సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమైయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ కోర్ కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో మాదిరీగానే ఏపీలో కూడా ఒంటరిగానే బరిలోకి దిగాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షా పరిశీలించి తమకు దిశా నిర్ధేశం చేశారని తెలిపారు.
చంద్రబాబు కేవలం ప్రధాని మోదీపై విమర్శలు చేయడమే ఆయన శైలిగా మార్చుకున్నారని మండిపడ్డారు. మోదీ కంటే ఆయనే సీనియర్‌గా చెప్పుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. గుజరాత్ నమూనా గురించి చంద్రబాబు తెలుసుకుంటే మంచిదని పేర్కొన్నారు. మోదీకి చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. బీజేపీ సహకారం లేకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ ముందుకెళ్లదని.. చంద్రబాబు కేవలం 30 స్థానాలకు పరిమితం అయ్యేలా చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment