సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వీచిన నరేంద్ర మోడీ ప్రభంజనానికి తోడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన బూటకపు హామీలను ప్రజలు విశ్వసించడంతో వైఎస్సార్ సీపీ వెనకబడింది. దీంతో జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది.
జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆచంట, నిడదవోలు స్థానాలను తక్కువ ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ కోల్పోయింది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఏలూరు లోక్సభ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్ 15 వేల స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.