చిట్టమూరు, న్యూస్‌లైన్: తన మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చాలని ఓ తల్లి తన కొడుకును చివరి కోరిక కోరింది. తల్లి కోరిక తీర్చేందుకు తను వు చాలించిన ఆమె దేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చేందుకు కుమారుడు సిద్ధమయ్యాడు. దీనికి చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివా దం ఏర్పడింది.
ఈ ఘటన మండల పరిధిలోని మన్నెమాలలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఈశ్వరవాక పంచాయతీ మన్నెమాలకు చెందిన మల్లి ఎల్లమ్మ (70) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. తాను చనిపోయాక శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చి సమాధి కట్టాలని కో రినట్టు ఆమె కుమారు డు పుట్టయ్య చెప్పాడు. ఈ దశగా పనులు చేపట్టగా చుట్టుపక్కల ఇళ్ల వారు తహశీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ రవినాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి వారు వచ్చి పుట్టయ్యతో ఉదయం నుం చి సాయంత్రం వరకు సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే తన తల్లి చివరి కోరిక తీర్చాలని, ఎవరెన్ని చెప్పినా విననని ఏడుస్తూ సమాధానం చెప్పాడు. అయితే పుట్టయ్య తల్లిపై ప్రేమతోనా, పక్కింటి వారిపై పగతోనా, మూర్ఖత్వంతో ఇలా చేస్తున్నాడా అనేది అర్థం కాక తలలు పట్టుకున్నారు.
గ్రామస్తులు చెప్పినా విని పించుకోకుండా శవాన్ని ఇంట్లోనే పూడ్చాలని తెగేసి చెప్పాడు. తన తల్లి శవాన్ని పక్కకు తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. తన చావుకు అధికారులు, చుట్టుపక్కల వారు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోతానని బెదిరించాడు. దీంతో అధికారులు ఎల్లమ్మ శవాన్ని తీసేందుకు సాహసించలేదు. చివరికి రాత్రి ఏడు గంటలకు పుట్టయ్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని బంధువులు, తలారులతో మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేయించారు.
‘చావు’తంటా
Published Sun, Feb 9 2014 3:19 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
Advertisement