సత్తుపల్లి, న్యూస్‌లైన్: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీదే అధికారమని, నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఆదివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలకు తోడు, గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడి అందించిన ఆదర్శవంతమైన పాలనతో ఆయనకు ప్రజాదరణ పెరిగిందన్నారు. మోడి ప్రధానమంత్రి అయితే దేశ స్థితిగతులు మార్చి ఉన్నత భారతాన్ని ఇస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.
పార్టీని బూత్‌స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికి కార్యకర్త నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తి చేస్తామన్నారు. గుజరాత్‌లోని నర్మద నది ఒడ్డున ఏర్పాటు చేయనున్న సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహ పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
వల్లభాయ్‌పటేల్ రాష్ట్రీయ ఏక్తాట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రైతులు వాడిన వ్యవసాయ పనిముట్లు, మట్టిని సేకరించి, గ్రామస్తుల సంతకాలను సేకరించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గల్లా సత్యనారాయణ, కిసాన్ ముక్తి మోర్చా రాష్ట్ర కార్యదర్శి దుగ్గి అప్పిరెడ్డి, సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ వందనపు భాస్కర్‌రావు, నాగేంద్ర కుమార్, దీన్‌దయాళ్‌రెడ్డి, గొర్ల మంగతాయారు, గండ్ర సరోజిని పాల్గొన్నారు.
కేంద్రంలో బీజేపీదే అధికారం
Published Mon, Jan 27 2014 3:44 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM
Advertisement
Advertisement