Ravi nayak
-
ఉద్యమకారుడి ఆత్మహత్య
దుగ్గొండి: ఉన్నత విద్యావంతుడు.. ఉద్యోగం, ఆస్తిపాస్తులు లేవు.. బతుకుదెరువు దొరుకుతుందని ఆశపడి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాడు. ఊరూవాడను ఏకం చేయడంతో పాటు గిరిజన తండాల్లో ఉద్యమ బిడ్డలను తయారు చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరేళ్లు గడిచినా ఎలాంటి బతుకుదెరువు దొరకలేదు. కన్నబిడ్డలు పెళ్లీడుకొచ్చినా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో జీవితం వ్యర్థమని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీ తండా గ్రామానికి చెందిన నూనావత్ రవినాయక్ (40) కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చిన ఆరేళ్ల నుంచి ఉద్యోగం కోసం పడరాని పాట్లు పడినా ఫలితం లేదు. ఓ పక్క ఎలాంటి ఆస్తి లేకపోవడం, ఇద్దరు కూతుళ్లు లిఖిల, కళ్యాణి డిగ్రీ చదువుతూ పెళ్లీడుకు రావడంతో భార్య జ్యోతి కూలి పనులు చేస్తూ కుటుంబపోషణలో పాలు పంచుకుంటోంది. దీంతో రవినాయక్ తీవ్ర మనస్తాపం చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. కాగా, రవినాయక్ మృతదేహం వద్ద నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెంటనే రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. -
31వ వరకు అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, యాదాద్రి : యాదాద్రి వైటీడీఏను ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చట్టం 1975 ప్రకారంగా గుర్తించిన 7 గ్రామాల్లో ఏవేని అభ్యంతరాలు, ఆక్షేపణలు మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకతలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైటీడీఏ అధికారులు, మాస్టర్‌ప్లాన్ పరి« దిలోని గ్రామాల సర్పంచ్‌లు, ఈఓపీఆర్డీలకు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు ఈనెల 31వ తేదీ వరకు ఫిర్యాదుల ఇవ్వవచ్చన్నారు. వీటిని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపి తగు చర్యతీసుకుం టామని తెలిపారు. అనంతరం వైటీడీఏ అభివృద్ధిపై ఏఏ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రజంటేషన్ చేశారు. సమావేశంలో వైటీడీఏ సెక్రటరీ సాయిరాం, వైటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి ఆర్.హరిప్రసాద్, టౌన్‌ప్లాన్ అధికారి సుష్మిత, జిల్లా పంచాయతీ అధికారి భిక్షం పాల్గొన్నారు. -
‘చావు’తంటా
చిట్టమూరు, న్యూస్‌లైన్: తన మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చాలని ఓ తల్లి తన కొడుకును చివరి కోరిక కోరింది. తల్లి కోరిక తీర్చేందుకు తను వు చాలించిన ఆమె దేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చేందుకు కుమారుడు సిద్ధమయ్యాడు. దీనికి చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివా దం ఏర్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని మన్నెమాలలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఈశ్వరవాక పంచాయతీ మన్నెమాలకు చెందిన మల్లి ఎల్లమ్మ (70) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. తాను చనిపోయాక శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చి సమాధి కట్టాలని కో రినట్టు ఆమె కుమారు డు పుట్టయ్య చెప్పాడు. ఈ దశగా పనులు చేపట్టగా చుట్టుపక్కల ఇళ్ల వారు తహశీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ రవినాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి వారు వచ్చి పుట్టయ్యతో ఉదయం నుం చి సాయంత్రం వరకు సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే తన తల్లి చివరి కోరిక తీర్చాలని, ఎవరెన్ని చెప్పినా విననని ఏడుస్తూ సమాధానం చెప్పాడు. అయితే పుట్టయ్య తల్లిపై ప్రేమతోనా, పక్కింటి వారిపై పగతోనా, మూర్ఖత్వంతో ఇలా చేస్తున్నాడా అనేది అర్థం కాక తలలు పట్టుకున్నారు. గ్రామస్తులు చెప్పినా విని పించుకోకుండా శవాన్ని ఇంట్లోనే పూడ్చాలని తెగేసి చెప్పాడు. తన తల్లి శవాన్ని పక్కకు తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. తన చావుకు అధికారులు, చుట్టుపక్కల వారు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోతానని బెదిరించాడు. దీంతో అధికారులు ఎల్లమ్మ శవాన్ని తీసేందుకు సాహసించలేదు. చివరికి రాత్రి ఏడు గంటలకు పుట్టయ్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని బంధువులు, తలారులతో మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేయించారు.