నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తూ రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకి తెచ్చి రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేయడానికి కుట్ర చేస్తుందని జేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. పది జిల్లాల తెలంగాణ కోసం గురువారం జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని బుధవారం నల్లగొండ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన హైదరాబాద్‌తో కూడిన ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సీడబ్ల్యూసీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మరోసారి మోసానికి దిగవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సంపూర్ణ తెలంగాణకు వ్యతిరేకంగా చేసే ఏ ప్రతిపాదనలైనా అడ్డుకుంటామని అన్నారు. బంద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్చంధంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, చకిలం అనిల్‌కుమార్, కూతురు లక్ష్మారెడ్డి, బోనగిరి దేవేందర్, ఎం.రమేష్, టి.కృష్ణ, విజయ్‌కుమార్, ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, ఫరీద్, శ్రీనివాస్, జమాల్‌ఖాద్రీ, రవీందర్, ఎన్.సంతోష్‌రెడ్డి, దూసరి కిరణ్, మాలె శరణ్యారెడ్డి, బి.నాగార్జున, సంతపురి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
బంద్‌ను విజయవంతం చేయాలి : జేఏసీ
Published Thu, Dec 5 2013 3:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement