బీటీ కళాశాల ఆస్తులను కాపాడుకుంటాం
- అక్రమంగా కట్టిన ప్రహరీని పడ గొట్టిన విద్యార్థులు
- పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన గొడవ
మదనపల్లె అర్బన్: బీటీ కళాశాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశా రు. స్థానిక ఇండియన్ యూనియన్ క్లబ్ సభ్యులు అక్రమంగా కట్టిన ప్రహరీని సోమవారం విద్యార్థులు పడగొట్టారు. బీటీ కళాశాలకు చెందిన స్థలంలో ఎస్‌బీఐ భవన నిర్మాణానికి అగ్రిమెంటు పద్ధతిలో స్థలం కేటాయించడానికి కళాశాల నిర్ణయం తీసుకుంది.
అయితే కళాశాలకు చెందిన స్థలంలో రాత్రి సమయంలో ఇండియన్ యూనియన్ క్లబ్ వారు అక్రమంగాప్రహరీ నిర్మించడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది గోడ విషయమై అడగడానికి వెళ్లారు. అయితే ప్రహరీని పడగొడతారేమోనన్న భయం తో క్లబ్ సభ్యులు కొంతమంది విద్యార్థులపై రాళ్లు వేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రహరీని కూల్చి వేశారు. ఇండియన్ యూనియన్ క్లబ్ సభ్యులు, విద్యార్థుల మధ్య గొడవ పెద్దది కావడంతో వన్‌టౌన్ ఎస్‌ఐలు మల్లికార్జున, దస్తగిరి తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కిజర్‌మహ్మద్ మాట్లాడుతూ బీటీ కళాశాలకు డాక్టర్ అనిబిసెంటు 11 ఎకరాల స్థలాన్ని ఇచ్చారన్నారు. కళాశాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకునేందుకు ప్రహరీ నిర్మిస్తున్నట్టు తెలి పారు. అయితే బీటీ కళాశాల ఆస్తిలో భాగమైన స్థలాన్ని ఇండియన్ యూని యన్ క్లబ్‌వారు ఆక్రమించుకొని దౌర్జన్యంగా ప్రహరీ నిర్మిస్తుండగా ఆది వారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
అయినప్పటికీ రాత్రి సమాయాల్లో గోడను నిర్మించినట్టు తెలిపారు. కళాశాల ఆస్తులు కాపాడుకోవడం తమతో పాటు అందరి బాధ్యత అన్నారు. అందులో భాగంగానే విద్యార్థులు గోడ విషయం అడిగేందుకు వెళ్లగా క్లబ్ సభ్యులు దౌర్జన్యానికి దిగారని ఆయన పేర్కొన్నారు. బీటీ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, పూర్వ విద్యార్థులను, క్లబ్ సభ్యులను వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో సమావేశ పరిచి స్థలం వివాదం ముగి సేంతవరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని పోలీసులు చెప్పారు.
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్, ఎమ్మార్పీ జిల్లా అధ్యక్షలు నరేంద్రమాదిగ, బీఎస్పీ నా యకులు కంగేరి నందతో పాటు నాయకులు కలగచేసుకొని కళాశాల ఆస్తులను కాపాడానికి కళాశాల యజమాన్యానికి, విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు.