'చంద్రబాబుకు నిద్రలేకుండా పోయింది' | botsa satyanarayana slams cm chandrababu on modi- jagan meeting | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు నిద్రలేకుండా పోయింది'

Published Sat, May 20 2017 6:14 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

'చంద్రబాబుకు నిద్రలేకుండా పోయింది' - Sakshi

'చంద్రబాబుకు నిద్రలేకుండా పోయింది'

విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవడంతో చంద్రబాబుకు నిద్రలేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ మోదీని కలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడటానికి వైఎస్‌ జగన్‌ మోదీని కలిశారని, ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళ్తాం అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

తెలంగాణ ఎంపీలు కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్నారని, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు హోదాపై మాట్లాడటం లేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు ఏమన్నారో ఒకసారి వినాలని చంద్రబాబుకు సూచించారు. హోదా ముగిసిపోయిన అధ్యాయమా అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబులా ఊసరవెళ్లి రాజకీయాలు చేయమని, ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ రాజీపడదని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు మాట్లాడుతున్నవి చవకబారు మాటలని బొత్సా సత్యనారాయణ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement