బంగారుతల్లి పథకంపై అవగాహన పొందాలి | Bangarutalli scheme must be aware of | Sakshi
Sakshi News home page

బంగారుతల్లి పథకంపై అవగాహన పొందాలి

Published Fri, Sep 20 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

Bangarutalli scheme must be aware of

శాయంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న బంగారుతల్లి పథకంపై తల్లులు అవగాహన పొందాలని డీఆర్‌డీఏ ఐకేపీ ప్రాజెక్టు డెరైక్టర్ సముద్రాల విజయగోపాల్ అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రంలో గురువారం కంప్యూటర్ ఆపరేటర్లకు బంగారు తల్లి డాటా అప్‌లోడింగ్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ విజయ్‌గోపాల్ మాట్లాడుతూ బంగారు తల్లి డాటా అప్‌లోడింగ్ అనుకున్నంత స్థాయిలో జరగడం లేదన్నారు.

పథ కంపై అవగాహన లేకపోవడంతో ఆడపిల్లల తల్లులు అందించే మ్యాన్‌డేటరి డ్యాక్యుమెం ట్లు, పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్ సకాలంలో అందించకపోవడంతో ఆలస్యమవుతున్నాయని ఆయన చెప్పా రు. బంగారు తల్లి పథకం మే 1వ తేదీ నుంచి పుట్టిన పిల్లలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. పథకంలో పేరు నమోదు చేసుకున్న ఆడపిల్లలకు 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రభుత్వం విడతల వారీగా పారితోషికం అందజేస్తుందని చెప్పారు.

ప్రభుత్వ వైద్యశాలలో పుట్టిన బంగారు తల్లులకు మొదటి విడతగా రూ.2,500 అందజేస్తామన్నారు. బంగారు తల్లుల ఎంపిక బాధ్యత పూర్తి గా ఏపీఎంలదేనని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు పథకం డాటాను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీని వాస్, సీసీలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement