మెరుగైన సేవలందిస్తా | Better offer | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందిస్తా

Published Thu, Jan 15 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

మెరుగైన సేవలందిస్తా

మెరుగైన సేవలందిస్తా

జేసీగా బాధ్యతలు స్వీకరించిన హరికిరణ్
 
సాక్షి, కర్నూలు: రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన జిల్లా 39వ జేసీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏజేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, ఏఓ పి.వి.రమణరావు తదితరులు జేసీకి స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్‌లో జేసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కొత్త అయినప్పటికీ ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తానన్నారు.

ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సూచనలతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తానన్నారు. జిల్లాలో తహశీల్దార్లు ఏ ప్రాంతంలో ఎంత కాలంగా పని చేస్తున్నారో వివారాలు ఇవ్వాలని ఏఓ రమణరావును ఆదేశించారు. అదేవిధంగా సెక్షన్ సూపరింటెండెంట్ల పని తీరును అడిగి తెలుసుకున్నారు. మీ-సేవ కేంద్రాల్లో పెండింగ్ దరఖాస్తుల వివరాలపై ఆర్‌ఐ కీర్తిని ప్రశ్నించారు. ఆ తర్వాత కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement