విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆటకట్టు! | Blade batch arrested at Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆటకట్టు!

Published Wed, Feb 4 2015 1:26 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆటకట్టు! - Sakshi

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆటకట్టు!

విజయవాడ: బెజవాడ అనగానే గుర్తుచ్చేది బ్లేడ్ బ్యాచ్. నగరంలో గతకొంత కాలంగా బ్లేడ్ బ్యాచ్ హాల్చల్ సృష్టిస్తోంది. ఒంటరిగా కనిపించిన వారిపై దాడిచేసి నిలువుదోపిడీ చేయడం, ప్రతిఘటిస్తే బ్లేడ్‌లతో శరీరంపై కోతలు పెట్టడం ఈ బ్యాచ్ పని.  దాంతో ఈ ముఠాకు భయపడి పాదచారులు భయటకు రావలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు.

విజయవాడలో తనిఖీల కోసం ప్రత్యేకంగా పోలీసులు 26 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో  14మంది బ్లేడ్ బ్యాచ్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 10లక్షల రూపాయాల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు 150 కెమెరాలు పంపిణీ చేసినట్టు పోలీస్ కమీషనర్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement