'చంద్రబాబు ఆలోచన అంతా ఓటు నోటు పైనే' | Botsa satyanarayana takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఆలోచన అంతా ఓటు నోటు పైనే'

Published Tue, Jun 16 2015 2:15 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

'చంద్రబాబు ఆలోచన అంతా ఓటు నోటు పైనే' - Sakshi

'చంద్రబాబు ఆలోచన అంతా ఓటు నోటు పైనే'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల గురించి ఆలోచించకుండా.... ఓటు నోటు గురించే ప్రతి క్షణం ఆలోచిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలో పార్టీని ఎలా రక్షించుకోవాలనే చంద్రబాబు ఆలోచన అని ఆరోపించారు.

చట్టానికి ఎవరూ అతీతులు కాదని... ఏ కార్యక్రమం జరిగినా రాజ్యాంగ ప్రకారమే జరగాలన్నారు. ఢిల్లీకి వెళ్లినా కేసుల నుంచి ఎలా బయటపడాలన్నదే చంద్రబాబు చర్చించారన్నారు. చంద్రబాబు స్వార్థం, స్వలాభం, రాజకీయ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తే కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేయొచ్చు.... కానీ ఎందుకు ఆ పని చేయడం లేదంటూ బాబును బొత్స ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవసాయాన్ని ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతుల వ్యవసాయ విధానాలు తెలుసా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.ఏపీలో రైతులకు రణాలు ఇవ్వడంపై బ్యాంకులు పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ లబ్ది, రాజకీయ వ్యాపారాలు, వ్యక్తిగత లబ్ది కోసమే చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

వ్యక్తిగత స్వార్థం కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యపై చర్చించి అవసరమైన కర్యాక్రమాలు రూపొందించాలని బొత్స ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ను డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని బొత్స హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement