కాంట్రాక్టు ఉద్యోగులను వంచిస్తున్న చంద్రబాబు | bandi srinivasarao about chandrababu naidu | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగులను వంచిస్తున్న చంద్రబాబు

Published Fri, Dec 16 2016 3:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

కాంట్రాక్టు ఉద్యోగులను వంచిస్తున్న చంద్రబాబు

కాంట్రాక్టు ఉద్యోగులను వంచిస్తున్న చంద్రబాబు

ఏపీఎన్ జీవో అసోసియేషనన్ జిల్లా అధ్యక్షుడు బండి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంచిస్తున్నారని ఏపీ ఎన్ జీఓ అసోసియేషన్జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల జాయింట్‌ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచారంలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు, ఆ తరువాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి తప్పించుకునే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విధాన నిర్ణయం తీసుకొని ఆ దిశగా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటే కోర్టు తీర్పులు ఏ మాత్రం అడ్డంకి కాదన్నారు. క్రమబద్ధీకరణ ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉందని, ఇప్పటిౖకెనా కుంటి సాకులు ఆపి కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల పోరాటానికి మద్దతుగా ప్రత్యక్ష పోరుకు ఏపీఎన్ జీఓ సిద్ధంగా ఉంటుందని బండి శ్రీనివాసరావు ప్రకటించారు.

ఎన్ జీవో అసోసియేషన్ జిల్లా నాయకులు శరత్‌బాబు, కృష్ణారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ సర్దార్, ఎయిడెడ్‌ లెక్చరర్ల సంఘం మాజీ అధ్యక్షుడు బాపట్ల వెంకటనరసింహారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. గురువారం దీక్షలు చేపట్టిన వారిలో గాలంకి ఆనంద్, టి.వాసుబాబు, బి.వెంకటరావు, వెంకటేశ్వర్లు, చింతగుంట్ల హిమశేఖర్, పద్మారావు, జయసుధ, కే సంయుక్త, సుజాత, నంద్యాల కాశింపీరా, వి.వెంకటేశ్వరరెడ్డి, కుసుమకుమార్, రమామాధవి, జె.ఈశ్వరుడు, బీడీ సుందర్‌ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాంట్రాక్టు లెక్చరర్ల జాయింట్‌ యాక్షన్ కమిటీ నాయకులు కుమ్మరకుంట సురేష్, పి.మాధవరావు, ఆర్‌సీహెచ్‌ రంగయ్య, సుంకరి కృష్ణయ్య, పిల్లి సుబ్బారెడ్డి, పి.సత్యనారాయణ, వి.కోటేశ్వరరావు, షేక్‌ ఖాదర్‌వలి, బాబూరావు, చల్లా శ్రీనివాసరావు, కొప్పుల కొండారెడ్డి, కట్టా కిషోర్‌ తదితరులు నాయకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement