైంది. అసైన్డ్ భూమి లాక్కోవడం చట్టం ప్రకారం హక్కు అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. ఈ చట్టంలో మార్పులు తీసుకొస్తాం. ఒకసారి వారికిచ్చిన భూములను(అసైన్డ్) మళ్లీ ఎలా తీసుకుంటారు’ అని ప్రశ్నించారు. అన్ని రకాలుగా తోడుగా ఉంటాం... పొట్లపాలెంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ‘మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటా. ఆగస్టు 31న ఆర్డినెన్స్ వీగిపోతుందని తెలిసి, చంద్రబాబు భూములు తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆర్డినెన్స్‌ను కేంద్రమే వెనక్కు తీసుకుంటే ఈ పెద్ద మనిషి లేని చట్టాన్ని చూపించి రైతులను భయపెడుతున్నాడు. భూములు లాక్కునే అధికారం ఈ పెద్ద మనిషికి ఎక్కడుంది అని అడుగుతున్నా. ‘లా’ అనేదే లేనప్పుడు దేన్ని చూపించి చంద్రబాబు భూములు లాక్కుంటాడు? ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా తోడుగా ఉంటా. కేవలం మూడేళ్లు ఆగండి.. చూస్తాచూస్తా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది. మరో మూడు సంవత్సరాలు భూములు పోకుండా ఆపుకొంటే చాలు. ఆ తర్వాత ఒక్క ఎకరా కూడా మీ నుంచి పోకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ తర్వాత చంద్రబాబు ఉండడు. మన ప్రభుత్వం వస్తుంది. ఈ మూడు సంవత్సరాలు ఒక్క ఎకరా పోకుండా అన్ని రకాలుగా మద్దతిస్తాం. అవసరమైతే ధర్నాలు, బంద్‌లు చేద్దాం. జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులంతా అండగా ఉంటారు. మీరు ఎక్కడైనా ధర్నాలు చేయండి, అవసరమైతే దానికి నేను కూడా వస్తా’ అని రైతులకు భరోసా ఇచ్చారు. గట్టిగా పోరాడతాం... ‘ఎన్నికలకు ముందు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసేస్తానన్నాడు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు పూర్తిగా తీసేస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి బాబు వస్తేనే జాబు వస్తుందని గోడలపై రాయించాడు. కానీ ఏ ఒక్కటీ చేయలేదు. అంతా మోసం. అలాగే బందరు పోర్టు భూసేకరణ కోసం అర్ధరాత్రి నోటిఫికేషన్ ఇచ్చాడు. దీనిపై గట్టిగా పోరాడదాం. మీరూ వద్దు. మీ నోటిఫికేషన్ వద్దని ఒత్తిడి తెద్దాం. నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేద్దాం’ అని జగన్ అన్నారు. జగన్‌కు తమ ఆవేదన చెప్పుకొనేందుకు ఈ మూడు గ్రామాలప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని భూసేకరణ వల్ల ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని వివరించారు. వైఎస్ జగన్ వెంట ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, నాయకులు కేపీ సారథి, జోగి రమేష్, ఉప్పాల రాము, వేదవ్యాస్, తలశిల రఘురాం, మోపిదేవి వెంకటరమణ, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులున్నారు. ముఖ్యమంత్రి అయ్యాడు.. కరువు వచ్చింది... తుమ్మలచెరువు గ్రామంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘మన ఖర్మ ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, కృష్ణా డెల్టాకు కరువొచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యి తనతోపాటు కరువునూ తీసుకొచ్చాడు. అంతటితో సంతోషపడలేదు. చివరికి రైతుల భూములను లాక్కునేందుకు ముందడుగు వేస్తున్నాడు. ఇవన్నీ ప్రభుత్వం కోసం కాదు. ప్రైవేటు వారికి, పారిశ్రామికవేత్తలకి, సింగపూర్ వాళ్లకి ఇచ్చేందుకు లాక్కోవాలని చూస్తున్నాడు. మనకిష్టం లేకపోతే బలవంతంగా భూములు ఎవరూ లాక్కోలేరు. అన్ని విధాలుగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తాం. చంద్రబాబు భూములు బలవంతంగా తీసుకునేందుకు భయపడేలా ఒత్తిడి తీసుకొస్తాం. కోర్టులకు వెళదాం. కేసులు వేద్దాం. మన ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కరికీ ఇటువంటి పరిస్థితి రాకుండా చూస్తానని చెబుతున్నా. ప్రభుత్వం ఏరకంగా ఉండాలనేది వీళ్లకి ట్యూషన్ చెప్పాలి. ఏదైనా భూమి కావల్సివస్తే ముందు రైతులను అడగాలి. వారు ఇస్తే భూములు తీసుకోవాలి. వారు కోరిన రేటు పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పించాలి. అయినా రైతులు ఒప్పుకోకపోతే ఆ భూమిని వదిలేయాలి’ అని అన్నారు. రైతుల ఆవేదన ఇదీ.. సాక్షి, విజయవాడ బ్యూరో: ‘భూముల కోసం మా ఊళ్లలోకొస్తే ఎవరినీ తిరిగి వెళ్లనీయం. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం. ప్రాణమైనా ఇస్తాంగానీ భూమిని మాత్రం వదులుకోం. చంద్రబాబు వస్తే పోర్టు వస్తుందనుకుని ఓట్లేశాం. తీరా వచ్చాక మాకు జీవి తమే లేకుండా చేస్తున్నడు’ అని బందరు పోర్టు భూసేకరణ బాధితులు జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బందరు తీరగ్రామాల్లో ఆయన పర్యటించారు. పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల వారు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకునేందుకు తరలివచ్చారు. వారి కెంత భూ మి ఉంది? ఏ పంటలు సాగవుతాయి? ఎంత ఆదాయం వస్తుంది?.. వంటి విషయాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. ఊరునే లేకుండా చేస్తారా? పోర్టు కోసం భూములివ్వడానికి గ్రామసభ పెట్టి ఆమోదించాం. కానీ ఊరంతా ఇచ్చేయాలంటున్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి భూసేకరణ నోటిఫికేషన్ పేపర్లను ఇచ్చారు. వాటిని చూశాక చాలామంది మంచాన పడ్డారు. పోర్టుకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతో మా ఊరునే లేకుండా చేస్తారా? - కళ్యాణి, పెదకరగ్రహారం సర్పంచ్ ఎలా బతకాలి? ఎక్కడికెళ్లాలి? నాకున్న ఎకరం భూమిని ఇచ్చేయమంటున్నారు. ఇద్దరం అన్నదమ్ములం. భూమి పోతే ఇద్దరం రోడ్డున పడతాం. ఈ వయసులో మేం ఎక్కడికెళ్లాలి? ఎలా బతకాలి? ఎకరం పొలానికి 35, 40 బస్తాల ధాన్యం పండిస్తాం. అది లేకుండా చేస్తామంటున్నారు. -టి.రాముడు,పెదకరగ్రహారం రైతు ఎందుకు ఓట్లు వేశామా అనిపిస్తోంది మా భూముల్ని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లేశామా అని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాం. మీ నాయనగారు దయాబిక్ష వల్ల నా కొడుక్కి రూ.5.5 లక్షలతో ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు ఏమీ ఇవ్వకపోయినా ఉన్నది లాక్కుంటున్నారు. మీరు ముఖ్యమంత్రి ఎప్పుడవుతారని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. - సత్యసాయిబాబు, చిన్నాపురం -
అసైన్డ్ భూములంటే..అత్తగారి భూములా?
మచిలీపట్నం: ఏ ప్రభుత్వం అయినా భూములను బలవంతంగా తీసుకోవటం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇష్టం ఉంటేనే వారి వద్ద నుంచి భూములు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నం పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ బుధవారం తుమ్మలపాలెం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకుని ప్రైవేటు వాళ్లకు ఇచ్చేయడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. భూములు ఇచ్చేందుకు ప్రజలకు ఇష్టం లేకున్నా ఎందుకు బలవంతం చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముందు ప్రజల వద్దకు రావాలని, వాళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటేనే తీసుకోవాలన్నారు. అంతేకానీ బలవంతంగా లాక్కోవడం చాలా అన్యాయమన్నారు. ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండాలని...ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి అనుకునేలా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు సర్కార్‌పై గట్టిగా ఒత్తిడి తెస్తామని, అసైన్డ్ భూములంటే అత్తగారి భూములనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చట్టాలను మార్చుతామని ఆయన తెలిపారు. భూములు ఇచ్చేస్తే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కునే హక్కు ఎవరిచ్చారన్నారు. పరిశ్రమల పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని ఆయన అన్నారు. ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయిన తర్వాత కృష్ణా డెల్టాకు కూడా కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు. రైతుల ఆవేదన.. రెండు పంటలు పండే భూములు వదులుకోం పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చేది లేదు భూములు లాక్కుపోతే మాకు దిక్కేంటి? బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నాం అనుబంధ పరిశ్రమల పేరుతో భూముల పంపకం బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు -
ప్రాణాలైనా అర్పిస్తాం..భూములు వదులుకోం..
-
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
విజయవాడ: మచిలీపట్నం పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా బందరులో భూసేకరణ బాధిత రైతులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ముందుగా ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం మండలంలోని కరగ్రహారానికి చేరుకుంటారు. ఫరీద్‌బాబా దర్గా సెంటర్ వద్ద రైతులతో, గ్రామస్తులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అక్కడి నుంచి తుమ్మలచెరువు చేరుకొని వినాయకుడి గుడి సెంటర్లో రైతులతో భేటీ అవుతారు. అనంతరం పొట్లపాలెం చేరుకొని పంచాయతీ కార్యాలయం సెంటర్లో రైతులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తిరుగు పయనమై గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదుకు వెళతారు. -
రైతులతో చెలగాటమొద్దు
మచిలీపట్నం టౌన్ : బందరు పోర్టు దాని అనుబంధ పరిశ్రమల పేరుతో రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. భూములు కోల్పోయే రైతులతో స్థానిక పరాసుపేటలోని సువర్ణ కల్యాణ మండపంలో ఆదివారం సమావేశం జరిగింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి ఆదికిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు మూడు సార్లు మంత్రివర్గ సమావేశంలో బందరు పోర్టు నిర్మాణాన్ని 5,300 ఎకరాల్లో చేపట్టేందుకు నిర్ణయిస్తే దీన్ని వ్యతిరేకించి వెయ్యి ఎకరాలు చాలని అప్పట్లో అసెంబ్లీలో డిమాండ్ చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రికాగానే 33 వేల ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా రైతుల భూములను తీసుకునేందుకు రాత్రికిరాత్రే రూ.9 కోట్లు ఖర్చు చేసి జారీ చేసిన నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం రెండుమూడు పంటలు పండే సాగు భూముల్లో ఒక్క ఎకరం కూడా తీసుకునే అవకాశం లేదని స్పష్టంచేశారు. భూ సేకరణ ప్రాంతంలోని 100 మంది రైతుల్లో 80 మంది అంగీకారం తెలపాల్సి ఉందని పేర్కొన్నారు. సామాజిక తనిఖీ, గ్రామ సభలను నిర్వహించి ప్రజలు అంగీకరిస్తేనే భూమి సేకరించాలని, మార్కెట్ రేటుకు నాలుగు రెట్ల మొత్తాన్ని బాధిత రైతులకు చెల్లించాలని చట్టంలో ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలోని ఎకరం మార్కెట్ ధర రూ.30 లక్షలని, 33 వేల ఎకరాలకు ప్రభుత్వం దాదాపు రూ.4 లక్షల కోట్లు చెల్లించాలని, అంత సీను ప్రభుత్వానికి ఉందా అని రైతులను అడిగారు. దీనికి రైతులు లేదు.. లేదు.. అంటూ బదులిచ్చారు. భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీ, మంత్రులు ల్యాండ్ పూలింగ్ చేస్తామంటూ గ్రామాలు తిరగడం వారి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. పిచ్చొడి చేతిలో రాయి ఎలాగో టీడీపీ చేతికి అధికారం ఇస్తే అలాగే ఉందని ఎద్దేవాచేశారు. కోన గ్రామంలో వెళ్లిన సందర్భంలో అక్కడి రైతులు పార్టీలకు అతీతంగా భూములు తీసుకోవద్దని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. శనివారం రాత్రి ఇదే గ్రామానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావును గ్రామస్తులను ఊరి పొలిమెర వరకు తరిమితరిమి కొట్టారని, దీన్ని జీర్ణించుకోలేకే తాము ఆ గ్రామం వెళ్లిన సందర్భంగా వారు యువకులను తమ పైకి రెచ్చిగొట్టి ఇసుక వేసేలా చేశారని పేర్కొన్నారు. టీడీపీకి తమను ఎదుర్కొనే శక్తి ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన ఏ గ్రామానికైనా వచ్చి చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ కోన గ్రామంలో టీడీపీకి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులపై ఇసుక వేసిన ఘటనను ఖండిం చారు. పోర్టును 5,300 ఎకరాల్లోనే నిర్మించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, డీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాసకుమార్, ఎస్.వి.రాజు, మత్తి వెంకటేశ్వరరావు, బుల్లెట్ ధర్మారావు, గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పలు గ్రామాల రైతులు తమ ఆవేదనను రఘువీరాకు వివరించారు. -
పోర్టు భూసేకరణం
మచిలీపట్నం : రాజధాని అమరావతి పేరుతో రైతుల నుంచి 29 వేల ఎకరాలను స్వాధీనంచేసుకున్న ప్రభుత్వం, బందరు పోర్టు పేరుతో మరో 30 వేల ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. మూడు రోజుల క్రితం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరుల సమావేశంలో 30 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించారు. శని వారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మచిలీపట్నం మం డలంతో పాటు పెడన మండలంలో రెండు గ్రామాల్లో భూముల వివరాలను రెవెన్యూ అధికారులు కంప్యూటరీకరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టం ఈ నెల 31వ తేదీతో ముగినుంది. ఈ నేపథ్యంలో తొలి విడత 18 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం హడావుడిగా నోటిఫికేషన్‌ను జారీ చేయనుందని తెలుస్తోంది. 30 వేల ఎకరాలు అవసరమా! బందరు పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఫిబ్రవరిలో ప్రభుత్వానికి కలెక్టర్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు. 524 ఎకరాలు పోర్టు భూములు ఉండగా మిగిలిన 4,800 ఎకరాలు ప్రైవేటు, ప్రభుత్వ భూమిని సేకరించాలని అధికారులు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా పక్కనపెట్టారు. భూసేకరణ చట్టం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండటంతో తమ పంథాను మార్చుకున్న పాలకులు ఏకంగా 30వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించి రెవెన్యూ అధికారులను పరుగులు పెట్టించడం వెనుక ఏదో మతలబు ఉందనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. 19 గ్రామాల్లో... బందరు మండలంలోని పల్లెతుమ్మలపాలెం, రుద్రవరం, గుండుపాలెం, బందరువెస్ట్, పోలాటితిప్ప, గోకవరం, మంగినపూడి, తపసిపూడి, కొత్తపూడి, పొట్లపాలెం, పోతేపల్లి, కరగ్రహారం, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, చిలకలపూడి, గోపువానిపాలెం, కోన, పెడన మండలంలో కాకర్లమూడి, నందమూరులో 30 వేల ఎకరాల సేకర ణకు రెవెన్యూ అధికారులు రికార్డులు రూపొంది చేస్తున్నారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, ఆర్ఐలు, వీఆర్వోలను ఆర్డీవో కార్యాలయానికి రప్పించి ఆయా గ్రామాల్లో భూముల సర్వే నంబర్లు, అనుభవదారులు వివరాలు, ప్రైవేటు భూమా, ప్రభుత్వ భూమా అన్న సమచారం నమోదు చేస్తున్నారు. 24 గంటల్లో ఈ వివరాలు సేకరించి తమకు అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావటంతో రెవెన్యూ సిబ్బంది యుద్ధప్రాతి పదికన ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. తొలి విడతలో 18 వేల ఎకరాలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని బందరు ఆర్డీవో పి.సాయిబాబు ‘సాక్షి’కి తెలిపారు. మడ అడవుల్లో పరిశ్రమలా..! బందరు మండలంలో సముద్రతీరం వెంబడి వేల ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో మడ అడవులు ఉన్నాయి. ఈ అడవులను దాటి మరికొంత ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) పరిధిలో ఉంది. తుపానులు సంభవించినప్పుడు తీరప్రాంత గ్రామాలు ముంపుబారిన పడకుండా మడ అడవులు రక్షణ కవచంగా పనిచేస్తున్నాయి. సరైన రవాణా వసతిలేని, సముద్రం ఆటు, పోట్లకు గురయ్యే ఈ చిత్తడి నేలల్లో పరిశ్రమలు స్థాపించి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందువస్తారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. స్థాపించే పరిశ్రమలు ఏవి, వాటికి ఎన్ని ఎకరాలు కావాలి అన్న వివరాలు లేకుండా భూసేకరణ చేస్తామని పాలకులు ప్రకటించడం, అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ అభిప్రాయం తీసుకోరా అని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. -
మాజీ సైనికుల పోరాటం
ఇచ్చినట్లే ఇచ్చి బందరు పోర్టు పేరుతో మళ్లీ లాగేసుకోవడంపై ఆగ్రహం కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం వారంతా ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక శత్రు దేశాలపై పోరాడిన మాజీ జవాన్లు.. ఎన్నో అవాంతరాల నడుమ ప్రభుత్వం నుంచి దక్కిన ఇళ్ల స్థలాలను పోర్టు పేరుతో మళ్లీ లాగేసుకోవడంతో ఖిన్నులయ్యారు. తమ గోడు విన్నవించుకున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టారు. నాలుగురోజులుగా కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేస్తున్నా స్పందించకపోవడంపై తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. కోనేరుసెంటర్, (మచిలీపట్నం) : ఒకప్పుడు దేశ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రు దేశాలపై పోరాడిన సైనికులపై ప్రభుత్వం చులకనభావం ఏర్పడింది. ఎన్నో అవాంతరాల నడుమ ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి బందరు పోర్టు పేరుతో లాగేసుకుంది. తమకు న్యాయం చేయాలని నాలుగు రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్నా ఎవరూ స్పందించలేదు. ఇళ్ల స్థలాల నేపథ్యమిది... బందరు మండలంలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సుమారు 750 మాజీ సైనిక కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి కరగ్రహారంలో 2007లో ప్రభుత్వం 9.79 ఎకరాల భూమిలో నివేశనా స్థలాలను కేటాయించింది. ఒక్కో కుటుంబానికి మూడు సెంట్లు చొప్పున 216 కుటుంబాలకు అధికారులు స్థలాలను పంపిణీ చేశారు. ఆ స్థలం తమదంటూ అప్పట్లో పలువురు కోర్టును ఆశ్రయించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలంటూ 2013లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూములను కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. వారు మళ్లీ కలెక్టర్‌ను వేడుకున్నారు. ఆ భూములను మాజీ సైనికులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అధికారులు వారందరికీ స్థలాలు పంపిణీ చేశారు. లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు మాజీ సైనికులు తమకు కేటాయించిన స్థలాలను మెరక చేసేందుకు లక్షలు ఖర్చు పెట్టారు. పిచ్చి మొక్కలు పీకేసి చదును చేశారు. అందుకోసం ఒక్కో కుటుంబం తరఫున విరాళాలు సేకరించారు. ఈ నెల 15వ తేదీన మాజీ సైనికుల కాలనీ పేరుతో కాలనీ ప్రారంభానికి సిద్ధమయ్యారు. కథ అడ్డం తిరిగింది వారికి కేటాయించిన భూములు పోర్టు భూముల పరిధిలోకి వచ్చాయంటూ ఆ స్థలంలోని లేఅవుట్ రాళ్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాళ్లను ఎలా పీకుతారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో న్యాయం కోసం రోడ్డెక్కినా ఎవరూ స్పందించడంలేదు. మాజీ సైనికుల పోరాటానికి మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని కోనేరుసెంటర్, (మచిలీపట్నం) : మాజీ సైనికులకు అండగా ఉంటాం.. ఏ మాత్రం అధైర్యపడొద్దు అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలు చేస్తున్న మాజీ సైనికులకు భరోసా ఇచ్చారు. కరగ్రహారం గ్రామంలో మాజీ సైనికులకు కేటాయించిన స్థలాలను ధ్వంసం చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని సంబంధిత స్థలాలను తమకు యథావిధిగా అందజేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న మాజీ సైనికులకు శనివారం ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల విషయంలో ప్రభుత్వ ధోరణి మారాలని హితవు పలికారు. ప్రతి విషయంలో భారత సైనికుల సాహసాలను కొనియాడే ప్రభుత్వం వారికి అన్యాయం చేయాలని చూడటం సిగ్గు చేటన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. నాలుగో రోజు దీక్షలో ఎస్. విశాల, సంతోషమ్మ, జి. మహాలక్ష్మి, వి. లక్ష్మీకాంతం, ఎం. వజ్రం, టి. లక్ష్మీకాంతమ్మ పాల్గొనగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శీలం మారుతీరావు(బాబ్జి), మేకల సుబ్బన్న, కాగిత జవహర్, అజ్గర్, గూడవల్లి నాగరాజు, నాయకులు గాజుల భగవాన్, ధనికొండ శ్రీనివాస్ మద్దతు తెలిపారు. -
పోర్టు రోడ్డు విస్తరణపై రగడ
మచిలీపట్నం : బందరు పోర్టు రోడ్డు విస్తరణ వివాదంలో పడింది. అధికారంలో లేని సమయంలో ఒక రకంగా అధికారంలోకి వచ్చాక మరో రకంగా టీడీపీ నాయకులు రోడ్డు విస్తరణ అంశంపై వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెమటోడ్చి సంపాదించిన ఆస్తులను ఉచితంగా ఎలా ఇస్తారంటూ అప్పట్లో వ్యాపారులను రెచ్చగొట్టి కోర్టుకు పంపిన టీడీపీ నాయకులు.. అధికారంలోకొచ్చాక మాట మార్చారు. ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణ 80 అడుగులకు జరుగుతుందని, ఉచితంగానే భూమిని ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి ఇటీవల జరిగిన ఫ్యాన్సీ వర్తకుల వనభోజన కార్యక్రమంలో కోరటం వ్యాపారులను కలవరపెడుతోంది. టీడీపీ నాయకుల ధోరణిపై వారు మండిపడుతున్నారు. గతంలో ఇదే వ్యవహారంలో టీడీపీ నాయకులు తెరవెనుక కథ నడిపి.. ఒకరిద్దరు వ్యాపారులను కోర్టుకు పంపారు. దీంతో కోనేరుసెంటరు నుంచి కోటవారితుళ్ల సెంటరు వరకు 350 మీటర్ల మేర పోర్టు రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. నిధులు వెనక్కి మళ్లాయి. రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన ప్రాంతంలో భూసేకరణ జరిపి ఈ నివేదికను ప్రభుత్వానికి పంపితే నిధులు విడుదల చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అడ్డుకున్నది టీడీపీ నాయకులే... 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులను కేటాయించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని ముఖ్యమంత్రి వైఎస్‌ను ఒప్పించి నిధులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. 65 అడుగుల మేర రోడ్డు విస్తరణకు వ్యాపారులను పేర్ని నాని ఒప్పించారు. కోనేరుసెంటరు సమీపంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్న ఓ టీడీపీ నాయకుడు 65 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేస్తే వ్యాపారులంతా రోడ్డున పడాల్సిందేననే కారణం చూపుతూ ఒకరిద్దరు వ్యాపారులను కోర్టుకు పంపారు. రోడ్డు విస్తరణకు భూమి ఇచ్చే సమయంలో నష్టపరిహారం ఇవ్వాలని అప్పట్లో తెరవెనుక కథ నడిపారు. స్థలసేకరణ జరిగేనా... రోడ్డు పనులు నిలిచిపోయిన అనంతరం 2011లో మచిలీపట్నం మాస్టర్ ప్లాన్‌లో కోనేరుసెంటరు నుంచి రైల్వేస్టేషన్ వరకు 100 అడుగుల మేర రోడ్డు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ రోడ్డు విస్తరణ చేయాలంటే భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని సూచించింది. వ్యాపారులు రోడ్డు విస్తరణకు సహకరించకుండా, ఉచితంగా స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. 2011 మాస్టర్ ప్లాన్ వెలువడిన తరువాత పురపాలక సంఘం ద్వారా భవన నిర్మాణాలకు అనుమతి పొంది అనుమతులను అతిక్రమించి నిర్మాణాలను చేసిన భవనాలను ముందస్తు నోటీసు ఇచ్చి వాటిని కూల్చగలరేమోగాని, స్థలాన్ని స్వాధీనం చేసుకోవటం అసాధ్యమని రాజమండ్రికి చెందిన టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. గత ఆరునెలల వ్యవధిలో పోర్టురోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కానప్పటికీ ఇటీవల జరిగిన ఫ్యాన్సీ వర్తకుల వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య ప్రజాప్రతినిధులు నిధులు మంజూరయ్యాయని, స్థలం ఉచితంగా ఇవ్వాలని వ్యాపారులను కోరటం హాస్యాస్పదమని వారు చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పోర్టు రోడ్డులో రిజిస్ట్రార్ ఆఫీస్ మార్కెట్ విలువ గజం రూ.20 వేలు ఉండగా, ప్రస్తుత భూసేకరణ చట్టం ప్రకారం సేకరణ చేయాలంటే గజానికి నాలుగు రెట్లు మార్కెట్ విలువ కన్నా అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2008 తరువాత పది రెట్లు పెరిగిన ఆస్తిని ఉచితంగా ఇవ్వమని సలహాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే గాని భూమి ఇవ్వకూడదని అవసరమైతే కలిసికట్టుగా హైకోర్టును ఆశ్రయించాలని పోర్టురోడ్డులోని ముఖ్య ప్రజాప్రతినిధికి సన్నిహితంగా మసలుతున్న ఓ వ్యక్తి షాపులో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. గత వారం రోజులుగా పురపాలకశాఖ అధికారులు పోర్టు రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రోడ్డు 40 నుంచి 45 అడుగుల వెడల్పు ఉంది. 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేస్తే ఇరువైపులా 35 అడుగుల మేర వివిధ వ్యాపారాలు నడుస్తున్న భవనాలను కూల్చాల్సి ఉంది. ఎంత మేర భూసేకరణ చేయాలనే అంశంపై మూడు రోజుల్లో నిర్ధారణ అవుతుందని టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పి.నాగేంద్రప్రసాద్ తెలిపారు. నిధులు విడుదల కాలేదు పోర్టు రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల కాలేదని ఆర్అండ్బీ ఈఈ మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. పురపాలక సంఘం అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తే ఈ నివేదికను ఆర్అండ్బీ సీఈకి పంపుతామని ఆయన చెప్పారు. స్థలసేకరణ ప్రక్రియ పూర్తయితే నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. -
కదలిక లేని బందరు పోర్టు
మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి మూడున్నర నెలలైనా పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడున్నర నెలల సమయం గడిచింది. పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థతో ఇప్పటి వరకు ప్రభుత్వం సంప్రదింపులే జరపలేదు. పోర్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. పోర్టు నిర్మాణం కోసం 5324 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. గతంలోనే కలెక్టర్ ప్రభుత్వభూమి, అసైన్డ్, పట్టాభూమి ఎక్కడెక్కడ ఉందోనన్న వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. నివేదికలన్నీ సిద్ధంగానే ఉన్నా పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం గమనార్హం. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ సమాచార హక్కు చట్టం ద్వారా రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖను వివరాలు కోరారు. పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు ఇంకా ప్రభుత్వం చేపట్టలేదని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ అసిస్టెంట్ సెక్రటరీ సమాధానమిచ్చారు. మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ 2013 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అందజేసిన రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (ఆర్డీపీఆర్) మాస్టర్ ప్లాన్ లేఅవుట్‌ను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా, తీసుకున్న చర్యలేమిటి? ఆమోదిస్తే ఏ తేదీన ఆమోదించారన్న ప్రశ్నకు ఆర్డీపీఆర్, మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ప్రభుత్వ ఆమోదం పొందలేదని, పరిశీలనలో ఉందని సమాధానమిచ్చారు. కలెక్టర్ ఎం రఘునందన్‌రావు 2014 ఫిబ్రవరి 21వ తేదీన ప్రభుత్వానికి అందజేసిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్స్‌కు సంబంధించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిందా, లేదా ప్రభుత్వ పరిశీలనలో ఉందా, భూసేకరణకు అవసరమైన రూ. 495.07 కోట్ల నిధులను మంజూరు చేశారా లేదా అన్న ప్రశ్నకు కలెక్టర్ పంపిన నివేదికపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కాకినాడకు చెందిన పోర్ట్ డెరైక్టర్‌ను కోరిందని సమాచారమిచ్చారు. భూసేకరణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల చేయలేదని తెలిపారు. బందరు డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణం కోసం కలెక్టర్‌కు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసిందా అన్న ప్రశ్నకు బందరు పోర్టు నిర్మాణం కోసం ప్రైవేటు భూముల గుర్తింపు కోసం రెవెన్యూ అధికారులతో సంప్రదించాల్సిందిగా కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌కు సూచించామని సమాధానమిచ్చారు. పాలకుల వైఫల్యమే : బందరు పోర్టును నిర్మించాలని గతంలో ప్రస్తుత బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఉద్యమాలు చేపట్టారని, వారు అధికారంలోకి వచ్చినా పోర్టు నిర్మాణ పనుల ప్రారంభింపజేయడంలో విఫలమయ్యారని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. ఆరు నెలల్లో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, వాగ్దానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. -
బెజవాడకే జై
రాజధానితో జిల్లాకు మహర్ధశ అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం బందరు పోర్టు అభివృద్ధి పరిసరాల్లోనే సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు మెగాసిటీ ఉడా పరిధి లాజిస్టిక్ హబ్‌గా జిల్లా కూచిపూడిలో నాట్య అకాడమీ దివిసీమలో మిస్సైల్ పార్కు సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కళలకు పుట్టినిల్లుగా పేరొందిన ‘విజయవాడ’ సిగలో రాజధాని అనే మరో కలికితురాయి వచ్చి చేరడంతో ఈ ప్రాంతానికి ‘రాజ’యోగం పట్టనుంది. మేధావులు, రాజకీయ విశ్లేషకులు, వ్యాపారులు తదితర ప్రముఖులు భావించినట్లుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం శాసనసభలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని అని ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరిలను కలుపుతూ ఏర్పడిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా మహర్దశ పట్టనుంది. సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో పెద్ద మెగాసిటీ రూపుదిద్దుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే.. నగరం చుట్టుపక్కలే సెక్రటేరియట్, అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. తమ్ముళ్లు, రియల్టర్లలో ఉత్సాహం అసెంబ్లీలో విజయవాడ పరిసరాలను రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వెంటనే నగరంలో తమ్ముళ్లు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అలాగే, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘పార్టీ’లు చేసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. నగర పరిసరాల్లోనే రాజధాని ఉంటుందని చెప్పడంతో వారిలో చెప్పలేని ఆనందం కనిపించింది. ఇప్పటివరకు అమ్ముడుపోని కొన్ని ప్లాట్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనే ఆనందంలో వారున్నారు. మరోవైపు.. మధ్యతరగతి వారు, సామాన్యులు మాత్రం ఇకపై మా బతుకు భారమేనంటున్నారు. జిల్లాకు ఇచ్చిన హామీలు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా మార్చడం బందరు పోర్టును మరింత అభివృద్ధి చేసి వ్యాపారాభివృద్ధి కేంద్రంగా తయారుచేయడం, ఆక్వా కల్చర్ అభివృద్ధి, ప్రాసెసింగ్ యూనిట్, ఆయిల్ రీఫైనరీ, క్రాకర్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వీజీటీఎం ఉడా ప్రాంతాన్ని మెగా సిటీగా రూపొందించడం విజయవాడలో టెక్స్టైల్ పార్క్, టూరిజం సర్క్యూట్, భవానీ ద్వీపం అభివృద్ధి, స్మార్ట్ సిటీల ఏర్పాటు, ఆటోమొబైల్ హబ్.. ఫుడ్ పార్క్ యూనిట్, ఐటీ హబ్ ఏర్పాటు అవనిగడ్డలో మిస్సైల్ పార్క్.. జిల్లాను లాజిస్టిక్ హబ్‌గా రూపొందించడం కూచిపూడిలో కూచిపూడి అకాడమీ ఏర్పాటు ఇదిలా ఉంటే... విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారే కానీ ఖచ్చితమైన ఏరియాను ప్రకటించకపోవడంతో స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. అలాగే, సీఎం చేసిన ప్రకటనలు ఎంతవరకు, ఎప్పటిలోపు అమలవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ సకాలంలో అమలుచేస్తే మంచి అభివృద్ధిని సాధించినట్లుగా భావించవచ్చు. -
పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం
మచిలీపట్నం : జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు పోర్టులను నిర్మించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, వాటిలో బందరు పోర్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మచిలీపట్నం పోర్టు తమకు అందుబాటులో ఉందని, వెంటనే దానిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇటీవల కేంద్రంతో ముఖ్యమంత్రి మాట్లాడారన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో టైటానియం నిక్షేపాలు ఉన్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లావాసుల దాహార్తిని తీర్చేందుకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లతో విజయవాడ నుంచి కరకట్ట వెంబడి మచిలీపట్నం వరకు పైప్‌లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని, ఆ కాంట్రాక్టులను రద్దు చేసి రూ.95 కోట్ల నుంచి రూ.99 కోట్ల అంచనాలతో నూతనంగా డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వివరించారు. మచిలీపట్నంలో శ్మశానాలు, ఇతర ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అర్హులందరికీ త్వరలోనే ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలలు పంపిణీ చేస్తామని, గృహాలు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 80 రోజులు గడిచిందని, పారదర్శకమైన పాలనను అందిస్తున్నామన్నారు. విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేయటం జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేసే దిశగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీసీ సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.3వేల కోట్లు, చేనేత రుణమాఫీకి రూ.500 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ కాశీవిశ్వనాథం పాల్గొన్నారు. -
100శాతం బెజవాడే రాజధాని
మారనున్న విజయవాడ స్వరూప స్వభావాలు అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం వ్యవసాయ రంగం ద్వారా ప్రభుత్వాదాయాన్ని పెంచే మార్గాన్వేషణ పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు బందర్ పోర్టు పనులు త్వరలో ప్రారంభం ‘సాక్షి’తో ఎంపీ కేశినేని శ్రీనివాస్ సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ ఇక మహానగరం కానున్నదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) చెప్పారు. శనివారం ఆయన తన కార్యాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఎవరెన్ని చెప్పినా విజయవాడ రాజధాని కావడం ఖాయమన్నారు. అయితే.. క్యాపిటల్ కమిటీ రిపోర్టు ఇవ్వకుండా మనం మాట్లాడటం సమంజసం కాదంటూనే నగరం స్వరూప స్వభావాలే మారిపోతాయన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు. ‘దక్షిణ బైపాస్ మంజూరైందని, గుంటూరు వద్ద కాజా నుంచి మొదలై విజయవాడ తూర్పు శివార్ల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తరువాత చిన్నఅవుటుపల్లి వద్దకు 48 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్‌రోడ్డు కూడా ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేసినట్లు చెప్పారు. గొల్లపూడి వద్ద ఆరు లైన్ల బైపాస్ రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఇది బీవోటీ ద్వారా నిర్మిస్తారని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ దీని ద్వారా ఏలూరు వైపు వెళ్తుందన్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య లేనట్లేనని కేశినేని నాని చెప్పారు. దుర్గగుడి వద్ద ట్రాఫిక్ రద్దీకి మూడు ఆఫ్షన్లు కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం విషయం ప్రస్తావించగా మూడు ఆప్షన్స్ రెడీ అయినట్లు ఎంపీ చెప్పారు. భవానీపురం నుంచి కృష్ణలంక వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రోడ్డు అటు జాతీయ రహదారుల శాఖ పరిధిలోగానీ, ఇటు ఆర్ అండ్ బీ కిందగాని లేదన్నారు. నేషనల్ హైవే కిందకు ఈ రహదారి ప్రాంతాన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారికి అప్పగించిన తరువాత మాత్రమే నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలో బందరు పోర్టు పనులు బందరు పోర్టు పనులు త్వరలోనే వేగం పుంజుకుంటాయన్నారు. పోర్టుకు నిధులు లేవనే వాదనను ఆయన కొట్టిపారేశారు. బడ్జెట్లో 15 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తారని, మిగిలిన 85శాతం నిధులు డీఫాల్ట్‌లో ఉంటాయన్నారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండానే చాలా పనులు జరుగుతాయని చెప్పారు. సీఎం కూడా ఎలాగైనా పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. బీవోటీ పద్ధతిలో చేపట్టే పనులు సక్రమంగా ఉండటంలేదన్న ఆరోపణలు ఆయన దృష్టికి తీసుకురాగా జాతీయ రహదారుల్లో టోల్గేట్లు ఏర్పాటుచేయడం ద్వారా బీవోటీ పద్ధతుల్లో రహదారుల అభివృద్ధి ఎలా ఉందో చూస్తున్నారు కదా అంటూ ప్రశ్నించారు. పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏడు వందల ఎకరాలు భూసేకరణ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. స్థలం సరిపోదనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ఇక్కడ మరో రెండు వందల ఎకరాల స్థలం కూడా సేకరించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి 65శాతం మంది జనం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, ఆ రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 25శాతమేనన్నారు. వ్యవసాయ రంగం నుంచి రెవెన్యూను ఎలా రాబట్టుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందని కేశినేని అన్నారు. సర్వీస్ సెక్టార్లు పెరగాలని, పారిశ్రామిక రంగం పెరిగితేనే ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. ఇక్కడ అవకాశాలు లేకపోవడంవల్లే వృత్తి నైపుణ్యం ఉన్న వారు విదేశాలకు వెళ్తున్నారని.. సాధారణ డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు లేవన్నారు. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే దేశ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు సాగదన్నారు. -
స‘పోర్టు’ ఇచ్చేనా?
కొత్త ప్రభుత్వం, కొత్త ప్రతిపాదనలు పీపీపీ అంటూ కొత్త రాగం నవయుగ సంస్థతో ఇంతవరకు చర్చలే లేవు బడ్జెట్లో బందరు పోర్టుకు నిధులేవీ? ఆరు నెలల్లో పోర్టు పనుల హామీ నెరవేరేనా? జిల్లా వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బందరు పోర్టు వ్యవహారం మూడడుగులు ముందుకీ... ఆరడుగులు వెనక్కీ అన్న చందంగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోర్టు నిర్మాణ విషయంలో పాలకులు కొత్తరాగం ఆలపించడం షరా మామూలైందనే వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం బీవోటి పద్ధతి ప్రతిపాదిసే.. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతిని ప్రతిపాదిస్తుండడంతో పోర్టు అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని జిల్లాకు చెందిన మంత్రులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలు పూర్తికావస్తోంది. ఇంత వరకు పోర్టు పనులు ప్రారంభానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోర్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పోర్టు నిర్మిస్తామని ప్రకటించారే తప్పా ఏ మేరకు నిధులు కేటాయిస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కాగా గత ప్రభుత్వ హయాంలో బందరు పోర్టు నిర్మాణాన్ని బీవోటీ పద్ధతిలో నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. టీడీపీ ప్రభుత్వంలో పీపీపీ పద్ధతి ద్వారా పోర్టు నిర్మిస్తామని చెబుతుండటంతో... అసలు పోర్టు పనులు ప్రారంభమవుతాయా అనే అనుమానాలకు తెరలేస్తుంది. 13 సంవత్సరాలుగా బందరు పోర్టు నిర్మించాలనే ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ పోర్టు నిర్మాణం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ ఈ అంశాన్ని సాగదీస్తూ వస్తున్నారు. నవయుగ సంస్థతో చర్చలే జరపలేదు ... బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ కన్సార్టియం సంస్థకు 2010 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య అప్పగించారు. 2012 మే 2వ తేదీన పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి 5324 ఎకరాలను కేటాయిస్తూ జీవో నంబరు 11ను జారీ చేశారు. అప్పటి నుంచి భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ముందడుగు పడలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెలల వ్యవధిలో బందరుపోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదు. భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. కాగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
తక్షణ అవసరాలకు మొండిచెయ్యే
రాష్ట్ర తొలి బడ్జెట్లో తాత్కాలిక రాజధాని ఊసే లేదు గన్నవరం పోర్టు విస్తరణకు చర్యలు పీపీపీ పద్ధతిలో బందరుపోర్టు నిర్మాణం జిల్లాలో శిల్పారామం, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు సాక్షి, విజయవాడ : తాత్కాలిక రాజధాని నగరమైన విజయవాడ ప్రధానకేంద్రంగా ఉన్న జిల్లాకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. కొత్తరాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక బడ్జెట్ కావడంతో ప్రజల దృష్టంతా బడ్జెట్‌పైనే కేంద్రీకృతమయింది. తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో తక్షణ అవసరాలకుగానూ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన జిల్లా ప్రజలకు నిరాశే ఎదురయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన రూ.లక్ష కోట్ల బడ్జెట్ అనేది అంకెలకే పరిమితమై... వాస్తవ అభివృద్ధికి దూరంగా ఉందనే వాదన వినబడుతోంది. రుణమాఫీకి రూ 5వేల కోట్లే.... బడ్జెట్ కోసం అశగా ఎదరుచూసిన అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబానికి లక్షన్నర వరకు రుణమాఫీ అని ప్రకటించారు. అయితే దీనికి గానూ రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.ఐదువేల కోట్లు మాత్రమే కేటాయించడం పలు విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో మొత్తం రూ.9,137 కోట్లరైతురుణా బకాయిలు ఉన్నాయి. సుమారు 98 వేల మంది రైతులు పంటరుణాలు, బంగారు నగలపై రుణాలు తీసుకున్నారు. వీటిలో పంటరుణాలు రూ.3,088 కోట్లు కాగా, బంగారు అభరణాలపై తీసుకున్న రుణాలు రూ.3,276 కోట్లు ఉన్నాయి. ఇవికాక టర్మ్‌లోన్స్ రూ.2,773 కోట్లు ఉన్నాయి. ఇక దీంతో పాటు జిల్లాలో మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన 16 అంశాలను వివరిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు. వాటిలో తక్షణం పూర్తి చేయాల్సినవి 12 వరకు ఉన్నాయి. వీటిలో నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, అగిరిపల్లి, గన్నవరం మండలాల్లో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువు అభివృద్ధి, పెడనలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం, దుర్గగుడి వద్ద ప్లైవోవర్ నిర్మాణం ఇలా అనేక అంశాలున్నాయి. కనీసం వీటిలో కొన్నింటికి కూడ బడ్జెట్లో కేటాయింపులు జరుగలేదు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న బందరుపోర్టు నిర్మాణం, గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు మాత్రమే బడ్జెట్లో చోటు దక్కడం కొంతమేర ఊరటనిస్తోంది. స్పష్టత లేని కేటాయింపులు... రాష్ట్రంలోని ఇతర ఎయిర్‌పోర్టుతో పాటుగా గన్నవరం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. అయితే ఎయిర్‌పోర్టు విస్తరణకు రూ.100 కోట్లనిధులు 400 ఎకరాల భూమిని సేకరించాలని గత ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో మళ్లీ ప్రభుత్వం దీనిని బడ్జెట్లో చేర్చింది. అలాగే జిల్లాలో మరొక శిల్పారామం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారు, నిధుల కేటాయింపు ఎంత చేస్తారు అనేదానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇక విజయవాడ-కాకినాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. అలాగే వైజాగ్ చైన్నై మధ్య కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇది పూర్తిగా దీర్ఘకాలిక ప్రాజెక్టు. ఇక జిల్లాకు ప్రధానమైన బందరు పోర్టు నిర్మాణానికి మాత్రం బడ్జెట్లో గ్రీన్‌సిగ్నల్ లభించింది. పబ్లిక్,ప్రెవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీనిని నిర్మిస్తామని ప్రకటించారు. అయితే ఎంత భూసేకరణ చేయాలి. దీనికి అవసరమైన డీపీఆర్ తయారీకి ఎంత కేటాయిస్తారో ప్రకటించలేదు. తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడలో కనీస సౌకర్యాలు మెరుగుపర్చటానికి నిధుల కేటాయింపులే లేవు. వచ్చే నెల నాటికి గన్నవరంలో సుమారు 11 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తారు. వీరందరికీ అవసరమైన గృహ సముదాయాలు, ఇతర అంశాలకు కేటాయింపుల్లో చోటు దక్కలేదు. మొత్తంమీద బడ్జెట్ కేటాయింపులు జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పవచ్చు. కంటితుడుపు బడ్జెట్ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటితుడుపుగా ఉంది. రైతు, డ్వాక్రా రుణమాఫీకి నిధుల కేటాయింపు ఊసేలేదు. అలాగే రూ.లక్ష11వేల కోట్ల బడ్జెట్లో ఏరంగానికి కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేసినట్లు కనిపించలేదు. బాబు వస్తే జాబు దొరుకుతుందన్న నిరుద్యోగులకు ఇక కష్టాలే. ఉమ్మడి రాష్ర్టంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రూ.లక్షకోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని సంక్షేమ రంగాలకు న్యాయం చేశారు. - సామినేని ఉదయభాను, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు సమతుల్య బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. ప్రత్యేకంగా వ్యవసాయం, నీటిపారుదల, మౌలిక సదుపాయాల రంగాల్లో అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చేలా ఉంది. బందరు, భావనపాడు, కళింగపట్నం, నౌకాశ్రయాల పురోభివృద్ధికి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల సత్వర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ తెలుపుతోంది. పారిశ్రామిక పురోభివృద్ధికి కూడా తగిన ప్రణాళికలు ఉంటే బాగుండేది. - ముత్తవరపు మురళీకృష్ణ, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు విద్యారంగానికి నిధులు ఏవి? 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులు తగినంతగా లేవు. జాతీయ స్ధాయి విద్యా సంస్ధల ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంకూడా స్థలసేకరణ, సర్వేల నిమిత్తం కొంతమేర నిధులు కేటాయించాల్సింది. పాఠశాలల్లో టాయిలెట్స్, మంచినీరు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన దృష్ట్యా విద్యారంగానికి నిధుల కేటాయింపులు ఇంకా పెంచాల్సింది. - కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ -
పోర్టుకు ప్రత్యేక జీవో వేగంగా భూసేకరణ
రెండు వారాల్లో జీవో విడుదల చేస్తాం సీఎంతో పారిశ్రామికాభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్ నాలుగు లేన్లుగా 216 జాతీయ రహదారి మచిలీపట్నం : బందరు పోర్టు భూసేకరణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక జీవో జారీచేయనున్నట్లు పారిశ్రామికాభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం విజయవాడలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బందరుపోర్టు, 216 జాతీయ రహదారి నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసే అంశాలు చర్చకు వచ్చాయి. బందరు పోర్టు అభివృద్ధికి భూసేకరణ కీలకంగా మారిందని, భూసేకరణలో అనేక అడ్డంకులు ఉన్నాయని గిరిధర్ తెలిపారు. అడ్డంకులను అధిగమించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెండు వారాల వ్యవధిలో ప్రత్యేక జీవోను విడుదల చేయనున్నట్లు ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సముద్రతీరం వెంబడి రహదారుల అభివృద్ధిపై సమావేశంలో చర్చ జరిగింది. రహదారుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు మాట్లాడుతూ.. 216 జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని సీఎంకు వివరించారు. భూసేకరణ పూర్తవడానికి ఎనిమిది నెలలు పైనే.. బందరు పోర్టు భూసేకరణకు 2012 మే 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో నంబరు 11 జారీ చేశారు. 5,324 ఎకరాలను సేకరించనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 524 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించింది. మిగిలిన 4,800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాగా బందరు పోర్టు అభివృద్ధి జరగాలంటే భూసేకరణే కీలకంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మళ్లీ ప్రత్యేక జీవో జారీ చేస్తే ఎంత కాలానికి ఈ ప్రక్రియ పూర్తవుతుందనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. పాలకులు ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినా భూసేకరణకు అన్ని విభాగాలు సహకరిస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. నాలుగు లేన్లుగా 216 జాతీయ రహదారి సముద్రతీర ప్రాంతాలను కలుపుతూ కోస్తా జాతీయ రహదారిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట వరకు 216 జాతీయ రహదారి 393 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో కత్తిపూడి, కాకినాడ, యానాం, అమలాపురం, రాజోలు, నర్సాపురం, బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, చల్లపల్లి, మోపిదేవి, రేపల్లె, బాపట్ల, చీరాల, ఒంగోలు వరకు ఉన్న రహదారి తీరం వెంబడి ఉంది. గతంలోనే ఈ రహదారిని పదిమీటర్ల మేర విస్తరించి, తారురోడ్డుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల విభాగం నుంచి ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ యూనిట్ విభాగానికి రోడ్డు విస్తరణ పనులను అప్పగించింది. ఇందుకోసం మచిలీపట్నంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలో కృత్తివెన్ను మండలం పల్లెపాలెం వద్ద 171వ కిలోమీటరు వద్ద ఈ రహదారి ప్రారంభమై పులిగడ్డ వారధి 265వ కిలోమీటరు వరకు 94 కిలోమీటర్ల మేర ఉంది. అయితే ఈ రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలనే అంశంపై గతంలోనూ కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగింది. సముద్రతీరం వెంబడి 216 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జాతీయ రహదారులశాఖ అధికారులు చెబుతున్నారు. -
మాటలేనా..!
బందరు పోర్టు పనుల ఊసేది కృష్ణాయూనివర్సిటీ భవనాల నిర్మాణం జరిగేనా బందరు-బెజవాడ రోడ్డు విస్తరణకు మోక్షమెన్నడో నేడు ముఖ్యమంత్రి సమీక్ష మచిలీపట్నం/విజయవాడ సాక్షి : టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు అంగుళం కూడా ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటి వరకు భూ సేకరణపై స్పష్టత లేదు. రుణమాఫీ, రుణాల రీషెడ్యూలుపై అయోమయం నెలకొంది. సాగునీటి విడుదల జాప్యం కావడంతో ఖరీఫ్ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో రాష్ర్టంలోని 13 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో బందరుపోర్టు, విజయవాడ-పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను జాతీయ రహదారి పనులు వేగవంతం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం, బెంజ్‌సర్కిల్ నుంచి బందరు వరకు నాలుగు లైనరహదారి విస్తరణ, 400 ఎకరాల భూమిని సేకరించి గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, అధునికీకరణ, విజయవాడ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.. ఇలా అనేక కీలక ప్రాజెక్టులు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. బందరు రోడ్డు విస్తరణ ఎన్నటికో.. మచిలీపట్నం-విజయవాడ మధ్య 65 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం రూ.750 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ పనులను తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ ఎంపీ నామానాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ దక్కించుకుంది. రోడ్డు విస్తరణ కోసం 81శాతం భూసేకరణ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించేందుకు రూ.55 లక్షలతో టెండర్లు పిలిచారు. మధుకాన్ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లకపోవటంతో ఈ పనులు దాదాపు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి జరిగితే ఈ రహదారి అత్యంత రద్దీగా మారుతుంది. కృష్ణా యూనివర్సిటీకి సొంత భవనాలు నిర్మించేనా మచిలీపట్నంలో 2008, ఏప్రిల్‌లో కృష్ణా యూనివర్సిటీని ప్రారంభించారు. భవనాల నిర్మాణం కోసం రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరులో 44 ఎకరాలు, ప్రస్తుతం యూనివర్సిటీ నడుస్తున్న ఏజే కళాశాల ప్రాంగణంలో 24 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కేటాయించారు. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్‌లో 2 0గదుల్లో, మచిలీపట్నంలోని నిర్మలా కాన్వెంట్ సమీపంలో ఓ భవనంలో కొనసాగుతోంది. ల్యాబ్‌లు, హాస్టల్ గదులు, వసతి గృహాలు, గ్రంథాలయాలు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రూ.70 కోట్లతో రుద్రవరంలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు. ఆగస్టు వచ్చిన పూర్తవని ‘పులిచింతల’ కృష్ణా, గుంటూరు జిల్లాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా 2004-05లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,281 కోట్లు. 46 టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంది. పనులు పూర్తవకుండానే 2013 నవంబరులో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పనులు పూర్తికాకుండానే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టులోపు ఈ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు వద్దకు వరదనీరు చేరనుంది. వరదనీరు చేరితే ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి. డెల్టా ఆధునికీకరణ సుమారు 150 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటీష్ పాలకులు జిల్లాలోని వివిధ ప్రధాన కాలువలను తవ్వించారు. అప్పట్లో సాగులో ఉన్న భూమి ఆధారంగా కాలువల నిర్మాణం జరిగింది. ఆ కాలువల ద్వారానే నేటికీ సాగునీరు సరఫరా అవుతోంది. 2009లో ఈ కాలువలను ఆధునికీకరణకు ప్రణాళిక రూపొందించారు. కాలువలపై వంతెనలు, నూతన లాకులు మాత్రమే నిర్మించారు. మూడేళ్ల వ్యవధిలో కేవలం 20శాతం పనులు కూడా జరగలేదు. ఏటా భారీ వర్షాల కారణంగా రైతులు కోట్లాది రూపాయల పంటలను కోల్పోతున్నారు. డెల్టా ఆధునికీకరణ పూర్తయితే శివారు ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందే అవకాశం ఉంది. గత ఏడాది ఆధునికీకరణ పనులు అసలు చేయలేదు. ఈ ఏడాది చేసేందుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. కలెక్టర్ నివేదిక పరిశీలనకే పరిమితం! రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తక్షణం పూర్తి చేయాల్సిన 16 అంశాలతో జిల్లా అభివృద్ధి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నివేదిక రూపొందిం చారు. నివేదిక పంపి రెండు నెలలు గడిచినా దాని లోని అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. పలు అంశాలపై గత నెల 12న జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఎటువంటి హామీ లభించలేదు. ప్రతిపాదనలకే పరిమితం గత నెలలో జరిగిన సమీక్షలో విజయవాడలోని కాలువల ఆధునికీకరణకు తక్షణం రూ.11.6 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అధునికీకరణ పనులు మాత్రం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించినా కనీసం వాస్తవ పరిస్థితిని అధికారులు సమీక్షించలేదు. బెంజ్‌సర్కిల్ వద్ద నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం కన్సెల్టెన్సీ సంప్రదించాలని చెప్పినా ఇప్పటి వరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. బందరుపోర్టు కీలకం జిల్లా అభివృద్ధిలో బందరు పోర్టు నిర్మాణం కీలకం. పోర్టు కోసం 12 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోంది. పోర్టు పనులకు 2008, ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ పనులను పట్టించుకునే వారే కరువయ్యారు. అనంతరం 2012, మే 1న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బందరు పోర్టుకు 5,324 ఎకరాల భూసేకరణ కోసం జీవో నంబరు 11ను విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 524 ఎకరాలు మాత్రమే సేకరించింది. మిగిలిన 4,800 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు రూ.451.49 కోట్లు, 563 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.43.58 కోట్లు అవసరమని 2014, ఏప్రిల్‌లో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. రెండు నెలలు పూర్తవుతోంది. పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ కన్సార్టియం ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. భూసేకరణకు సంబంధించిన అంశంపై ఒక్క అడుగు ముందుకు వేయలేదు. పాలకులు చెప్పిన ప్రకారం మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపైనా పనులు ప్రారంభిస్తారో, లేదో, వేచి చూడాలి. ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని పరుగులు తీయిస్తా. కృష్ణా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తా. స్మార్ట్ సిటీలు ఏర్పాటుచేస్తాం. బందరుపోర్టు నిర్మిస్తాం. కోస్టల్ కారిడార్ అభివృద్ధిచేస్తాం. చెప్పనివి కూడా మరెన్నో చేస్తాం.’ - ఇవీ ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఇచ్చిన హామీలు ‘కృష్ణా జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేస్తాం. జిల్లాపై నాకో విజన్ ఉంది. దానికి అనుగుణంగా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. - ఇవీ గత నెల 12వ తేదీన విజయవాడలో సీఎం హోదాలో చంద్రబాబు చెప్పిన మాటలు. -
పోర్టుకు భూసేకరణే కీలకం
524 ఎకరాలు మాత్రమే సేకరణ ఇంకాసేకరించాల్సిన భూమి 4,800 ఎకరాలు ప్రాంతాల వారీగా భూమి ధర నిర్ణయమే అడ్డంకి మచిలీపట్నం : జిల్లా ప్రజల చిరకాల కోరిక బందరుపోర్టు అభివృద్ధికి భూసేకరణే కీలకంగా మారింది. 11 సంవత్సరాలుగా బందరు పోర్టు నిర్మించాలని ఉద్యమం జరుగుతోంది. ప్రజల కాంక్ష గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23వ తేదీన పోర్టు పనులకు శంఖుస్థాపన చేశారు. 2009లో ఎన్నికలు రావడం, అనంతరం వైఎస్ మరణం తదితర ఆటంకాల నేపథ్యంలో పోర్టు పనులు అటకెక్కాయి. రాష్ట్ర విభజన అనంతరం పోర్టు అభివృద్ధి అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో బందరు పోర్టు అభివృద్ధి చేస్తామని ప్రస్తావించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ సమావేశాల్లోనూ బందరుపోర్టును అభివృద్ధి చేయాలని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బందరు పోర్టు పనులు ప్రారంభం కావడానికి కొంత మార్గం సుగమం అయ్యింది. అయితే వచ్చిన చిక్కంతా భూసేకరణే. పోర్టు అభివృద్ధికి 2012 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జారీ చేసిన జీవో నంబరు 11 ప్రకారం 5,282 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 524 ఎకరాలు పోర్టుకు సంబంధించిన భూమి ఉంది. ఈ భూమి ఇప్పటికే సేకరించారు. మిగిలిన 4,758 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూమి ధరలో వ్యత్యాసం బందరు పోర్టు మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, చిలకలపూడి పంచాయతీల పరిధిలో ఏర్పాటు కానుంది. ఈ గ్రామాల పరిధిలోనే ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూమిని సేకరించాల్సి ఉంది. అయితే ఒక్కొక్క గ్రామంలో ఎకరానికి ఇచ్చే నష్టపరిహారాన్ని ఎక్కువ, తక్కువలుగా నిర్ణయించడటంతో రైతులు భూమిని ఇచ్చేందుకు అంగీకరిస్తారా, లేదా అన్న అంశం చర్చనీయాంశమైంది. పక్క పక్కనే ఉన్న గ్రామాల పరిధిలోని భూములకు చెల్లించే నష్టపరిహారం విలువలో భారీ వ్యత్యాసం ఉండటంతో రైతులు ఎంత వరకు భూమిని వదులుకుంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, పోర్టు నిర్మిస్తారనే ప్రచారం జరగడంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. మంగినపూడి, గోపువానిపాలెం, తపసిపూడి గ్రామాల్లో మంగినపూడిబీచ్ రోడ్డు వెంబడి ఎకరం రూ. 50 లక్షల మార్కెట్ ధర పలుకుతోంది. రోడ్డుకు దూరంగా భూములు ఉంటే రూ. 25 నుంచి రూ. 30 లక్షలు ధర ఉంది. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమైతే ఈ ధర మరింత పెరుగుతుందనే కారణంతో రైతులు భూములను విక్రయించడం లేదు. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు ఉండటంతో రెవెన్యూ అధికారులు మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, చిలకలపూడి తదితర ప్రాంతాల్లోని కొన్ని సర్వే నంబర్లలోని భూములు రిజిస్ట్రేషన్ కాకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మార్కెట్ ధరకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి భారీ వ్యత్యాసం ఉండటంతో భూసేకరణ తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పోర్టు నిర్మాణాన్ని కోన, పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప వైపు మార్చే యోచన చేస్తున్నారనే ప్రచారం విసృ్తతంగా జరుగుతోంది. ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపు 17వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో ఏడు వేల ఎకరాలను భారత్‌సాల్ట్ కంపెనీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. మిగిలిన 10వేల ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని పోర్టుకు కేటాయిస్తే త్వరితగతిన భూసేకరణ జరగడంతో పాటు రైతుల నుంచి అభ్యంతరాలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. -
రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్..
సాక్షి, విజయవాడ : ఇకపై విజయవాడలోనే ఎక్కువ రోజులుంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం గురునానక్‌నగర్‌లోని ఎన్ఏసీ కల్యాణమండపంలో జరిగిన టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు నెలాఖరుకు కొత్త రాజధాని ప్రకటిస్తారని చెప్పారు. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారుచేస్తామని తెలిపారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని, ఎక్కడికక్కడ నిధులు ఎలా తెచ్చుకోవాలి.. ఆదాయం ఎలా పెంచుకోవాలి.. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలుచేయాలి వంటి అంశాలకు అక్కడే ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించి.. నాయకులు, కార్యకర్తల పని తీరుపై మూడు నెలలకొకసారి నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. అందరి జాతకాలు తీస్తానని, వాటి ఆధారంగానే కష్టపడి పనిచేసే వారికి ప్రమోషన్లు ఇస్తానని పేర్కొన్నారు. ‘ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవని పడుకుంటే కుదరదు.. ఇప్పటివరకు నేను పరిగెత్తాను.. ఇకముందు మిమ్మల్ని పరిగెత్తించి నేను కూర్చుంటాను..’ అంటూ కార్యకర్తలను హెచ్చరించారు. బందరు పోర్టు అభివృద్ధి చేస్తాం.. వెస్ట్కోస్టులో గుజారాత్‌కు మాత్రమే తీరప్రాంతం ఉందని, అక్కడ పోర్టులు అభివృద్ధి చేశారని, ఈస్ట్కోస్టులో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే తీరప్రాంతం ఉందని, ఇక్కడ మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. కేంద్రం సహాయంతో ఆయిల్ రిఫైనరీ, ఆక్వా యూనిట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణాజిల్లాను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారుస్తామని చెప్పారు. కోస్తా కారిడార్‌ను అభివృద్ధి చేసి స్పీడ్ ట్రైన్లు, బులెట్ రైళ్లు రప్పిస్తామన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉండడం విచారకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్.. రాష్ట్ర విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయని, డబ్బులు లేవని చంద్రబాబు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల్ని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై తాను విడుదల చే.సే శ్వేతపత్రాలను చూసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలను తాను ఎప్పుడూ విస్మరించనని, అధికారుల కంటే ముందు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని తొలుత ఈ సమావేశం నిర్వహించానని తెలిపారు. కార్యకర్తల కోసం రూ.20 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, దాన్ని మరింత పెంచుతామని చెప్పారు. సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా, మంత్రి కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, వల్లభనేని వంశీమోహన్, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. -
‘త్రిశంకు’లో బందరు పోర్టు
ఆరు నెలల్లో నిర్మిస్తామంటూ టీడీపీ నేతల హామీ భూసేకరణకే ఎనిమిది నెలల సమయం మరో నాలుగు శాఖల అనుమతులు రావాలి ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లని కాంట్రాక్టు కంపెనీ మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రం కలిసి ఉన్న సమయంలో బందరు పోర్టు అభివృద్ధి అంశాన్ని పాలకులు పక్కనపెట్టేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23వ తేదీన బందరు పోర్టు పనులకు శంఖుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణంతో బందరు పోర్టును పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆరు నెలల్లో పోర్టు పనులను ప్రారంభిస్తామని చెబుతున్నారని,అయితే పోర్టు పనులు ప్రారంభించాలంటే అనేక ఆటంకాలున్నాయని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ చెబుతున్నారు. మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ నవయుగ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య 2010 జూన్ 7వ తేదీన ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఒప్పందం కుదిరిన 12 నెలల్లోగా నిర్మాణ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లాల్సి ఉందని అన్నారు. రూ. 1590 కోట్లతో బందరు పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉందని, పోర్టు అభివృద్ధిపై ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థకు ఒప్పందం కుదిరి నాలుగేళ్లు గడచినా ఇంత వరకు ఆ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్‌కు వెళ్లలేదని గుర్తుచేశారు. పోర్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం పర్యావరణ అనుమతిచ్చిందన్నారు. పోర్టుకు డీజిల్ స్టోరేజీ నిమిత్తం చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ శాఖ, అగ్నిమాపకశాఖ, విమానయానశాఖ, అటవీశాఖ, వన్యమృగసంరక్షణశాఖ అనుమతులు ఇవ్వాలని తెలిపారు. దీంతో పాటు పోర్టు నిర్మాణ సంస్థ రూపొందించిన రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (ఆర్డీపీఆర్) మాస్టర్ ప్లాన్ ప్రకారం 4,800 ఎకరాలను నిర్మాణసంస్థకు అప్పగించాల్సి ఉంద ని తెలిపారు. ఇప్పటివరకు కేవలం 412 ఎకరాలను మాత్రమే సేకరించించారని చెప్పారు. పోర్టుకు కేటాయించాల్సిన భూమి సంస్థకు అప్పగించలేదని, ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. ఇదిలాఉండగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ, నష్టపరిహారం చెల్లింపులు, రైతుల అభిప్రాయ సేకరణ తదితర అంశాలన్నీ పూర్తికావాలంటే అన్నిశాఖలు సమష్టిగా పనిచేస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2008లో పోర్టు పనుల శంఖుస్థాపన జరిగిన అనంతరం భూసేకరణకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. పోర్టు నిర్మాణానికి భూసేకరణే కీలక అంశంగా మారింది. ప్రభుత్వం భూసేకరణ చేసి నిర్మాణ సంస్థకు అప్పగిస్తే ఆ భూమిని చూపి ఆ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి అనివార్యంగా మారింది. పాలకులు, అధికారులు పోర్టు అభివృద్ధి కోసం సత్వర నిర్ణయాలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
పోర్టు కల నెరవేరేనా?
నీళ్లొదిలిన కిరణ్ సర్కారు పట్టించుకోని ప్రజాప్రతినిధులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల మచిలీపట్నంలో నిర్మితం కావాల్సిన పోర్టుపనులు ఎక్కడ వేసినగొంగలి అక్కడే అన్న చందంగా మారాయని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అధికారపక్ష నాయకులు పోర్టు అంశంపై ముఖ్యమంత్రిని ఒప్పించలేకపోవడంతోనే ఈ దుస్థితి పట్టిందని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందని జిల్లాలో బందరు పోర్టు నిర్మాణంతో పలు పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉందని, అయినా ఈ విషయాన్ని ఐదేళ్లుగా మన జిల్లాకు చెందిన పాలకులు పట్టించుకోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 11 సంవత్సరాలుగా ఉద్యమాలు... బందరు పోర్టు నిర్మాణం చేయాలని 2003 నుంచి ఉద్యమాలు ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పోర్టుకు అనుబంధంగా 27 రకాల పరిశ్రమలు జిల్లాలో స్థాపించేందుకు అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. జీవో నంబరు 11 అమలయ్యేనా... బందరు పోర్టును నిర్మించాలని 2003నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 2004లో 100 రోజులపాటు రిలే దీక్షలు, 10 రోజులపాటు ఆమరణ దీక్షలు చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బందరు పోర్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2008 ఏప్రిల్ 23 వ తేదీన బందరు పోర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. 2009లో ఎన్నికల నేపథ్యంలో పోర్టు పనులకు బ్రేక్‌పడింది. 2009 సెప్టెంబరు 2వ తేదీన వైఎస్.మరణంతో పోర్టు అంశాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేటాస్ కంపెనీనుంచి నవయుగ సంస్థకు పనులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2012 మే 2వ తేదీన మచిలీపట్నంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. పోర్టుకు కావాల్సిన భూసేకరణ కోసం జీవో నంబరు 11ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్థాయిలో జీవో నంబరు 11ను జారీ చేసి 21 నెలలు గడచినా బందరు పోర్టు నిర్మాణానికి భూసేకరణ జరగనేలేదు. ఇంతవరకు పోర్టు ఫైల్ సీఎం పేషీ దాటి బయటకు రాలేదు. రాష్ట్ర విభజన అంశం వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆఖరి ప్రయత్నంగానైనా జిల్లాకు చెందిన అధికార పక్షానికి చెందిన నాయకులు బందరు పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలక్ష్యం వల్లే పోర్టు కం షిప్ యార్డు తరలిపోయిందా... రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సమయంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు కం షిప్ యార్డును నిర్మిస్తామని కేంద్రస్థాయి నేతలు ప్రకటించారు. దీనికి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. దీంతో దుగరాజపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మింపజేసేందుకు ఆ జిల్లాకు చెందిన అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నాలు వేగవంతం చేశారు. వాస్తవానికి పోర్టు కం షిప్‌యార్డును మచిలీపట్నంలో నిర్మించేందుకు తొలుత ప్రయత్నాలు జరిగాయి. మచిలీపట్నంలో పోర్టు కం షిప్ యార్డును నిర్మించేందుకు అనుకూలత ఉందని సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. అయితే మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోకపోవడంతో దాదాపు రూ.1500 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే పోర్టు కం షిప్‌యార్డు దుగరాజపట్నంకు తరలిపోయిందనే వాదన పలువురి నుంచి వ్యక్తమవుతుంది. -
జిల్లాపై ‘రాజ’ముద్ర
జిల్లాపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర సుస్థిరం.. ఆయన పేరును జిల్లావాసులు ఎన్నటికీ మరిచిపోలేరు. వారి సుదీర్ఘ స్వప్నాలను నిజం చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఆయన అనేకమంది కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దారు. అనేక ప్రాజెక్టులను మంజూరు చేసి ‘కృష్ణా’పై ఆయనకు ఉన్న ఆదరాభిమానాల్ని చాటుకున్నారు. అలాంటి మహానేత ఐదేళ్ల పాలనలో జిల్లాలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగాయి. ఆయన మరణానంతరం అవి ఒక్కొక్కటిగా కుంటుపడగా, అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అటకెక్కాయి. ముఖ్యంగా బందరు పోర్టు నిర్మాణం, గన్నవరం ఐటీ పార్కు తిరోగమనంలో ఉన్నాయి. బందరులో కృష్ణా యూనివర్సిటీ, నూజివీడు ట్రిపుల్ ఐటీ అంతంతమాత్రంగా ఏర్పాటయ్యాయి. సాక్షి, విజయవాడ : రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణాజిల్లా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. 1980 దశకం నుంచే జిల్లాలో వైఎస్సార్‌కు బలమైన వర్గం ఉంది. యువత, సీనియర్లు, మేధావులు, ఇలా అనేకమందిని రాజకీయంగా ప్రోత్సహించి పార్టీలో మంచి ప్రాధాన్యంతోపాటు ఎన్నికల్లో టికెట్లు ఇప్పించి గెలిపించుకునేవారు. 2004 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో అభివృద్ధి శరవేగంగా నడిచింది. 2009లో మరణించే వరకు జిల్లాలో తరచూ పర్యటించేవారు. ముఖ్యమంత్రి హోదాలో సుమారు 50 సార్లకు పైగా పర్యటించి జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకోవడంతో పాటు పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 2006లో గన్నవరంలో విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో అక్కడ 1.92 లక్షల చదరపు అడుగుల్లో రూ. 450 కోట్ల నిర్మాణ వ్యయంతో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు తరచూ సమీక్షించి త్వరగా పూర్తిచేయాలని భావించారు. దురదృష్టవశాత్తు వైఎస్ మరణించడంతో ఐటీ పార్కు కలగానే మిగిలిపోయింది. 2010 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య మొదటి టవర్‌ను ప్రారంభించారు. వైఎస్ స్వప్నం సాకారం అయితే 15 వేల మందికి ప్రత్యక్షంగానూ, 40 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభించేది. జిల్లాను విద్యా రాజధానిగా సుస్థిరం చేయాలని 2008లో నూజివీడులో ట్రిపుల్ ఐటీని ప్రారంభించారు. రెండువేల సీట్లతో ప్రారంభించి శాశ్వత భవనాల నిర్మాణాలు, ఇతర అవసరాలకు రూ. 300 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత అవి కూడా అటకెక్కాయి. నిధుల మాట ఎలా ఉన్నా కేటాయించిన సీట్లలోనూ రోశయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కోత విధించింది. రెండు వేల సీట్లను వెయ్యికి కుదించారు. ప్రస్తుతం వెయ్యి సీట్లతో సమగ్ర వసతులకు దూరంగా ట్రిపుల్ ఐటీ పనిచేస్తుంది. సపోర్టు లేకుండాపోయిన బందరు పోర్టు జిల్లా ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదరుచూస్తున్న బందరు పోర్టు నిర్మాణానికి వైఎస్ హయాంలోనే తొలి అడుగుపడింది. అంతముందు అనేక ప్రభుత్వాలు దీనిని పట్టించుకోకుండా ప్రజల డిమాండ్‌ను పక్కనపెట్టాయి. వైఎస్సార్ సాధ్యాసాధ్యాలపై సర్వే చేయించి పోర్టు నిర్మాణానికి అనుకూలంగా నివేదిక రావడంతో 2008 ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. వెనువెంటనే రూ. 1500 కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఆ తర్వాత ఆయన మరణంతో పోర్టుకు సపోర్టు లేకుండా పోయింది. జిల్లాకో వర్సిటీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కృష్ణా యూనివర్సిటీని బందరులో 2008 ఏప్రిల్ 23న ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రారంభించారు. ఆ తర్వాత శాశ్వత భవనాల నిర్మాణం కోసం 180 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కానీ నేటి పాలకుల నిర్లక్ష్యంతో అలానే మిగిలిపోయింది. ప్రస్తుతం నిధుల లేమితో వర్సిటీ ఇబ్బందులు పడుతుంది. కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం.. కృష్ణాడెల్టా స్థిరీకరణ కోసం నాలుగు వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. 150 ఏళ్లనాడు ఏర్పాటుచేసిన సాగునీటి విధానం తప్ప తర్వాతి కాలంలో ఆధునికీకరణ జరగలేదని గుర్తించిన వైఎస్సార్ డెల్టాను పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని సాగునీటి కాల్వల మరమ్మతులకు నాలుగువేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. ఈ మరమ్మతులను 56 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించారు. వీటిలో 20 కృష్ణా తూర్పు డెల్టాలో ఉన్న పంట కాల్వలు, మురుగునీటిని ఆధునీకరించేందుకు 20 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. దీనికి రూ. 2180 కోట్లు కేటాయించగా, 2007-08లో ఇరిగేషన్ సెక్టార్లో 13 ప్యాకేజీలకు రూ. 1,185 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. 204 కోట్లతో ప్రకాశం బ్యారేజి, హెడ్వర్క్ను ఆధునీకరించారు. ఏలూరు కాల్వకు రూ. 43.12 కోట్లు, బందరు కాల్వ ఆధునీకరణకు రూ. 333.7 కోట్లు కేటాయించారు. ఈ పనులన్నీ 2016 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే వైఎస్ మరణంతో డెల్టా ఆధునీకరణ నత్తనడకన సాగుతోంది.