సిమెంట్ తొట్టిలో ‘బంగారుతల్లి’ | child baby in Cement crib | Sakshi
Sakshi News home page

సిమెంట్ తొట్టిలో ‘బంగారుతల్లి’

Published Tue, Sep 2 2014 2:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

సిమెంట్ తొట్టిలో ‘బంగారుతల్లి’ - Sakshi

సిమెంట్ తొట్టిలో ‘బంగారుతల్లి’

మానవత్వం మాయమైందా..!
- వికారాబాద్ పాతగంజ్‌లో పసికందు లభ్యం
- తాండూరులోని శిశుగృహకు తరలింపు
అనంతగిరి: మానవత్వం మాయమైపోయింది. ‘మాతృత్వం’ బరువైంది. లోకం పోకడ తెలియని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఓ సిమెంట్ తొట్టిలో వదిలేసి పోయారు. ‘బంగారు తల్లి’ ఆ తల్లిదండ్రులకు బరువైందో.. లేక మరి ఇంకేదైన కారణమో..! నెలరోజుల వయసు కూడా లేని పసికందు గుక్కపట్టి ఏడ్వడంతో పలువురు ఆయ్యో ‘పాపం' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి ఒడిలో కంటినిండా నిద్రించాల్సిన చిన్నారి రోడ్డుపాలైంది. ఈ హృదయ విదారక సంఘటన వికారాబాద్‌లోని పాతగంజ్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాతగంజ్‌లో ఇళ్ల మధ్య ఓ సిమెంట్ తొట్టి ఉంది. అందులో కాలనీవాసులు చెత్తచెదారం పడేస్తుంటారు. ఇదిలా ఉండగా.. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తొట్టిలోంచి పసికందు రోదనలు వినిపించాయి. స్థానికురాలు చంద్రకళ అక్కడికి వెళ్లి చూడగా ఓ ఆడబిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. దీంతో ఆమె చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి దుస్తులు వేసింది. స్థానికులు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు.

తాపీగా ఐసీడీఎస్ అధికారులు సాయంత్రం 4:30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును సిమెంట్ తొట్టిలో వదిలేసి వెళ్లి ఉంటారని స్థానికులు అధికారులకు తెలిపారు. ఈ ‘పాప'ం ఎవరిదో అని స్థానికులు నిందించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుష్మ పోలీసుల సాయంతో ‘బంగారు తల్లి’ని తాండూరులోని శిశుగృహకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement