
'లోటు బడ్జెట్ పై చంద్రబాబువి పొంతనలేని లెక్కలు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి పొంతనలేని లెక్కలని ఏపీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి పొంతనలేని లెక్కలని ఏపీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా , ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై ఎన్డీఏలో మంత్రులైన టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని బొత్స ప్రశ్నించారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా ?అని నిలదీశారు. ఈ ప్రాంత ఎంపీ అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రి కావడం అదృష్టమని.. అయితే విభజన బిల్లులోని అంశాలను సాధించలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని బొత్స ఎద్దేవా చేశారు.
రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాలని కోరుకున్నామని.. దేవుడు దగ్గరు కూడా రాజకీయాలు చేస్తున్నారన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విభజన చట్టంలోని హామీల అమలు కోసం ధర్నాలు చేస్తామని బొత్స హెచ్చరించారు.