తూర్పుగోదావరి: ‘చిన్నప్పడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పితే you're not called a man అని. ఎప్పటికీ మాట తప్పలేదు. మరిచిపోలేదు. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజొకటి వచ్చింది. ఎంత కష్టమైనా ఆ మాటా నేను తప్పలేదు. Because, i am a man.. we are living in a Society... ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి.’ ఇవీ కొత్తగా వస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రంలో హీరో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్‌లు.
మంగళవారం విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియా’లో వైరల్ అవుతోంది. ఇచ్చిన మాటకు కచ్చితంగా కట్టుబడి ఉండాలనే సందేశం ఇందులో ఉండడమే ఆ క్రేజ్ కి కారణం. ఇష్టానుసారంగా హామీలిచ్చేసి, తర్వాత మొహం చాటేసే నేతలకు ఈ టీజర్ ఓ కనువిప్పు అని, ఇలా హామీ ఇచ్చి మాటమార్చిన నేతలే మన ముందున్నారంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. హోదా విషయంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట మార్చారని, ఆయన తీరుపై సోషల్ మీడియాలో సైటెర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘భరత్ అనే నేను’ టీజర్‌ను షేర్ చేస్తున్న నెటిజన్లు.. మాట తప్పితే మనిషే కాదన్న టీజర్‌లోని డైలాగ్‌ను ప్రధానంగా ఎక్కుపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment