ప్రతిష్టాత్మకంగా పోర్టు నిర్మాణం
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చిలకలపూడి) :
మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శనివారం ఎంఏడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల వద్దకు పూర్తి సమాచారంతో వెళ్లి వారికి అవగాహన కల్పించి ప్రాంత అభివృద్ధికి సహకరించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బందరు అభివృద్ధి అందరి బాధ్యత అని ఇందుకు సహకరిస్తే ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పోర్టు నిర్మాణం ఎంతో కీలకమన్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, సీఆర్డీఏ ల్యాండ్ ఫూలింగ్ ఎస్టేట్ డైరెక్టర్ మోహనరావు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, ఎస్పీ విజయకుమార్‌పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణానికిS రుణాలు ఇవ్వటం లేదు : కర్రి నాగవెంకటదుర్గాఅశ్వని,
మా భూమిని భూసమీకరణలో పొందుపరచటం వలన బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వటం లేదు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.