ఇదేమన్నా సినిమానా? చిరంజీవికి చురక!
ఏలూరు: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిపై బీజేపీ నేత కృష్ణంరాజు ఘాటైన విమర్శల్ని సంధించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సమావేశంలో బీజేపీ నేతలు కావూరి, కృష్టంరాజులు కాంగ్రెస్, టీడీపీపై విమర్శలు చేశారు.
100 రోజుల పాలనలో దేశంలోని పరిస్థితులు మారడానికి ఇదేమైనా సినిమానా అంటూ చిరంజీవిని కృష్ణంరాజు ప్రశ్నించారు. డిపాజిట్లు రాని పార్టీ నేతలు కూడా మమ్మల్ని విమర్శిస్తారా అంటూ ఆయన అన్నారు.