కరీంనగర్, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణను తెరపైకి తేవడానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, టీజేఏసీ, తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజాఫ్రంట్‌తోపాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, బార్ అసోసియేషన్లు బంద్‌కు మద్ద తు తెలిపాయి.
ఆర్టీసీ కార్మికులు బంద్‌కు జైకొట్టడం తో జిల్లాలోని 11 డిపోల్లో 950 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ఉద్యోగుల నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వ కార్యాలయాలు స్తంభించాయి. జిల్లా కోర్టు వద్ద ప్రధాన గేట్లుమూసి తాళాలు వేసి న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి కార్మికులు బంద్‌లో పాల్గొనడంతో కొంతమేర ఓపెన్‌కాస్టులతోపాటు భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రూప్‌సింగ్ తదితరులు బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. నగరంలో ర్యాలీగా తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ఓవైపు బంద్ జరుగుతుంటే.. మరోవైపు కరీంనగర్ సింగిల్‌విండో చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకున్న గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు నేతలు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగి ఎన్నికలను వాయిదా వేయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది.
తెలంగాణచౌక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసిన సోనియాగాంధీ గుడిని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీజేపీ నాయకులు కన్నం అంజయ్య, నారాయణరావు, మహిళా నాయకులు సుజాతారెడ్డి, గాజుల స్వప్న, న్యూడెమోక్రసీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, జూపాక శ్రీనివాస్ తదితరులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు తెలంగాణవాదులకు వాగ్వివాదం, తోపులాట జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీజేపీ నాయకులు కన్నం ఆంజయ్య, నారాయణరావు, మహిళ నేతలు గాజుల స్వప్న, ప్రసన్న, సుజాతరెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌తోపాటు మరో 20 మంది ఆదుపులోకి తీసుకొని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరిలించారు.
ఆరెస్టు చేసిన బీజేపీ, సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ టుటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట బీజేపీ, సీపీఐ, జేఏసీ చైర్మన్ వెంకట మల్లయ్య, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సోనియాగాంధీ గుడిని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కన్న కృష్ణ, సునీల్‌రావు, డి.శంకర్‌లతోపాటు కార్యకర్తలు తెలంగాణ చౌక్‌కు చేరుకొని బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో బీజేపీ నాయకుడు ఎడ్లవెల్లి విజేందర్‌రెడ్డి తన కార్యకర్తలతో బైక్ ర్యాలీగా రావడంతో ఒక్కరిపై ఒక్కరు నినాదాలు చేసుకున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ నాయకులు సోనియా గుడిని ధ్వంసం చేయడంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుతుండగా అటుగా బండి సంజయ్ బైక్ ర్యాలీగా రావడంతో ఇరువర్గాల మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ ఉన్న పోలీసులు వారిని పంపించారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ప్రధానకూడళ్లలతోపాటు బస్టాండ్ చౌరస్తాలోని శ్రీపాద విగ్రహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్, బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌లతోపాటు పలు కులసంఘాల నాయకులు ర్యాలీలతో హోరెత్తించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కేంద్రప్రభుత్వం, జీఓఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, గోదావరిఖనిలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ రాష్ర్ట నేతలు ఎస్.కుమార్, బల్మూరి వనిత, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, కోరుకంటి చందర్, హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఒడితెల సతీష్‌బాబు, కర్ర శ్రీహరి, పన్యాల రమణారెడ్డి, మానకొండూరు టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఓరుగంటి ఆనంద్, జీవీ.రామకృష్ణారావు, శరత్‌రావు, పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్‌రెడ్డి, చొప్పదండిలో బొడిగె శోభ, జగిత్యాలలో ఓరుగంటి రమణారావు, జితేందర్‌రావు, మంథనిలో చందుపట్ల రాంరెడ్డి, సునీల్‌రెడ్డి పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు.
బంద్ ఉద్రిక్తం.. సంపూర్ణం
Published Fri, Dec 6 2013 2:59 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement