
వచ్చే ఎన్నికల్లో సొంతంగానే బీజేపీ పోటీ
కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు
కాకినాడ సిటీ: 2019 ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు తెలిపారు. ఆ మేరకు క్షేత్రస్థారుులో పార్టీ బలోపేతం కానుందన్నారు. శనివారం కాకినాడలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. దేశాన్ని అగ్రదేశాల జాబితాలో చేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, మరోపక్క అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.
రాష్ట్రంలో టీడీపీ రానురానూ బీజేపీ కార్యకర్తల విషయంలో అభ్యంతరకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీంతో కార్యకర్తలు పైకి చెప్పుకోలేక బాధపడుతున్నారని, దీంతోనే పార్టీ అధినాయకత్వం సమన్వయ చర్యలు చేపట్టిందని చెప్పారు. అందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిపారు.